ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ విజయం | SCRSA won knock out tournment | Sakshi
Sakshi News home page

ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ విజయం

Published Wed, Feb 5 2014 12:17 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

SCRSA won knock out tournment

సాక్షి, హైదరాబాద్: సురేష్ (71), అబ్దుల్ ఫరీద్ (55) అర్ధసెంచరీలు సాధించడంతో ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ జట్టు 58 పరుగుల తేడాతో ఎంపీ కోల్ట్స్‌పై ఘనవిజయం సాధించింది. హెచ్‌సీఏ మూడు రోజుల వన్డే నాకౌట్ టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ 9 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. అయితే లక్ష్యఛేదనలో ఎంపీ కోల్ట్స్ 8 వికెట్లు కోల్పోయి 208 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనిరుధ్ (51), విశాల్ ఫిలిప్స్ (55 నాటౌట్)లు అర్ధసెంచరీలు సాధిం చినా జట్టుకు విజయాన్నందించలేకపోయారు. ఎలిజార్ (3/43), సుధాకర్ (3/34) మూడేసి వికెట్లు తీసి ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టారు.
 
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
 ఫలక్‌నుమా: 248/5 (అశోక్ 114, చైతన్య 73); ఈఎంసీసీ: 251/7 (రవితేజ 41, షిండే 99).
 
 ఎన్స్‌కాన్స్: 274/5 (అజ్మత్ 55, అరుణ్ 74, ఖలీల్ 62, సయ్యద్ అలీ 34 నాటౌట్); హైదరాబాద్ బాట్లింగ్: 258 (షేక్ మహ్మద్ 72, వినయ్ గౌడ్ 36, వంశీవర్ధన్ రెడ్డి 77, పృథ్వీరెడ్డి 36; మెహదీ హసన్ 4/38).
 
 క్లాసిక్: 245 (ఉమ్రాన్ 32, బాబర్ 47, నదీమ్ 33, అలీఖాన్ 46; మనీష్ 3/35); కిశోర్ సన్స్: 128 (రామ్‌నారాయణ్ 45; రఫీ 3/14, యూసుఫ్ 6/23).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement