బెంబేలెత్తించిన నాగరాజు | Nagaraju took Five wickets | Sakshi
Sakshi News home page

బెంబేలెత్తించిన నాగరాజు

Published Sat, Jan 4 2014 11:58 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Nagaraju took Five wickets

సాక్షి, హైదరాబాద్: కిషన్ ప్రసాద్ హెచ్‌సీఏ వన్డే నాకౌట్ టోర్నమెంట్‌లో ఇన్‌కమ్‌ట్యాక్స్ జట్టు 3 వికెట్ల తేడాతో కల్నల్ అక్రిలిక్ జట్టుపై గెలిచింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అక్రిలిక్ జట్టును ఇన్‌కమ్‌ట్యాక్స్ బౌలర్ నాగరాజు (5/29) బెంబేలెత్తించాడు. దీంతో అక్రిలిక్ జట్టు 132 పరుగులకే ఆలౌటైంది.
 
 అల్తాఫ్ (62) అర్ధసెంచరీ చేశాడు. తర్వాత ఇన్‌కమ్‌ట్యాక్స్ ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. హిమాన్షు జోష్ 40 పరుగులు చేశాడు. హెచ్‌ఏఎల్‌తో జరిగిన ‘ఎ’ ఇన్‌స్టిట్యూషన్ వన్డే లీగ్ మ్యాచ్‌లో జగన్నాథ్ (6/29) హడలెత్తించడంతో విద్యుత్‌సౌధ 17 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది.
 
 ఎ-ఇన్‌స్టిట్యూషన్ వన్డే లీగ్ స్కోర్లు
  కెనరా బ్యాంక్: 99 (వికాస్ 40; కలిరాజ్ 4/23, ఎన్‌వీఎన్ రాజు 3/13, చలపతి 3/30) ఎన్‌ఎఫ్‌సీ: 100/1 (నాయుడు 35 నాటౌట్, సాండీ 39 నాటౌట్).
 
 విద్యుత్‌సౌధ: 131, హెచ్‌ఏఎల్: 114 (జగన్నాథ్ 6/29, శ్రీనివాస్ 3/15).
 హెచ్‌సీఏ సంతాపం
 ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం (ఏపీఓఏ) మాజీ కార్యదర్శి ఎల్. వెంకట్రామ్ రెడ్డి మృతి పట్ల హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) సంతాపం తెలిపింది. గతంలో హెచ్‌సీఏ కార్యవర్గసభ్యుడిగా పనిచేసిన ఆయన మృతి క్రీడారంగానికి తీరని లోటు అని హెచ్‌సీఏ అధ్యక్షుడు జి.వినోద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు హెచ్‌సీఏ తరఫున ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. హెచ్‌సీఏ కార్యవర్గం ఆయన సేవలను కొనియాడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement