west zone team
-
పృథ్వీ షా సెంచరీ.. భారీ ఆధిక్యం దిశగా వెస్ట్‌జోన్
టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా దులీప్ ట్రోఫీలో అద్భుత శతకంతో మెరిశాడు. సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో ఈ వెస్ట్‌జోన్ ఓపెనర్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఫలితంగా వెస్ట్‌జోన్ భారీ ఆధిక్యం దిశగా పరిగెడుతుంది. ఈ మధ్యన పృథ్వీ షా స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. టీమిండియాలో ఎక్కువగా ఓపెనింగ్‌లో వచ్చిన పృథ్వీ షా.. ఓపెనింగ్ స్థానానికి పోటీ పెరిగిపోవడం.. అతను ఫామ్ కోల్పోవడంతో క్రమక్రమంగా జట్టుకు దూరమయ్యాడు. మూడోరోజు తొలి సెషన్లో వెస్ట్‌జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. పృథ్వీ షా(131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 136 నాటౌట్), ఆర్మాన్ జాఫర్ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం వెస్ట్‌జోన్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలపుకొని 314 పరుగుల లీడ్‌లో ఉంది. అంతకముందు సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 128 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ కర్ణ్‌శర్మ 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఉనాద్కట్,తనుష్ కొటెన్‌లు చెరో 3 వికెట్లు తీయగా.. షెత్ 2, చింతన్ గజా, షామ్స్ ములాని చెరొక వికెట్ తీశారు. ఇక వెస్ట్‌జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 257 పరుగులకు ఆలౌటైంది. చదవండి: 'మొన్ననే కదా ఫైనల్ చేరారు.. అంత మాట ఎలా అంటావు!' 'డైరెక్టర్ గారూ.. ఫెదరర్‌కు, బాలీవుడ్ నటుడికి తేడా తెలియదా?' -
దేవధర్ ఫైనల్లో వెస్ట్‌జోన్
ముంబై: అక్షర్ పటేల్ (38 బంతుల్లో 64 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (56 బంతుల్లో 80; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌తో... దేవధర్ ట్రోఫీలో వెస్ట్‌జోన్ జట్టు ఫైనల్‌కు చేరింది. వాంఖడే స్టేడియంలో సోమవారం జరిగిన సెమీఫైనల్లో వెస్ట్ 2 వికెట్లతో సౌత్‌జోన్‌ను ఓడించింది. టాస్ గెలిచిన వెస్ట్ ఫీల్డింగ్ ఎంచుకోగా... సౌత్‌జోన్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 314 పరుగులు చేసింది. మయాంక్ (86), అపరాజిత్ (56), మనీష్ పాండే (55) అర్ధసెంచరీలు చేశారు. వెస్ట్‌జోన్ జట్టు 47.1 ఓవర్లలో 8 వికెట్లకు 319 పరుగులు చేసి నెగ్గింది. జాక్సన్ (51), రాయుడు (54) అర్ధసెంచరీలు చేశారు. 174 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయి ఓటమి కోరల్లో చిక్కుకున్న వెస్ట్‌జోన్‌ను... అక్షర్, సూర్యకుమార్ కలిసి గట్టెక్కించారు. బుధవారం జరిగే ఫైనల్లో వెస్ట్‌జోన్, ఈస్ట్‌జోన్ తలపడతాయి. -
దేవధర్ ట్రోఫీ ఫైనల్లో వెస్ట్‌జోన్
42 పరుగుల తేడాతో సెంట్రల్‌పై గెలుపు రాణించిన యూసుఫ్, పుజారా విశాఖపట్నం, న్యూస్‌లైన్: బ్యాటింగ్‌లో యూసుఫ్ పఠాన్ (57 బంతుల్లో 70; 9 ఫోర్లు, సిక్స్), చతేశ్వర్ పుజారా (96 బంతుల్లో 60; 4 ఫోర్లు)... బౌలింగ్‌లో ధావల్ కులకర్ణి (4/39) రాణించడంతో దేవధర్ ట్రోఫీ వన్డే టోర్నీలో వెస్ట్‌జోన్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో మంగళవారం జరిగిన రెండో సెమీఫైనల్లో వెస్ట్‌జోన్ 42 పరుగుల ఆధిక్యంతో సెంట్రల్ జోన్‌పై గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్‌జోన్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 233 పరుగులు చేసింది. పీయూష్ చావ్లా 4, కరణ్ శర్మ 2 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్‌జోన్ 44.3 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. శలభ్ శ్రీవాస్తవ (115 బంతుల్లో 65; 7 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. పీయూష్ చావ్లా (32 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి ఐదో వికెట్‌కు 63 పరుగులు జోడించాడు. లోయర్ ఆర్డర్లో ఉమేశ్ యాదవ్ (27 బంతుల్లో 30; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడినా.. సహచరుల నుంచి సరైన సహకారం అందలేదు. దీంతో సెంట్రల్ చివరి ఐదు వికెట్లను 55 పరుగుల తేడాతో చేజార్చుకుంది. అర్పిత్ 3, జైదేవ్ ఉనాద్కట్ 2 వికెట్లు పడగొట్టారు. గురువారం జరిగే ఫైనల్లో నార్త్‌జోన్, వెస్ట్‌జోన్ తలపడతాయి.