one day knock out tournment
-
సెమీస్‌లో సెంట్రల్ జోన్
రాణించిన చావ్లా, నమన్ ఓజా దేవధర్ ట్రోఫీ విశాఖపట్నం, న్యూస్‌లైన్: ప్రతిష్టాత్మక జోనల్ వన్డే నాకౌట్ టోర్నీ దేవధర్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఆల్‌రౌండ్ నైపుణ్యాన్ని ప్రదర్శించిన సెంట్రల్ జట్టు ఆదివారం జరిగిన క్వార్టర్ఫైనల్లో రెండు వికెట్ల తేడాతో ఈస్ట్‌జోన్‌పై విజయం సాధించింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఈస్ట్ జోన్ 46.2 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. దేబబ్రత (39), గోస్వామి (32), శుక్లా (28), జగ్జీ (28) ఓ మోస్తరుగా ఆడారు. స్పిన్నర్ పీయూష్ చావ్లా (5/38) తన మ్యాజిక్‌ను ప్రదర్శించాడు. అనురిత్, ఉమేశ్ యాదవ్, జలజ్, కరణ్‌లు తలా ఓ వికెట్ తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ 43 ఓవర్లలో 8 వికెట్లకు 198 పరుగులు చేసింది. నమన్ ఓజా (65 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓ దశలో సెంట్రల్ మూడు పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయినా... ఓజా రెండు కీలక భాగస్వామ్యాలతో జట్టును ఆదుకున్నాడు. చావ్లాతో కలిసి ఆరో వికెట్‌కు 43, కరణ్ శర్మ (22)తో కలిసి ఏడో వికెట్‌కు 47 పరుగులు జోడించాడు. నమన్ ఓజాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. -
హెచ్‌సీఏ నాకౌట్ టోర్నీ ఫైనల్లో బాయ్స్టౌన్
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీఏ కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ టోర్నమెంట్లో బాయ్స్టౌన్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో అజ్మత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బాయ్స్టౌన్ 22 పరుగుల తేడాతో క్లాసిక్ జట్టుపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బాయ్స్టౌన్ 158 పరుగులు చేసి ఆలౌటైంది. అజ్మత్ ఖాన్ (40) ఫర్వాలేదనిపించగా... వేణు యాదవ్ 30, సైఫ్ ఉల్ హసన్ 32 పరుగులు చేశారు. క్లాసిక్ బౌలర్ మహ్మద్ నదీమ్ 6 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన క్లాసిక్ 136 పరుగులకే ఆలౌటైంది. రషీద్ అహ్మద్ (34) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. బౌలింగ్‌లోనూ రాణించిన అజ్మత్ ఖాన్ 5 వికెట్లు పడగొట్టాడు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పోస్టల్ జట్టు 7 వికెట్ల తేడాతో ఇన్కమ్ ట్యాక్స్ జట్టుపై గెలుపొందింది. మొదట ఇన్కమ్ ట్యాక్స్ 172 పరుగుల వద్ద ఆలౌటైంది. తర్వాత పోస్టల్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసి నెగ్గింది. -
ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ విజయం
సాక్షి, హైదరాబాద్: సురేష్ (71), అబ్దుల్ ఫరీద్ (55) అర్ధసెంచరీలు సాధించడంతో ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ జట్టు 58 పరుగుల తేడాతో ఎంపీ కోల్ట్స్‌పై ఘనవిజయం సాధించింది. హెచ్‌సీఏ మూడు రోజుల వన్డే నాకౌట్ టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ 9 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. అయితే లక్ష్యఛేదనలో ఎంపీ కోల్ట్స్ 8 వికెట్లు కోల్పోయి 208 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనిరుధ్ (51), విశాల్ ఫిలిప్స్ (55 నాటౌట్)లు అర్ధసెంచరీలు సాధిం చినా జట్టుకు విజయాన్నందించలేకపోయారు. ఎలిజార్ (3/43), సుధాకర్ (3/34) మూడేసి వికెట్లు తీసి ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఫలక్‌నుమా: 248/5 (అశోక్ 114, చైతన్య 73); ఈఎంసీసీ: 251/7 (రవితేజ 41, షిండే 99). ఎన్స్‌కాన్స్: 274/5 (అజ్మత్ 55, అరుణ్ 74, ఖలీల్ 62, సయ్యద్ అలీ 34 నాటౌట్); హైదరాబాద్ బాట్లింగ్: 258 (షేక్ మహ్మద్ 72, వినయ్ గౌడ్ 36, వంశీవర్ధన్ రెడ్డి 77, పృథ్వీరెడ్డి 36; మెహదీ హసన్ 4/38). క్లాసిక్: 245 (ఉమ్రాన్ 32, బాబర్ 47, నదీమ్ 33, అలీఖాన్ 46; మనీష్ 3/35); కిశోర్ సన్స్: 128 (రామ్‌నారాయణ్ 45; రఫీ 3/14, యూసుఫ్ 6/23). -
క్లాసిక్ జట్టు గెలుపు
జింఖానా, న్యూస్‌లైన్: హెచ్‌సీఏ కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో క్లాసిక్ జట్టు 13 పరుగుల తేడాతో విజయనగర్ జట్టుపై విజయం సాధించింది. తొలుత క్లాసిక్ జట్టు 216 పరుగుల వద్ద ఆలౌటైంది. బాబర్ (52) అర్ధ సెంచరీతో రాణించాడు. అనంతర ం విజయనగర్ జట్టు 203 పరుగులు చేసి ఆలౌటైంది. క్లాసిక్ జట్టు బౌలర్లు హైదర్ 4 ,యూసుఫ్ 3 వికెట్లు తీసుకున్నారు. ఎ-ఇన్స్టిట్యూషన్ వన్డే లీగ్ ఐఏఎఫ్: 174 (దీపక్ యాదవ్ 40; రమేష్ 5/38, అక్షయ్ 3/53); నేషనల్ ఇన్సూరెన్స్: 145 (శర్మ 38). విద్యుత్ సౌధ: 146/8 (అలీ 32, సురేష్ బాబు 31, శ్రీనివాస్ 35; విజయ్ కుమార్ 3/20, శేఖర్ 4/45); ఈసీఐఎల్: 134/9 (విజయ్ కుమార్ 34; జగన్నాథ్ 5/50). వీఎస్టీ: 148 (ప్రియారాజ్ 69; శ్రీనివాస్ 7/58); ఐఐసీటీ: 149/5 (థామస్ 34, శ్రీనివాస్ 54). -
బెంబేలెత్తించిన నాగరాజు
సాక్షి, హైదరాబాద్: కిషన్ ప్రసాద్ హెచ్‌సీఏ వన్డే నాకౌట్ టోర్నమెంట్లో ఇన్‌కమ్‌ట్యాక్స్ జట్టు 3 వికెట్ల తేడాతో కల్నల్ అక్రిలిక్ జట్టుపై గెలిచింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అక్రిలిక్ జట్టును ఇన్‌కమ్‌ట్యాక్స్ బౌలర్ నాగరాజు (5/29) బెంబేలెత్తించాడు. దీంతో అక్రిలిక్ జట్టు 132 పరుగులకే ఆలౌటైంది. అల్తాఫ్ (62) అర్ధసెంచరీ చేశాడు. తర్వాత ఇన్‌కమ్‌ట్యాక్స్ ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. హిమాన్షు జోష్ 40 పరుగులు చేశాడు. హెచ్ఏఎల్తో జరిగిన ‘ఎ’ ఇన్స్టిట్యూషన్ వన్డే లీగ్ మ్యాచ్‌లో జగన్నాథ్ (6/29) హడలెత్తించడంతో విద్యుత్‌సౌధ 17 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. ఎ-ఇన్స్టిట్యూషన్ వన్డే లీగ్ స్కోర్లు కెనరా బ్యాంక్: 99 (వికాస్ 40; కలిరాజ్ 4/23, ఎన్వీఎన్ రాజు 3/13, చలపతి 3/30) ఎన్ఎఫ్సీ: 100/1 (నాయుడు 35 నాటౌట్, సాండీ 39 నాటౌట్). విద్యుత్‌సౌధ: 131, హెచ్ఏఎల్: 114 (జగన్నాథ్ 6/29, శ్రీనివాస్ 3/15). హెచ్‌సీఏ సంతాపం ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం (ఏపీఓఏ) మాజీ కార్యదర్శి ఎల్. వెంకట్రామ్ రెడ్డి మృతి పట్ల హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) సంతాపం తెలిపింది. గతంలో హెచ్‌సీఏ కార్యవర్గసభ్యుడిగా పనిచేసిన ఆయన మృతి క్రీడారంగానికి తీరని లోటు అని హెచ్‌సీఏ అధ్యక్షుడు జి.వినోద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు హెచ్‌సీఏ తరఫున ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. హెచ్‌సీఏ కార్యవర్గం ఆయన సేవలను కొనియాడింది. -
మెరిసిన సంతోష్
జింఖానా, న్యూస్‌లైన్: ఎలెవన్ మాస్టర్ జట్టు బ్యాట్స్‌మన్ సంతోష్ (121) సెంచరీతో చెలరేగడంతో ఆ జట్టు 82 పరుగుల తేడాతో మాంచెస్టర్ జట్టుపై విజయం సాధించింది. హెచ్‌సీఏ కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఎలెవన్ మాస్టర్ 3 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. హరీష్ (72 నాటౌట్) అర్ధ సెంచరీతో అజేయంగా నిలవగా... నరేష్ 37 పరుగులు చేశాడు. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన మాంచెస్టర్ 4 వికెట్ల నష్టానికి 183 పరుగులు మాత్రమే చేయగలిగింది. చరణ్ (66) అర్ధ సెంచరీతో రాణించగా... నదీమ్ 31 పరుగులు చేశాడు. మరో మ్యాచ్‌లో విజయ్ భరత్ జట్టు బౌలర్ నరసింహ (5/35) ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. దీంతో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో ఫ్యూచర్ స్టార్ జట్టుపై గెలుపొందింది. తొలుత బరిలోకి దిగిన ఫ్యూచర్ స్టార్ 132 పరుగులకే కుప్పకూలింది. కృష్ణ (37) మినహా మిగిలిన వారు రాణించలేకపోయారు. తర్వాత బ్యాటింగ్ చేసిన విజయ్ భారత్ 6 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసి నెగ్గింది. రాజ్ (37) ఫర్వాలేదనిపించాడు. ఫ్యూచ ర్ స్టార్ బౌలర్ కృష్ణ 3 వికెట్లు తీసుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు డెక్కన్ కోల్ట్స్: 158 ( ప్రతీక్ 108 ); ఎస్ఎన్ గ్రూప్: 102 ( సంతోష్ 3/12, కిషన్ 3/24). సఫిల్‌గూడ: 161 ( నిరూప్ 4/20); గ్రీన్ టర్ఫ్: 164/7 (ఉదయ్ కిరణ్ రెడ్డి 64, చార్లెస్ 4/40). ఐఐసీటీ: 132 (శ్రీనివాస్ 33; రామకృష్ణ 4/28, సోహన్ 3/12); కన్సల్ట్: 137/2 (వికాస్ రావు 70). హైదరాబాద్ పేట్రియాట్స్: 224 (మోసిన్ 45, అకీల్ అహ్మద్ 56, ఇమ్రోజ్ 39); ఓఎంసీ: 171 (శ్రీకాంత్ 31, హేమంత్ 31, వంశీ 42; అక్షయ్ 4/17, షాదాబ్ 4/8). ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్ కొసరాజు: 137 (రిత్విక్ 54; ఫాహీమ్ 3/18); ఎస్ఏ అంబర్పేట్: 141/4 (రాకేష్ 58; అజయ్ పట్వారి 3/68). ఎ-ఇన్స్టిట్యూషన్ వన్డే లీగ్ ఐఏఎఫ్: 214 (శంకరీయ 110); ఎంసీహెచ్: 135 (అజీమ్ 50, జితేందర్ 30; దీపక్ 5/21).