అనంతపురం సప్తగిరి సర్కిల్ : నగరంలోని కొత్తూరు ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో ఈ నెల 13 నుంచి జరిగిన సెంట్రల్ జోన్ క్రీడా పోటీలు శనివారం విజయవంతంగా ముగిశాయి. బాలుర సీనియర్ ఓవరాల్ చాంపియన్‌గా 11 పాయింట్లతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల (అనంతపురం), కేసీజీహెచ్‌ఎస్ (కళ్యాణదుర్గం) జట్లు నిలిచాయి. బాలుర జూనియర్ ఓవరాల్ చాంపియన్‌గా 15 పాయింట్లతో కేసీజీహెచ్‌ఎస్ కళ్యాణదుర్గం జట్టు నిలిచింది.
సీనియర్ బాలికల ఓవరాల్ చాంపియన్‌గా 11 పాయింట్లతో జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల పెనుకొండ జట్టు నిలిచింది. జూనియర్ బాలికల ఓవరాల్ చాంపియన్‌గా 5 పాయింట్లతో కేజీబీవీ బెళుగుప్ప, జెడ్పీ ఉన్నత పాఠశాల తురకలాపట్నం, కేజీబీవీ రాప్తాడు, కేజీబీవీ మాలాపురం, జెడ్పీ ఉన్నత పాఠశాల ముదిరెడ్డిపల్లి జట్లు నిలిచాయి. సీనియర్ స్పోర్ట్స్ (క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్) బాలుర సీనియర్ విభాగంలో కేసీజీహెచ్‌ఎస్ కళ్యాణదుర్గం పాఠశాల నిలిచింది. బాలుర జూనియర్ విభాగంలో జెడ్పీ ఉన్నత పాఠశాల శ్రీరంగరాజుపల్లి, జెడ్పీ ఉన్నత పాఠశాల నల్లమాడ జట్లు నిలిచాయి. బాలికల సీనియర్, జూనియర్ విభాగంలో జెడ్పీ ఉన్నత పాఠశాల నింబగల్లు జట్టు నిలిచింది.
- ఇండివిజువల్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్‌లో బాలుర సీనియర్ విభాగంలో రఘునందన్ (కేసీజీహెచ్‌ఎస్ కళ్యాణదుర్గం) నిలిచాడు.
జూనియర్ బాలుర విభాగంలో : జీవన్ (జెడ్పీ ఉన్నత పాఠశాల శ్రీరంగరాజుపల్లి).
సీనియర్ బాలికల విభాగంలో : దీప్తి (జెడ్పీ ఉన్నత పాఠశాల చల్లపల్లి)
జూనియర్ బాలికల విభాగంలో : ధనలక్ష్మీ (జెడ్పీ ఉన్నత పాఠశాల నింబగల్లు)
క్రీడలతో ఆరోగ్యం
ప్రతిరోజూ క్రీడల్లో పాల్గోనడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని డీఎస్‌డీఓ బాషామొహిద్దీన్ తెలిపారు. సెంట్రల్ జోన్ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయనతోపాటు రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశులు, కొత్తూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సూర్యకళలు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొనే వారు ఆరోగ్యవంతంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో ఏడీఎస్‌ఎస్‌ఏఏ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, శంకరన్న, వేణుగోపాల్, ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ కార్యదర్శి గోపాల్, లింగమయ్య, నాగరాజు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన సెంట్రల్ జోన్ క్రీడా పోటీలు
Published Sun, Dec 25 2016 1:15 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement