batting skills
-
''పుజారా సార్' నాలా బ్యాటింగ్ చేయలేడు.. నేను అంతే!'
కెరీర్ ఆరంభంలో ఒక మెరుపులా వచ్చి భవిష్యత్తు స్టార్ క్రికెటర్‌గా తయారవుతాడనుకున్న పృథ్వీ షా పాతాళానికి పడిపోయాడు. అగ్రెసివ్ ఆటతీరుతో ఆకట్టుకున్న పృథ్వీ ప్రస్తుతం టీమిండియా జట్టులో చోటు కోల్పోయాడు. ఇటవలే ముగిసిన ఐపీఎల్‌లోనూ పృథ్వీ షా పెద్దగా రాణించింది లేదు. దీనికి తోడు వివాదాలు అతన్ని చుట్టుముట్టాయి. ఇక 2021లో శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్ పుజారాకు ఆఖరిది. ఆ తర్వాత మళ్లీ జట్టులోకి రాలేకపోయాడు. తాజాగా దులీప్ ట్రోపీలో వెస్ట్‌జోన్ తరపున పాల్గొంటున్న పృథ్వీ షా ఆ తర్వాత దేవదర్ ట్రోపీలోనూ ఆడాలనుకుంటున్నాడు. అటుపై ఇంగ్లండ్‌లో జరిగే కౌంటీ క్రికెట్లో తొలిసారి నార్తంప్టన్‌షైర్ తరపున బరిలోకి దిగనున్నాడు. కౌంటీల్లో రాణించి మళ్లీ టీమిండియాలోకి రావాలని పృథ్వీ షా నిశ్చయించుకున్నాడు. జూలై 12 నుంచి వెస్ట్‌జోన్, సౌత్‌జోన్ల మధ్య దులీప్ ట్రోపీ ఫైనల్ జరగనుంది. ఇక సెంట్రల్ జోన్‌తో సెమీఫైనల్ ముగిశాకా విజయంపై స్పందించిన పృథ్వీ షా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''నేను నా ఆటను మార్చుకోవాలనుకోవడం లేదు. కాకపోతే నా గేమ్‌కు కాస్త స్మార్ట్‌నెస్‌ను యాడ్ చేసుకునే ప్రయత్నం చేస్తా. నేను పుజారా సార్లా బ్యాటింగ్ చేయలేను.. ఆయన నాలా బ్యాటింగ్ చేయలేడు. ఈ విషయంలో ఎవరి బ్యాటింగ్ స్టైల్ వారికి ఉంటుంది. ఇన్నేళ్లుగా నాకున్న అగ్రెసివ్నెస్ బ్యాటింగ్‌ను వదులుకోలేను.. కానీ స్మార్ట్‌గా ఆడడానికి ప్రయత్నిస్తా. ఇక వెస్ట్‌జోన్ దులీప్ ట్రోపీలో ఫైనల్ చేరడం సంతోషంగా ఉంది. నేను ముంబైకి ఆడొచ్చు.. లేదంటే వెస్ట్‌జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండొచ్చు.. కానీ ఆట అనేది చాలా ముఖ్యం. ఒక రకంగా నా కెరీర్‌కు ఈ ఫైనల్ ఉపయోగపడుతుందంటే బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తా. ఇక గత ఏడాదిగా రెడ్‌బాల్ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నా. ఒక మ్యాచ్‌లో త్రిబుల్ సెంచరీ(370 పరుగులు Vs అస్సాం) మరిచిపోలేని ఇన్నింగ్స్. కానీ వైట్‌బాల్‌లో అంత ప్రభావాన్ని చూపించలేకపోయా. కానీ రెడ్‌బాల్ క్రికెట్లో నా బ్యాటింగ్ మెరుగుపరుచుకోవడం కోసం శతవిధాల ప్రయత్నిస్తున్నా.. త్వరలోనే మళ్లీ టీమిండియా నుంచి పిలుపు వస్తుందని ఆశిస్తున్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: #DuleepTrophy: 5 ఓవర్లకు 53 నిమిషాలు.. గెలుపు అడ్డుకోవడం కోసం ఇన్ని కుట్రలా? -
'నాలుగేళ్ల వయసులో వాడేంటో తెలిసింది... ఇది ఊహించిందే!'
శివమ్ దూబే గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్లో సీఎస్కే తరపున ఆడుతున్న ఈ యంగ్ ప్లేయర్ తానేంటో ఇప్పటికే చాలాసార్లు నిరూపించుకున్నాడు. పవర్ హిట్టర్‌గా పేరు పొందిన శివమ్ దూబే ఈ సీజన్లోనూ మరింత రాటుదేలాడు. భారీ సిక్సర్లకు పెట్టింది పేరైన దూబే గ్రౌండ్లోకి అడుగుపెట్టింది మొదలు సిక్సర్లు బాదడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ సీజన్లో సీఎస్కే తరపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా దూబే నిలిచాడు. 12 ఇన్నింగ్స్‌ల్లో దూబే 12 ఫోర్లు, 33 సిక్సర్లతో 385 పరుగులు చేశాడు. ఫోర్లు కొట్టడం కంటే సిక్సర్లు కొట్టడమే ఇష్టమని శివమ్ దూబే పేర్కొన్నాడు. అయితే దూబే బాదుడును తండ్రి రాజేశ్ దూబే ముందే ఊహించాడట. దూబే నాలుగేళ్ల వయసులోనే వాడి హిట్టింగ్ పవరేంటో తెలిసిందని రాజేశ్ దూబే చెప్పుకొచ్చాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో రాజేశ్ దూబే మాట్లాడుతూ.. ''వాడికి(శివమ్ దూబే) నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడే హిట్టింగ్ పవర్ ఏంటో చూశాను. టెన్నిస్ బంతి పడడమే ఆలస్యం ముందుకొచ్చి బంతిని కసితీరా బాదేవాడు. అప్పుడే నిర్ణయించుకున్నా వాడు క్రికెటర్ అవ్వాలని. అందుకోసం ప్రతీరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు టెన్నిస్ బాల్‌తో ప్రాక్టీస్ చేయించేవాడిని. అలా 20 నుంచి 24 ఏళ్ల పాటు వాడి తొలి కోచ్‌ను అయ్యా. స్వయానా నేను రెజ్లర్ కావడం వాడి శిక్షణకు కాస్త ఉపయోగపడింది. ఇక ప్రాక్టీస్ తర్వాత ఊరిలోనే ప్రత్యేకంగా తయారు చేసిన ఆముదం నూనెతో గంటన్నర పాటు దూబే శరీరానికి మసాజ్ చేసేవాడిని. అండర్-14 వెళ్లేవరకు దూబేకు ఓనమాలు నేర్పిన గురువునయ్యాను. ఆ తర్వాత వాడు క్రమంగా ఎదిగాడు. ఇంటికొచ్చిన ప్రతీసారి కూడా వాడితో నేను క్రికెట్ ఆడేవాడిని. బ్యాటింగ్‌లో లోపాలు ఉంటే గుర్తించి చెప్పేవాడిని. ఆరు అడుగులకు పైగా ఎదిగిన వాడు బ్యాట్ పట్టి సిక్సర్లు కొడితే మైదానం బయటే పడేవి. పవర్ హిట్టింగ్ అనేది వాడికి చిన్నప్పటి నుంచే ఇష్టం. ఐపీఎల్లో వాడు కొత్తగా నిరూపించుకోవడానికి ఏం లేదు. నా దృష్టిలో దేశానికి ఆడడం గొప్ప అచీవ్మెంట్. అది దూబే సాధించాడు. 2019 నవంబర్ నుంచి 2020 ఫిబ్రవరి వరకు టీమిండియా తరపున 14 మ్యాచ్‌లాడడం గొప్ప విషయం. అయితే ఆ తర్వాత తుది జట్టులో చోటు కోల్పోవడం బాధించినా.. ఈ సీజన్లో దూబే చేస్తున్న ప్రదర్శను చూసిన తర్వాత మళ్లీ టీమిండియాలో అడుగుపెడతాడని నమ్మకం వచ్చింది.'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: ఐపీఎల్ 2023 లీగ్ స్టేజీలో బద్దలైన రికార్డులివే కోహ్లికి సాటెవ్వరు.. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన మొనగాడిగా -
తండ్రికి తగ్గ తనయుడు.. ఆ పోలికలు ఎక్కడికి పోతాయి
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం శివనరైన్ చందర్‌పాల్ గుర్తున్నాడు కదా.. రెండు దశాబ్దాల పాటు విండీస్ క్రికెట్లో మిడిలార్డర్లో మూల స్తంభంగా నిలిచాడు. బ్రియాన్ లారా తర్వాత టెస్టు క్రికెట్లో చందర్‌పాల్ విండీస్ జట్టులో కీలకపాత్ర పోషించాడు. అతని బ్యాటింగ్ స్టైల్ ఒక యూనిక్ అని చెప్పొచ్చు. క్రీజులో కాస్త వంకరగా నిలబడి మిడిల్ వికెట్‌ను మొత్తం కవర్ చేస్తూ బ్యాటింగ్ చేయడం అతనికి మాత్రమే సాధ్యం. రెండు దశాబ్దాల పాటు క్రికెట్ ఆడిన చందర్‌పాల్ బ్యాటింగ్ స్టాండింగ్ విషయంలో ఏనాడు ఒక్క ఫిర్యాదు రాలేదంటే అర్థం చేసుకోవచ్చు. తాజాగా చందర్‌పాల్ కొడుకు టగ్‌నరైన్ చందర్‌పాల్ కూడా విండీస్ క్రికెట్లో అడుగుపెట్టాడు. అచ్చం తండ్రిలానే బ్యాటింగ్ చేస్తూ అందరిని ఆకట్టుకున్నాడు. చందర్పాల్ది యూనిక్ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ అని అంటారు. అతనిలా మరే ఆటగాడు బ్యాటింగ్ చేయకపోవచ్చని పేర్కొన్నారు. కానీ ఆ మాటలను టగ్‌నరైన్ చందర్‌పాల్ బ్రేక్ చేశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్‌గా వచ్చిన టగ్‌నరైన్ చందర్‌పాల్ అచ్చం తండ్రి బ్యాటింగ్‌ను గుర్తు చేస్తూ ఇన్నింగ్స్ కొనసాగించాడు. తండ్రి బ్యాటింగ్ స్టైల్‌ను అనుకరిస్తూ ఆడిన టగ్‌నరైన్ అర్థశతకం సాధించాడు. ఓవరాల్‌గా 79 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 51 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియోనూ క్రికెట్ ఆస్ట్రేలియా తమ ట్విటర్లో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు.. తండ్రికి తగ్గ కొడుకు.. ఆ పోలికలు ఎక్కడికి పోతాయి.. అంటూ కామెంట్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు క్రెయిగ్ బ్రాత్‌వైట్ 64, టగ్‌నరైన్ చందర్‌పాల్ 51 మినహా పెద్దగా ఎవరు రాణించలేదు. బ్లాక్‌వుడ్ 36, షమ్రా బ్రూక్స్ 33 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలింగ్‌లో కమిన్స్, స్టార్క్ చెరో మూడు వికెట్లు తీయగా.. నాథన్ లియోన్ 2, కామెరున్ గ్రీన్, హాజిల్‌వుడ్ చెరొక వికెట్ తీశారు. అంతకముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 598 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్‌లు డబుల్ సెంచరీలతో మెరిశారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 336 పరుగుల ఆధిక్యంలో ఉంది. Chanderpaul taking on Cummins! #AUSvWI pic.twitter.com/MMS31dMZjW — cricket.com.au (@cricketcomau) December 1, 2022 చదవండి: 17 ఏళ్ల తర్వాత తొలి టెస్టు మ్యాచ్.. 657 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ -
అందుకే నా ఆటతీరులో మార్పు: చతేశ్వర్ పుజారా
కాన్పూర్: ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడటం వల్లే తన ఆటతీరులో మార్పు వచ్చిందని, అంతే తప్ప బ్యాటింగ్ టెక్నిక్ మార్చలేదని భారత టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా అన్నాడు. మూడేళ్లుగా ఒక్క సెంచరీ కూడా చేయలేకపోవడం లోటే అయినా అదేం పెద్ద సమస్య కాదని అన్నాడు. జట్టు విజయాలకు తాను చేసే 80, 90 పరుగులు దోహదం చేసినపుడు ఏ బెంగా ఉండబోదని చెప్పాడు. విమర్శల తాకిడి తర్వాత ఇంగ్లండ్‌లో తాను బ్యాటింగ్‌లో దూకుడు పెంచిన మాట వాస్తవమేనని పుజారా అన్నాడు. ‘నా బ్యాటింగ్‌లో వేగం పెరిగింది. ఇది నా ఆటతీరుకు భిన్నమే, కానీ... టెక్నిక్ విషయంలో నేను ఏమాత్రం మారలేదు. ఆ అవసరం కూడా లేదనే అనుకుంటున్నాను. నేను ధాటిగా ఆడేందుకు ఇంగ్లండ్ పర్యటన దోహదం చేసింది’ అని అన్నాడు. లీడ్స్, ఓవల్ వేదికలపై వరుసగా 91 పరుగులు, 61 పరుగులతో పుజారా రాణించాడు. ‘ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఒత్తిడి లేకుండా ఆడాలనుకున్నాను. ఈ మైండ్‌సెట్‌తోనే మైదానంలో దిగాను. స్వేచ్ఛగా నా ఆట నేను ఆడుకున్నాను. సమయమొచ్చినపుడు సెంచరీ కూడా సాధిస్తాను. దాని గురించి ఏ బాధ లేదు. జట్టుకు అవసరమైన సమయంలో పరుగులైతే చేస్తూనే ఉన్నాను’ అని అన్నాడు. కొత్తగా వైస్ కెప్టెన్సీని బాధ్యతగా భావిస్తానని చెప్పాడు. వైస్ కెప్టెన్ కానప్పుడే జూనియర్లతో ఎప్పుడు తన అనుభవాన్ని పంచుకున్నానని... ఇకమీదటా అంతేనని తెలిపాడు. రహానే అద్భుతంగా ఆడుతున్నాడని, భారీ స్కోరుకు ఒక ఇన్నింగ్స్ దూరంలో ఉన్నాడని సహచరుడిపై విశ్వాసం వ్యక్తం చేశాడు. కొత్త కోచ్ ద్రవిడ్ రాకతో కుర్రాళ్ల ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని చెప్పాడు. ‘ఎ’ జట్ల మధ్య జరిగిన సిరీస్ సమయం లో ద్రవిడ్‌తో పనిచేసిన అనుభవం ఉందన్నాడు. -
నా 'ఈ స్థాయికి' ధోనినే కారణం: జడ్డూ
ముంబై: అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో బ్యాటింగ్ పరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని, 2015 వన్డే ప్రపంచకప్ సందర్భంగా ధోని ఇచ్చిన సలహా తన బ్యాటింగ్‌ను ఎంతో మెరుగుపర్చిందని టీమిండియా స్టార్ ఆల్రండర్ రవీంద్ర జడేజా చెప్పుకొచ్చాడు. కెరీర్ ఆరంభంలో షాట్ల ఎంపిక విషయంలో చాలా తికమక పడేవాడినని, దీంతో షాట్ పిచ్ బంతులను ఆడమని ధోని సూచించాడని పేర్కొన్నాడు. కెరీర్లో ప్రస్తుతం తాను అనుభవిస్తున్న హోదాకు ధోనినే కారణమని ఆకాశానికెత్తాడు. ధోని చెప్పేంత వరకు షాట్ ఆడాలా వద్దా? ఏ షాట్ ఆడాలి? బంతిని వదిలేద్దామా?ఆడదామా? లాంటి ప్రశ్నలు మదిలో మెదిలేవని వెల్లడించాడు. ఈ తికమకలో క్రమంగా వికెట్ పారేసుకునేవాడినని, దీంతో జట్టులో స్థానం కూడా కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, గత రెండేళ్లుగా జడేజా కెరీర్ దూసుకుపోతుంది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ దుమ్మురేపుతూ, టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న జడ్డూ.. భారత జట్టు కీలక సభ్యుడిగా ఎదిగాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో ప్రారంభమైన అతని బ్యాటింగ్ విధ్వంసం.. నిరంతరాయంగా సాగుతూ టీమిండియాను తిరుగులేని శక్తిగా నిలబెట్టింది. ఇటీవల కాలంలో బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ విశ్వరూపం చూపిస్తున్న జడ్డూ.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు సమాయత్తమవుతున్న అతను.. బీసీసీఐ ఏర్పాటు చేసిన క్వారంటైన్లో ఉన్నాడు. చదవండి: వాళ్లు లేకపోయినంత మాత్రానా ఐపీఎల్ నిర్వహణ ఆగదు.. -
శ్రేయస్ టీనేజ్‌లో జరిగింది ఇది!
న్యూఢిల్లీ: టీనేజ్‌లో శ్రేయస్ అయ్యర్ ఆట ఆటకెక్కుతుంటే అతని తండ్రి పసిగట్టేశారు. అతన్ని ఓ మేటి ఆటగాడిగా చూడాలనుకున్న తండ్రి సంతోష్ అయ్యర్ వెంటనే కుమారుడిని గాడినపెట్టే పనిలో పడ్డారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వూ్యలో ఆయన వెల్లడించారు. ‘శ్రేయస్ 4 ఏళ్ల వయసులోనే బంతిని చక్కగా బాదేవాడు. అది చూసిన నాకు వాడి బ్యాటింగ్ ప్రతిభ అర్థమైంది. అందుకే వాణ్ని ఆ దిశగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాం. అయితే అండర్–16 క్రికెట్ ఆడే రోజుల్లో అతని బ్యాటింగ్ గతి తప్పింది. దీన్ని ఓ కోచ్ గమనించి నా చెవిన వేశాడు. మీ అబ్బాయికి ప్రతిభ ఉంది కానీ... ఏకాగ్రతే లేకుండా పోతోంది. ఆటపై ఏమాత్రం దృష్టి సారించలేకపోతున్నాడని చెప్పాడు. నేను ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాక అంతా సర్దుకుంది’ అని సంతోష్ అయ్యర్ తెలిపారు. అప్పట్లో తన కుమారుడు ప్రేమ మాయలో పడ్డాడో లేక సహచర దోషమోనని బెంగపట్టుకుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు శ్రేయస్ బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానం ప్రశ్నార్థకానికి సమాధానంగా నిలిచాడు. 18 వన్డేల్లో 748 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 8 అర్ధసెంచరీలున్నాయి. -
వాళ్లిద్దరికీ బ్యాటింగ్ గుర్తుకొస్తుందా?
ఈ సీజన్లో భారత జట్టు మంచి విజయాలు సాధిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. మూడు రంగాల్లోనూ టీమిండియా ప్రతిభ బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ, ఈ మూడు రంగాల్లో కూడా కొంతమంది మెరుపులు మెరిపిస్తుంటే మరికొందరు మాత్రం అంతంత మాత్రం ప్రదర్శనతో చూసేవాళ్లకు నీరసం తెప్పిస్తున్నారు. ప్రధానంగా టీమిండియా ఓపెనర్ల ద్వయం రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌ల బ్యాటింగ్ చూస్తుంటే అసలు వీళ్లకు బ్యాటింగ్ చేయడం గుర్తుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. టి20 ప్రపంచకప్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఏ మ్యాచ్‌లోనూ వీళ్లిద్దరూ అద్భుతంగా ఆడినట్లు చెప్పుకోడానికి లేదు. పైగా.. ఏమైనా అద్భుతమైన బాల్స్‌కు ఔటయ్యారా అంటే అదీ లేదు. దాదాపు ప్రతిసారీ చెత్తషాట్లకు ప్రయత్నించడం.. పెవిలియన్ బాట పట్టడం. ఆస్ట్రేలియా మీద రోహిత్ శర్మకు చాలా మంచి రికార్డు ఉందని, ఆ జట్టుమీదే తన డబుల్ సెంచరీ కూడా నమోదు చేసుకున్నాడని అతడి అభిమానులు భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కి ముందు సంబరపడ్డారు. ఇన్నాళ్లూ ఎలా ఉన్నా, ఈ మ్యాచ్‌తో అతడి ఫామ్ తిరిగొస్తుందని చాలా ఆశించారు. కానీ, పరిస్థితి యథాతథం. శిఖర్ ధావన్ కూడా అంతే. ఉన్న కాసేపు ధాటిగానే బ్యాటింగ్ చేస్తున్నా, దాన్ని భారీ స్కోరు దిశగా మాత్రం తీసుకెళ్లడంలో ఇద్దరూ విఫలం అవుతున్నారు. మిగిలిన జట్లన్నీ పవర్ ప్లే ఆరు ఓవర్లలో 50 నుంచి 70 వరకు పరుగులు పిండుకుంటుంటే, భారత ఓపెనర్లు మాత్రం ఆ సమయంలో ఉండే ఫీల్డింగ్ నిబంధనలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. అప్పుడే గట్టి పునాది పడితే.. ఆ తర్వాత వచ్చే మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ పని సులభం అవుతుంది. విరాట్ కోహ్లీ వీరవిహారం చేయడం వల్ల ఇన్ని మ్యాచ్‌లలో విజయం సాధించాం. అయితే ప్రతిసారీ ఒకే బ్యాట్స్‌మన్ మీద భారం మోపడం కూడా సరికాదు. ఇదే విషయాన్ని టీమ్ డైరెక్టర్ రవిశాస్త్రి కూడా జట్టు సభ్యులందరికీ స్పష్టంగా చెప్పాడు. టాపార్డర్ బ్యాట్స్‌మన్.. ముఖ్యంగా ఓపెనర్లు తమ బ్యాట్లు ఝళిపించాలని గట్టిగానే చెప్పినట్లు సమాచారం. అవతల ఉన్నది చాలామంది గట్టి బ్యాట్స్‌మన్ ఉన్న వెస్టిండీస్ లాంటి జట్టు అయినా.. ఐపీఎల్ పుణ్యమాని వాళ్లలో చాలామంది ఆటతీరు తెలుసు కాబట్టి, మన ఓపెనర్లు ఇప్పటికైనా మళ్లీ తమ పాత బ్యాటింగ్ నైపుణ్యాలను గుర్తుకు తెచ్చుకుని.. చకచకా తలో హాఫ్ సెంచరీ చేస్తే భారత జట్టు అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటారు.