దేవధర్ ట్రోఫీ ఫైనల్లో వెస్ట్‌జోన్
42 పరుగుల తేడాతో సెంట్రల్‌పై గెలుపు
రాణించిన యూసుఫ్, పుజారా
విశాఖపట్నం, న్యూస్‌లైన్: బ్యాటింగ్‌లో యూసుఫ్ పఠాన్ (57 బంతుల్లో 70; 9 ఫోర్లు, సిక్స్), చతేశ్వర్ పుజారా (96 బంతుల్లో 60; 4 ఫోర్లు)... బౌలింగ్‌లో ధావల్ కులకర్ణి (4/39) రాణించడంతో దేవధర్ ట్రోఫీ వన్డే టోర్నీలో వెస్ట్‌జోన్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో మంగళవారం జరిగిన రెండో సెమీఫైనల్లో వెస్ట్‌జోన్ 42 పరుగుల ఆధిక్యంతో సెంట్రల్ జోన్‌పై గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్‌జోన్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 233 పరుగులు చేసింది. పీయూష్ చావ్లా 4, కరణ్ శర్మ 2 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్‌జోన్ 44.3 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. శలభ్ శ్రీవాస్తవ (115 బంతుల్లో 65; 7 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు.
పీయూష్ చావ్లా (32 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి ఐదో వికెట్‌కు 63 పరుగులు జోడించాడు. లోయర్ ఆర్డర్‌లో ఉమేశ్ యాదవ్ (27 బంతుల్లో 30; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడినా.. సహచరుల నుంచి సరైన సహకారం అందలేదు. దీంతో సెంట్రల్ చివరి ఐదు వికెట్లను 55 పరుగుల తేడాతో చేజార్చుకుంది. అర్పిత్ 3, జైదేవ్ ఉనాద్కట్ 2 వికెట్లు పడగొట్టారు. గురువారం జరిగే ఫైనల్లో నార్త్‌జోన్, వెస్ట్‌జోన్ తలపడతాయి.