సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీఏ కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ టోర్నమెంట్‌లో బాయ్స్‌టౌన్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో అజ్మత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బాయ్స్‌టౌన్ 22 పరుగుల తేడాతో క్లాసిక్ జట్టుపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బాయ్స్‌టౌన్ 158 పరుగులు చేసి ఆలౌటైంది. అజ్మత్ ఖాన్ (40) ఫర్వాలేదనిపించగా... వేణు యాదవ్ 30, సైఫ్ ఉల్ హసన్ 32 పరుగులు చేశారు.
క్లాసిక్ బౌలర్ మహ్మద్ నదీమ్ 6 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన క్లాసిక్ 136 పరుగులకే ఆలౌటైంది. రషీద్ అహ్మద్ (34) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. బౌలింగ్‌లోనూ రాణించిన అజ్మత్ ఖాన్ 5 వికెట్లు పడగొట్టాడు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పోస్టల్ జట్టు 7 వికెట్ల తేడాతో ఇన్‌కమ్ ట్యాక్స్ జట్టుపై గెలుపొందింది. మొదట ఇన్‌కమ్ ట్యాక్స్ 172 పరుగుల వద్ద ఆలౌటైంది. తర్వాత పోస్టల్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసి నెగ్గింది.
హెచ్‌సీఏ నాకౌట్ టోర్నీ ఫైనల్లో బాయ్స్‌టౌన్
Published Sun, Feb 9 2014 12:17 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement