సెంట్రల్‌ జోన్‌కు వీఆర్‌ఎస్‌ కళాశాల | vrs students selected to central zone | Sakshi
Sakshi News home page

చీరాల సెంట్రల్‌ జోన్‌కు వీఆర్‌ఎస్‌ కళాశాల

Published Tue, Oct 25 2016 10:28 PM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM

సెంట్రల్‌ జోన్‌కు వీఆర్‌ఎస్‌ కళాశాల

సెంట్రల్‌ జోన్‌కు వీఆర్‌ఎస్‌ కళాశాల

చీరాలటౌన్‌: స్థానిక వీఆర్‌ఎస్‌ అండ్‌ వైఆర్‌ఎన్‌ కళాశాల్లో   ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్‌ కళాశాలల సౌత్‌ జోన్‌ క్రికెట్‌ పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి.

రెండో రోజు మంగళవారం నిర్వహించిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేపట్టిన చీరాల వీఆర్‌ఎస్‌ అండ్‌ వైఆర్‌ఎన్‌ కళాశాల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌ చేపట్టిన ఒంగోలు గీతం డిగ్రీ కళాశాల జట్టు 18 ఓవర్లకే ఆల్‌అవుట్‌ అయి కేవలం 68 పరుగులు సాధించి ఓటమి చెందింది. దీంతో సెంట్రల్‌ జోన్‌కు వీఆర్‌ఎస్‌ జట్టు స్థానం సాధించింది.

బుధవారం గుంటూరు హిందూ కళాశాల జట్టు, యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుందని కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ చిమటా సుబ్బారావు తెలిపారు. వీఆర్‌ఎస్‌ జట్టులో నరేష్, నాగేంద్ర, అజయ్‌  చక్కని ప్రతిభచూపి జట్టు విజయానికి కృషి చేశారు. సెంట్రల్‌ జోన్‌కు అర్హత సాధించిన వీఆర్‌ఎస్‌ జట్టును కళాశాల ప్రిన్సిపాల్‌ బాల సుబ్బారావు, అధ్యాపకులు జాగర్లమూడి దేవి అభినందించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement