central zone team
-
పృథ్వీ షా సెంచరీ.. భారీ ఆధిక్యం దిశగా వెస్ట్‌జోన్
టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా దులీప్ ట్రోఫీలో అద్భుత శతకంతో మెరిశాడు. సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో ఈ వెస్ట్‌జోన్ ఓపెనర్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఫలితంగా వెస్ట్‌జోన్ భారీ ఆధిక్యం దిశగా పరిగెడుతుంది. ఈ మధ్యన పృథ్వీ షా స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. టీమిండియాలో ఎక్కువగా ఓపెనింగ్‌లో వచ్చిన పృథ్వీ షా.. ఓపెనింగ్ స్థానానికి పోటీ పెరిగిపోవడం.. అతను ఫామ్ కోల్పోవడంతో క్రమక్రమంగా జట్టుకు దూరమయ్యాడు. మూడోరోజు తొలి సెషన్లో వెస్ట్‌జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. పృథ్వీ షా(131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 136 నాటౌట్), ఆర్మాన్ జాఫర్ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం వెస్ట్‌జోన్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలపుకొని 314 పరుగుల లీడ్‌లో ఉంది. అంతకముందు సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 128 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ కర్ణ్‌శర్మ 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఉనాద్కట్,తనుష్ కొటెన్‌లు చెరో 3 వికెట్లు తీయగా.. షెత్ 2, చింతన్ గజా, షామ్స్ ములాని చెరొక వికెట్ తీశారు. ఇక వెస్ట్‌జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 257 పరుగులకు ఆలౌటైంది. చదవండి: 'మొన్ననే కదా ఫైనల్ చేరారు.. అంత మాట ఎలా అంటావు!' 'డైరెక్టర్ గారూ.. ఫెదరర్‌కు, బాలీవుడ్ నటుడికి తేడా తెలియదా?' -
సెమీస్‌లో సెంట్రల్ జోన్
రాణించిన చావ్లా, నమన్ ఓజా దేవధర్ ట్రోఫీ విశాఖపట్నం, న్యూస్‌లైన్: ప్రతిష్టాత్మక జోనల్ వన్డే నాకౌట్ టోర్నీ దేవధర్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఆల్‌రౌండ్ నైపుణ్యాన్ని ప్రదర్శించిన సెంట్రల్ జట్టు ఆదివారం జరిగిన క్వార్టర్ఫైనల్లో రెండు వికెట్ల తేడాతో ఈస్ట్‌జోన్‌పై విజయం సాధించింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఈస్ట్ జోన్ 46.2 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. దేబబ్రత (39), గోస్వామి (32), శుక్లా (28), జగ్జీ (28) ఓ మోస్తరుగా ఆడారు. స్పిన్నర్ పీయూష్ చావ్లా (5/38) తన మ్యాజిక్‌ను ప్రదర్శించాడు. అనురిత్, ఉమేశ్ యాదవ్, జలజ్, కరణ్‌లు తలా ఓ వికెట్ తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ 43 ఓవర్లలో 8 వికెట్లకు 198 పరుగులు చేసింది. నమన్ ఓజా (65 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓ దశలో సెంట్రల్ మూడు పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయినా... ఓజా రెండు కీలక భాగస్వామ్యాలతో జట్టును ఆదుకున్నాడు. చావ్లాతో కలిసి ఆరో వికెట్‌కు 43, కరణ్ శర్మ (22)తో కలిసి ఏడో వికెట్‌కు 47 పరుగులు జోడించాడు. నమన్ ఓజాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.