సెమీస్‌లో సెంట్రల్ జోన్ | central zone entered in semi final | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సెంట్రల్ జోన్

Published Mon, Mar 24 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 5:04 AM

సెమీస్‌లో సెంట్రల్ జోన్

సెమీస్‌లో సెంట్రల్ జోన్

రాణించిన చావ్లా, నమన్ ఓజా
 దేవధర్ ట్రోఫీ
 
 విశాఖపట్నం, న్యూస్‌లైన్: ప్రతిష్టాత్మక జోనల్ వన్డే నాకౌట్ టోర్నీ దేవధర్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఆల్‌రౌండ్ నైపుణ్యాన్ని ప్రదర్శించిన సెంట్రల్ జట్టు ఆదివారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో రెండు వికెట్ల తేడాతో ఈస్ట్‌జోన్‌పై విజయం సాధించింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఈస్ట్ జోన్ 46.2 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. దేబబ్రత  (39), గోస్వామి (32), శుక్లా (28), జగ్జీ (28) ఓ మోస్తరుగా ఆడారు. స్పిన్నర్ పీయూష్ చావ్లా (5/38) తన మ్యాజిక్‌ను ప్రదర్శించాడు.
 
 అనురిత్, ఉమేశ్ యాదవ్, జలజ్, కరణ్‌లు తలా ఓ వికెట్ తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ 43 ఓవర్లలో 8 వికెట్లకు 198 పరుగులు చేసింది. నమన్ ఓజా (65 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓ దశలో సెంట్రల్ మూడు పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయినా... ఓజా రెండు కీలక భాగస్వామ్యాలతో జట్టును ఆదుకున్నాడు. చావ్లాతో కలిసి ఆరో వికెట్‌కు 43, కరణ్ శర్మ (22)తో కలిసి ఏడో వికెట్‌కు 47 పరుగులు జోడించాడు. నమన్ ఓజాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement