kishan prasad
-
మేడ్చల్: సీనియర్ అసిస్టెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు
-
ఏసీబీ వలలో మేడ్చల్ సబ్‌రిజిస్టార్
సాక్షి, హైదరాబాద్: ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగంతో మేడ్చల్ సబ్‌రిజిస్టార్ కిషన్‌ప్రసాద్ ఇంటిపై ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. మేడ్చల్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు కిషన్‌ప్రసాద్‌కు చెందిన నాలుగు ఇళ్లపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ డీఎస్పి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా అల్మాస్‌గూడలో కిషన్ ప్రసాద్ చెందని రెండు ఇళ్లలో ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్న అధికారులు పలు విలువైన భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు సుమారు రెండు కోట్ల మేర ఆదాయానికి మించి ఆస్తులు కనుగొన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అల్మాస్గూడ ప్రాంతంలో రెండు ఇళ్లు, రెండు ఎకరాల నాలుగున్నర గుంటల వ్యవసాయ భూమి, హస్తినాపురంలో ఇంటి స్థలంతో పాటు పది తులాల బంగారం, బ్యాంకు పాస్‌పుస్తకాలు గుర్తించారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. -
కాయస్థుల కీర్తి పతాక
దిల్లీ నుంచి వచ్చిన దక్కన్ పాలకులతో కొన్ని తరాల కిందట వలస వచ్చారు కాయస్థులు. నిజాంలకు కుడి భుజంగా వ్యవహరిస్తూ జనహితంగా విధి నిర్వహణ చేయడం వారి ప్రత్యేకత. భవానీ ప్రసాద్, కిషన్ ప్రసాద్‌లు అందుకు ఉదాహరణ. ప్రజలపట్ల సమభావన చూపే పాలకుల వారసుడు ప్రజాహితానికి దూరమైతే ఒక ఆదర్శ కాయస్థుడు ఎలా ఉంటాడు? ఏడో నిజాం హయాంలో 1918లో నగరంలో జన్మించిన రాజ్ బహదూర్ గౌర్లా ఉంటాడు ! ‘రాజ్’ ప్రతిభావంతుడైన విద్యార్థి. స్కాలర్‌షిప్‌లతో 1934లో రీడింగ్ రూమ్, గ్రంథాలయం ఏర్పరచిన జిజ్ఞాసి. 1939లో హైదరాబాద్‌లో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు. మరుసటి సంవత్సరం కామ్రేడ్స్ అసోసియేషన్ సభ్యుడు. 1941లో మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్. కాలేజీ మ్యాగజైన్ సంపాదకుడు. సమాజం రోగగ్రస్తమైనపుడు దేహ చికిత్స కంటే దేశ చికిత్సే ప్రధానమైందని భావించిన కోవలోని వాడు డాక్టర్ రాజ్ ! లక్ష్యసాధనకు ట్రేడ్ యూనియన్ వాహికగా భావించాడు. ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏహెచ్‌టీయూసీ)కు ఉర్దూ కవి మగ్దూం మొహియుద్దీన్ అధ్యక్షుడు, రాజ్‌బహదూర్ గౌర్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి. 1946 అక్టోబర్ 17న ఏహెచ్‌టీయూసీ నిర్బంధ వ్యతిరేక దినం పాటించింది. రజాకార్ల చేతిలో కీలుబొమ్మలా ఉన్న నిజాం ప్రభుత్వం ఉద్యమకారులపై విరుచుకుపడింది. తెలంగాణ అంతటా కమ్యూనిస్టులను, ఆర్య సమాజీకులను ముమ్మరంగా అరెస్ట్ చేసింది. నవంబర్ 15న సహచరులతో రాజ్ అరెస్టయ్యాడు. నిజాం ‘పంటి’నుంచి జారాడు ‘విశ్వసనీయ కుటుంబం నుంచి వచ్చిన విద్రోహి’ అంటూ గౌర్‌పై నిజాం సర్కార్ కుట్రకేసు మోపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. బయట ముఖ్యమైన పనులెన్నో ! తాను లోపల ఉండటమేంటి ? ఇది రాజ్ ఆలోచన ! తనకూ, సహచరుడు జవాద్ రజ్వీకి తరచూ జ్వరం వస్తోందని జైలర్‌కు చెప్పాడు. ఇరువురి ఆరోగ్యంలో లోపం కన్పించలేదన్నాడు డాక్టర్ బంకట్ చందర్. అయినా, డెంటిస్ట్‌కు చూపించమన్నాడు. ఏడో నిజాం పేరుతో ఏర్పడిన ఉస్మానియా ఆస్పత్రిలో డెంటల్ విభాగం అధిపతి డా.మోరిస్ ఎక్విప్మెంట్ను జైలుకు తరలించడం వీలు కాదు కాబట్టి రోగులను ఆస్పత్రికి తీసుకు రమ్మన్నాడు. 1947 మే 7వ తేదీ, ఉస్మానియా వెనుక గేట్ నుంచి ఎస్కార్ట్ పోలీసులు ‘పేషెంట్స్’ను దవాఖానాలోకి తీసుకెళ్లారు. ఆ రోజు జయప్రకాష్ నారాయణ్ హైదరాబాద్ విచ్చేస్తున్నారు. ఎక్కువ మంది పోలీసులు సెక్యూరిటీలో ఉన్నారు. చాలా మంది కామ్రేడ్స్ పథకం ప్రకారం డెంటిస్ట్ దగ్గర క్యూ కట్టారు. డాక్టర్ దగ్గరకు పోలీసులు వెళ్లకూడదని అభ్యంతరాలు పెట్టారు. లోపలకు వెళ్లిన రాజ్ ద్వయం డాక్టర్ పరంజపే సహకారంతో క్లినిక్ వెనుక గేటు నుంచి బేగంబజార్‌కు ఉడాయించారు. స్టార్ట్ చేసి ఉన్న కారులో ఆసిఫ్‌నగర్‌కు, అక్కడ కారు మార్చి, అజ్ఞాతవాసానికీ వెళ్లిపోయారు! నాలుగేళ్ల తర్వాత 1951 ఏప్రిల్ 24న రాచకొండ అడవుల్లో ఒక చెరువులో నీరు తాగుతుండగా అరెస్టయిన రాజ్ బహదూర్ 13 నెలలు జైలులో గడిపారు. చిత్రహింసలను పంటి బిగువున భరించిన రాజ్, తన మూల గదిలో సహచర ఖైదీలతో సాహితీ చర్చలు జరిపేవాడు. ఆ గది పేరు ‘షాస్ కార్నర్’! ‘పోరాటం’పై పశ్చాత్తాపం లేదు! పోలీస్ చర్య తర్వాత తెలంగాణ సాయుధపోరాటాన్ని ఆపాలని విశ్వసించిన వ్యక్తుల్లో రాజ్ ముఖ్యుడు. అప్పటి పరిస్థితుల్లో ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను గౌరవించడమే సబబు అని భావించారు. తర్వాత కాలంలో స్టాలిన్ సాయుధపోరాటాన్ని విరమించాల్సిందిగా సూచించడం కాకతాళీయమే కావచ్చు! వ్యక్తిగతంగా తాను విబేధించినా, సాయుధపోరాట మార్గాన్ని ఎంచుకున్న పార్టీ నిర్ణయాన్ని రాజ్ నిబద్ధతతో అనుసరించేవాడు! మీ జీవితాన్ని వెనక్కు తిరిగి చూసుకుంటే ఎలా ఉంది అని 2011లో తాను చనిపోవడానికి రెండేళ్ల క్రితం అడిగాను. ‘చాలా సందర్భాల్లో మేం వింతగా ప్రవర్తించాం. మూర్ఖంగానూ! దానర్థం పశ్చాత్తాపపడాల్సిన రీతిలో వ్యవహరించాం అని కాదు. తెలంగాణ సాయుధపోరాటం మూడు ప్రవాహాల సంగమం! ఆర్థిక స్థితిగతులు-రాజకీయాల-సాంస్కృతిక అంశాలు ప్రజలను అతలాకుతలం చేశాయి. ఆ పరిస్థితుల్లో యువత ఆ పోరాటంలో చేరడం అనివార్యం! తమ కష్టాలు తొలగనంతకాలం రూపం ఏదైనా ప్రజలు ఉద్యమిస్తూనే ఉంటుంది’ అన్నారు. తొమ్మిది పదుల వయసులోనూ ఆయనలో తడబాటు లేదు! చిక్కడపల్లిలో ‘చమేలీ కా మండ్వా’! కమ్యూనిస్ట్ పార్టీ పోరాట విరమణను ప్రకటించింది. పోరాట కాలంలో పరిచయమైన బ్రిజ్రాణిని రాజ్ వివాహం చేసుకున్నారు. ఇప్పుడేం చెయ్యాలి? ఎక్కడుండాలి ? ఒక సమస్య దారి చూపింది! చిక్కడపల్లి నాలా దగ్గర ఒక మురికివాడ ఉంది. అధికారులు అక్కడి పేదవారి నివాసాలను ఖాళీ చేయిద్దామనుకున్నారు. బ్రిజ్‌రాణి అడ్డుకుంది. తమతో కలసి ఉండాల్సిందిగా మురికివాడ ప్రజలు కోరారు. అలా రాజు-రాణి ఒక ఇంటివారయ్యారు! రష్యాలో వైద్యం చదివిన వీరి కుమార్తె తమారా 1982లో అదే స్థలంలో చిన్న పక్కా ఇల్లు నిర్మించారు. రాజ్ ఆ ఇంటిని ‘చమేలీ కా మండ్వా’ అనేవాడు. తన స్నేహితుడు మగ్దూం మొహియుద్దీన్ కవిత పేరది! ‘చా చా చా’ సినిమాలోని ఆపాటను యూట్యూబ్‌లో (www.youtube.com/ watch?v=_A-BAt4k2gU) ఆలకించండి! తమారా కన్నీరు ! పన్నీరు !! తండ్రి గురించి కుమార్తె చెప్పిన ఒక సంఘటన ఆసక్తికరం. ఎనిమిదేళ్ల తమారా తండ్రిని ఎందుకో కొంత పైకం అడిగింది. ‘లేదు వెళ్లు’ అని రాజ్ అంటుండగా.. అదే సమయంలో అక్కడికి ఒక సందర్శకుడొచ్చాడు. తమారాకు ‘రూపాయి’ ఇచ్చాడు. ‘జీవితంలో నాన్న చేత చెంపదెబ్బ తిన్నది ఆ ఒక్కసారే..’ అంది తమారా చెమర్చిన కళ్లతో ! అప్పుడు నాన్న పార్లమెంట్ సభ్యుడు. ఏదో ‘పని’ని ఆశించి అతడు వచ్చాడని కొన్నేళ్ల తర్వాత నాన్న వివరిస్తే కానీ నాకు అర్థం కాకపోవడం సహజమే కదా ! ‘కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ‘మగ్దూం మామూ’ ఆదుకునేవాడు. బేటీ నీకేం కావాలని అడిగి మరీ ఇప్పించేవాడు. మామూను కోరిన ఖరీదైన వస్తువులు నోట్ బుక్ లేదా ఐస్‌క్రీమ్ అన్నప్పుడు తమారా కన్నుల్లో ఎంత మెరుపో..! స్నేహం పూచిన పువ్వులు ఉర్దూ భాషకు చేసిన సేవలకు గాను 1991లో రాజ్ ‘బహదుర్షా జాఫర్’ అవార్డు పొందారు. పురస్కారంతో పాటు పాతికవేల రూపాయలు అందుకున్నారు. ఇంత పెద్దమొత్తాన్ని ఏం చేద్దాం అని కుమార్తెను రహస్యంగా అడిగారు రాజ్! తీర్చాల్సిన అప్పులను గుర్తు చేసింది తమారా ! అప్పులు పోగా మిగిలిన పదివేల రూపాయలను మగ్దూం ట్రస్ట్‌కు అందజేశారు రాజ్ ! మగ్దూం కంటే రాజ్ పదేళ్లు పెద్ద. ‘మగ్దూం నా గురువు, స్నేహితుడు, వల్లభుడు’ అనేవారు రాజ్. ఇరువురూ కలసి పాడుకున్నారు. మధుపానం చేశారు. ఉద్వేగం చెందారు. మగ్దూంను తలచుకోని రోజు రాజ్ జీవితంలో లేదు. రాజ్-మగ్దూంలు హైదరాబాద్‌లో పూచిన ఒకే కొమ్మ పువ్వులు. మగ్దూం పరిమళాలు మరోసారి... -
రజ్వీ.. లాతూర్ ప్రకంపన
హైదరాబాద్ స్టేట్ శతాబ్దాలుగా మత సామరస్యానికి చిరునామాగా నిలిచింది. పాలకులు ఢిల్లీ సుల్తానులకు ఆ తర్వాత బ్రిటిష్ వారికి నమ్మకస్తులుగా మారారు. స్వతంత్ర రాజ్యానికి ఉండాల్సిన అన్ని హంగులూ ఉన్నా, ప్రజల రక్షణ భాధ్యతలను ‘పై’వారికి అప్పగించారు. వారి వారసుడు ఏడో నిజాం. కిషన్ ప్రసాద్, అక్బర్ యార్జంగ్ వంటి సామరస్య వ్యక్తిత్వాలు లేని లోటు ఆయన అధికారానికి చరమగీతం పాడింది. మత భావనలు తీవ్రంగా వీచాయి. అధికారం అనే దీపం ఆరకూడదని నిజాం విఫలయత్నాలు చేశాడు! ఈ క్రమంలో కాశిం రజ్వీ కథ! ‘మజ్లిస్-ఎ-ఇత్తెహాద్-ఉల్ ముసల్మీన్’ అధ్యక్షుడు బహదూర్ యార్జంగ్ 1946లో అకస్మికంగా మరణించిన వైనం (Legends and Anecdotes of Hyderabad ) గురించి చెప్పుకున్నాం కదా! ఆయనోసారి హైదరాబాద్ స్టేట్‌లోని లాతూర్ (ప్రస్తుతం మహారాష్ట్ర) వెళ్లారు. పార్టీ కార్యాలయం కోసం తగిన వసతి చూడమని పార్టీ సభ్యులను కోరారు. ఒక వ్యక్తి తన ఇంటిని పార్టీ కార్యాలయానికి ఇస్తాన న్నాడు. క్షణాల్లో ఇంట్లోని సామాన్లను వీధుల్లోకి విసిరేశాడు. అధ్యక్షుడు హృదయానికి హత్తుకున్న ఆ కార్యకర్త సయ్యద్ కాశిం రజ్వీ ! బహదూర్ యార్జంగ్ మరణానంతరం సహజంగానే పార్టీ అధ్యక్షుడయ్యాడు. హైదరాబాద్‌కు ‘ప్రకంపనలను’ పరిచయం చేశాడు. ఖడ్గంతోనే ముస్లింలు హిందుస్థాన్‌కు పాలకులయ్యారన్నాడు. ఆయన ఉపన్యాసాలు కొందరిని ఉద్వేగపరచాయి. సామరస్య జీవనాన్ని కోరుకునే అధిక సంఖ్యాకులైన ముస్లింలకు ఆందోళన కలిగించాయి. స్వతంత్ర రాజ్యంగా అవతరించబోతోన్న బ్రిటిష్ పాలిత భారత్‌లో కలవకుండా, నిజాం స్వతంత్ర రాజుగా ఉండాలని రజ్వీ ఆయనలో రాజ్యకాంక్షను రగిలించాడు. ‘మై హూ నా’ అన్నాడు. ఎర్రకోటపై నిజాం జెండా రెపరెపలాడుతుందని, బెంగాల్ సముద్రజలాలు ఆయన పాద ప్రక్షాళన చేస్తాయని అభివర్ణించాడు. ప్రధానమంత్రిని తరిమారు! ‘నైజాం రాజ్య రక్షణ’ కోసం రజాకార్స్ అనే పేరుతో పారా మిలటరీ దళాన్ని ఏర్పరచాడు రజ్వీ! నాయకుని కోసం ప్రాణత్యాగం చేస్తామని, హైదరాబాద్ స్టేట్ విలీనం కాకుండా చివరి క్షణం వరకూ పోరాడుతామని సభ్యులతో ప్రమాణం చేయించాడు. ఫీల్డ్ మార్షల్ దుస్తుల్లో ఉండేవాడు. హోదాలను బట్టి ఇతరులు తుపాకులు, కత్తులు, కర్రలు చేతబట్టేవారు. ఏడాదిపాటు ‘యథాతథ స్థితి’ని గౌరవించేందుకు ఒప్పందానికి రావాలని 1947లో కేంద్ర ప్రభుత్వం, నిజాం ప్రభుత్వమూ భావించాయి. ఢిల్లీకి బయలుదేరిన నిజాం ప్రతినిధి బృందాన్ని రజాకార్లు అడ్డుకున్నారు. హైదరాబాద్ స్టేట్ ప్రధానమంత్రిపై చేయి చేసుకున్నారు! సౌమ్యుడైన ప్రధానమంత్రి సర్ మీర్జా ఇస్మాయిల్ స్టేట్ వదిలే వరకూ రజ్వీ మనుషులు తరిమారు. ఈ నేపథ్యంలోనే, నిజాం అధికార కాంక్షను నిరసిస్తూ, హైదరాబాద్ స్టేట్ భారత్‌లో అంతర్భాగం కావడం అనివార్యమని వార్తలు రాసిన షోయబుల్లాఖాన్ హత్యకు గురయ్యాడు. నిజాం ప్రధానమంత్రిగా నియమించిన నవాబ్ చట్టారీ స్థానంలో నిజాం నిర్ణయాన్ని పరిహసిస్తూ మీర్ లాయక్ అలీని ప్రధానమంత్రిగా రజ్వీ నియమించాడు. 1948 నాటి ఈ పరిస్థితుల్లో అధికసంఖ్యాకులు వలసపోయారు. అల్పసంఖ్యాకులు వలసవచ్చారు. పోలీస్ చర్యకు ‘రజ్వీ’ ఆహ్వానం! నిజాం నవాబుకు వత్తాసుగా ఎన్నో డాంబికాలు పలికిన రజ్వీ, హైదరాబాద్ స్టేట్ ఇండియాలో విలీనం కావాలని భావించిన షోయబుల్లాఖాన్ మరణానికి కారకుడైన రజ్వీ, పోలీస్ చర్యను ఆహ్వానించిన వారిలో ముందు వరుసలో ఉన్నాడు! 1948 సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలో పేరుతో పోలీసు చర్య ప్రారంభమైంది (17 పోలో గ్రౌండ్స్‌తో హైదరాబాద్ ఇండియాలో నంబర్ 1 స్థానంలో ఉండేది!). నాలుగు రోజుల్లోనే నిజాం బేషరతుగా లొంగిపోయాడు. అనుయాయులతో రజ్వీ అరెస్టయ్యాడు. హిందు-ముస్లిం-క్రిస్టియన్ న్యాయమూర్తుల స్పెషల్ ట్రిబ్యునల్ రజ్వీ బృందంపై విచారణను ప్రారంభించింది. లా చదివిన రజ్వీ తన కేసును తానే వాదించుకున్నాడు. 1950 సెప్టెంబర్ 10న ట్రిబ్యునల్ విధించిన ఏడేళ్ల జైలుశిక్షను హైదరాబాద్, పూణెలలో పూర్తిచేసుకున్నాడు. ‘వా’హెద్! పూణెలోని ఎరవాడ జైలు నుంచి విడుదలైన రజ్వీని ఆయన అనుయాయి, న్యాయవాది కమిల్ అడిక్‌మెట్‌లో ఉన్న తన నివాసానికి కారులో తీసుకువచ్చాడు. పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు! 140 మందికి ఆహ్వానాలు వెళ్లగా 40 మంది వచ్చారు. ‘పార్టీ అధ్యక్ష పదవిని స్వీకరించే సాహసి లేరా’ అనే రజ్వీ పిలుపునకు స్పందన రాలేదు. 12 ఏళ్లు దాటిన ఏ పురుషుడైనా అధ్యక్షుడు కావచ్చని నిబంధన సవరించారు. అబ్దుల్ వాహెద్ ఒవైసీ అనే యువకుడు అధ్యక్షుడయ్యాడు. ఆ తర్వాత ఆయన కుమారుడు సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ దీర్ఘకాలం బాధ్యతలు నిర్వర్తించారు. భారతీయ ముస్లింల యోగక్షేమాల పరిరక్షణ ధ్యేయమని పార్టీ ప్రకటించింది. ఆ మేరకు ముస్లిమేతరులనూ పార్టీ పదవులకు, ఉన్నత స్థానాలకు ఎంపిక చేస్తోంది. ఎంఐఎం పార్టీకి ప్రస్తుతం ఆయన కుమారుడు అసదుద్దీన్ ఒవైసీ అధ్యక్షుడు. మరో కుమారుడు అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణ అసెంబ్లీలో శాసనసభాపక్షనేత. కన్నీరు కరవైంది! తాను దక్కన్లో పుట్టాను దక్కన్‌లోనే మరణిస్తానని గతంలో చెప్పుకున్న రజ్వీ, పార్టీ అప్పగింతలు పూర్తయిన తర్వాత తనకు భారత్‌లో భవిష్యత్ లేదని, పాకిస్థాన్ వెళ్తానని ప్రకటించాడు. పోలీస్ చర్య పూర్తయిన తొమ్మిదేళ్లకు సెప్టెంబర్ 18న పాకిస్థాన్ పయనమయ్యాడు. కమిల్ ముంబై వరకూ వెళ్లి సెండాఫ్ పలికారు. రజ్వీని పాకిస్థాన్‌లో ఎవ్వరూ రిసీవ్ చేసుకోలేదు. మద్దతు పలకలేదు. గుర్తించలేదు. ఇండియా నుంచి, ముఖ్యంగా దక్కన్ నుంచి కరాచీకి వెళ్లి బాధలు పడుతున్న వారికి న్యాయవాదిగా సేవలు అందించాడు. 67వ ఏట 1970 జనవరి 15న కరాచీలో రజ్వీ చనిపోయాడు. హైదరాబాద్‌లో స్వతంత్ర ముస్లిం రాజ్యాన్ని స్థాపించాలని కలగన్న కాశిం రజ్వీ.. తాను పుట్టిన నేలకు సుదూరాన ఏర్పడ్డ మత రాజ్యం పాకిస్థాన్‌లో మరణించాడు. అక్కడ రజ్వీ కోసం ఏ ఒక్కరూ కన్నీరు పెట్టలేదు! ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి -
కిషన్-అక్బర్ తేరో నామ్
narendrayan-18 ఇంతకీ మహారాజా సర్ కిషన్ ప్రసాద్ బహదూర్ హిందువా? ముస్లిమా? దేవాలయాలలో, దర్గాలలో, ఆయా మతస్తుల వేడుకల్లో తలలో నాలుకలా కలసిపోయే వారు నిజాం ప్రధానమంత్రి మహారాజా కిషన్ ప్రసాద్! ఈ నేపథ్యంలో ఒక సందర్భంలో ఒకరు, మీరు హిందువు కాదు ముస్లిం అని భావిస్తున్నాను అన్నారు. అన్యాపదేశంగా సమాధానం ఆశించారు. ప్రజల మహారాజ్ ఇలా అన్నారు, ఆశువుగా.. మై హూ హిందూ/మై హూ ముసల్మాన్/హర్ మజబ్ హై మెరా ఇమాన్ ‘షాద్’కా మజబ్ షాద్ హీ జానే/ ఆజాదీ ఆజాద్ హీ జానే’ ‘నేను హిందువును/ నేను ముసల్మాన్‌ను/అన్ని మతాలూ నా ధర్మంలోనివే ‘షాద్’ మతమేమిటో షాద్ కే తెలుసు /విముక్తునికే ముక్తి తెలుసు’ ‘షాద్’ మిత్రుడు పఠాన్! సుకవి జీవించు ప్రజల నాల్కలపైన అన్నట్లు కిషన్ ప్రసాద్ కలంపేరుతో ఏర్పడింది మహబూబ్ నగర్ జిల్లాలోని ‘షాద్’నగర్ ! ‘హైదరాబాద్ తెహజీబ్ (అన్యోన్యత)’ అంటే ఏమిటి? ఎవరైనా ప్రశ్నిస్తే కిషన్ ప్రసాద్ జీవితాన్నే ఉదహరించవచ్చు! ‘షాద్’ (సంతుష్ట) తత్వానికి దగ్గరగా ఉన్న వ్యక్తి నవాబ్ అక్బర్ యార్జంగ్ బహదూర్. ఖైబర్ కనుమ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వచ్చిన పఠాన్ల కుటుంబీకుడు. 16వ ఏట లా చదివేందుకు హైదరాబాద్ వచ్చాడు. మాజీ రాష్ట్రపతి జాకీర్‌హుస్సేన్ తండ్రి, న్యాయవాది ఫిదాహుస్సేన్ ఖాన్ దగ్గర సహాయకునిగా పనిచేశారు. న్యాయవాదిగా, హైకోర్టు న్యాయమూర్తిగా, నిజాం హోంశాఖ కార్యదర్శిగా పదోన్నతులు పొందారు. ‘జకత్’తో పాటు ప్రతి గురువారం పేదలకు దానధర్మాలు చేసేవారు. అన్ని ఉపవాసాలూ పాటించేవారు. 80 ఏళ్ల సాఫల్య జీవనంలో ఒక్కపర్యాయం కూడా ప్రార ్థనను విస్మరించలేదు. 72వ ఏట హజ్ యాత్ర చేశారు. జమైతె-ఎ-అహ్మదీయ సభ్యుడైనప్పటికీ అన్ని సమూహాల ముస్లింలు గౌరవించేవారు. బూర్గుల రామకృష్ణరావు, మాడపాటి హనుమంతరావు వంటి పెద్దలూ అభిమానించేవారు. మహాత్మాగాంధీ హత్య నేపథ్యంలో నిజాం కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు అధ్యక్షత వహించాల్సిందిగా పెద్దలంతా ఆయన్ను కోరారు. వివాదానికి ఎవరు అతీతులు..? అందరూ మెచ్చేవారూ ఒక్కోసారి వివాదాస్పదం అవుతారు! సందర్భం 1936 ఆగస్ట్ 1. కృష్ణ జన్మాష్టమి. యంగ్మెన్స్ కాయస్థ యూనియన్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో హుస్సేనీ ఆలంలోని రాజా నర్సింగరావు బహదూర్ దేవిడీలో బహిరంగ సభ. హైదరాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మీర్జాయార్జంగ్ బహదూర్ అధ్యక్షుడు. నగర ప్రముఖులు, హిందూ-ముస్లిం అశేష ప్రజానీకం హాజరయ్యారు. మహారాజా కిషన్ ప్రసాద్ రచించిన హిందూముస్లింల సఖ్యతను శ్లాఘించే ప్రార్థనా గీతంతో సభ మొదలైంది. హైకోర్ట్ న్యాయమూర్తి నవాబ్ అక్బర్ యార్జంగ్ ప్రధాన ఉపన్యాసం ప్రారంభించారు ‘శ్రీకృష్ణ: హిందూ ప్రవక్త’ అనే అంశంపై! ఖురాన్ ను, ఉదార విశ్వాసులను ఉటంకిస్తూ వినూత్న ప్రతిపాదనలు తెచ్చారు! ఉదహరించబడని ప్రవక్త! ప్రతి ఒక్కరికీ మార్గదర్శకుడు ఉంటారు (13:7) ఇంతకు ముందు కూడా మార్గదర్శకులు పంపబడ్డారు. అందులో పేర్లు ఉదహరింపబడ్డవారే కాదు, ఉదహరింపబడని వారూ ఉన్నారు (40 :78) అనే రెండు ప్రవచనాలను ఖురాన్ నుంచి ఉదహరించారు. ఈ నేపథ్యంలో ‘కృష్ణుడు ఖురాన్లో ఉదహరింపబడనప్పటికీ ఆయన పూర్వపు ప్రవక్త కాదని ఎందుకు అనుమానించాలి? సమస్త ఆసియాపై సాంస్కృతిక ప్రభావాన్ని చూపిన మార్గదర్శి గ్రీస్‌కు ఈజిప్ట్‌కు మార్గదర్శి కాడా? నబీలు- పైగంబర్లు, రుషులు-మునులు, ప్రవక్త-అవతారము అనే పదాల సారూప్యతలను గుర్తించాలన్నారు. ఖురాన్ ప్రకారం ఏ ముస్లిమూ ప్రవక్తల పట్ల హెచ్చుతగ్గులు పాటించరన్నారు. నోవా-అబ్రహాం-జీసస్‌ల పరంపరలోని చివరి ప్రవక్త అయిన మహ్మద్ ప్రవక్తతో పాటు ‘ఉదహరించబడని ప్రవక్త’ శ్రీకృష్ణునికి అలాహిసలామ్లు (ఆశీర్వాదాలు శాంతి అనుగ్రహింపబడు గాక) అర్పించారు. అధికారులకు, పత్రికలకు నిజాం ఫర్మానా! నగరంలో కలకలం! ముస్లింలు ప్రార్థించే ప్రవక్తలతోపాటు అక్బర్ యార్జంగ్ శ్రీకృష్ణునికి అలాహిసలామ్లు చెబుతారా? సాంప్రదాయ ముస్లింలు మాత్రమే కాదు, హిందువులు సైతం ఈ తరహా వాస్తవ విరుద్ధ కల్పనలను అంగీకరించరని పత్రికల్లో విమర్శలొచ్చాయి. నిజాంపై ఒత్తిడులు, లిఖిత ఫిర్యాదులూ! నిజాం ఆయన భరతం పడతారని, ఉద్యోగం ఊడగొడతారని కొందరు చెవులు కొరుక్కున్నారు. ‘ప్రస్తుత శాంతియుత పరిస్థితులకు విఘాతం కల్గించే రీతిలో ప్రభుత్వాధికారులు, మత-రాజకీయ అంశాలపై వ్యాఖ్యానాలు చేయరాదని, పత్రికలూ ప్రోత్సహించరాద’ని 1936 ఆగస్ట్ 22న ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆదేశం జారీ చేశారు. నిజాంకు, కిషన్ ప్రసాద్‌కు అక్బర్ యార్జంగ్పై ఉన్న గౌరవం గురించి తెలియని వారి ఆశలు ఫలించలేదు. ‘ఉపన్యాసం’ ఇచ్చిన నాలుగు నెలలకు హైకోర్టు న్యాయమూర్తిగా రిటైర్ కావాల్సిన అక్బర్ యార్జంగ్ పదవీకాలాన్ని అసాధారణ రీతిలో నిజాం రెండేళ్లు పొడిగించారు. ఆ తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా నియమించారు. నాలుగేళ్లు ఆ పదవిలో ఉన్నారు. అక్బర్ యార్జంగ్ తన అంతరాత్మ ప్రబోధించిన సత్యాన్ని నిర్భయంగా శిరసెత్తి ప్రసంగించారు! ‘వివిధ మతాల మధ్య ఐకమత్యం పెంచేందుకు కృషి చేయాల’ని అన్ని మతాలవారికీ ఆయన హితవు పలికారు! కిషన్ ప్రసాద్-అక్బర్ యార్ జంగ్ వేర్వేరు వ్యక్తులా! ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి -
ఆ ప్రధాని ప్రజల మహారాజు
ఆదేశాల్లో పదనిసలు.. వరుసలో ఇమడని ఒక పత్రం ఉంది! తన ప్రధానమంత్రి కిషన్ ప్రసాద్ చేసిన వ్యక్తిగత ‘రుణాన్ని మాఫీ’ చేస్తూ నిజాం సంతకం చేశాడు. ఈ వైనం వచ్చేవారం ముచ్చటించుకుందాం. అంతకు ముందుగా, కిషన్ ప్రసాద్ బహదూర్‌ను స్మరించుకుందాం! ప్రజల మహారాజుగా ఆయన కీర్తి పొందారు. నిజాం నవాబులూ అందుకు అసూయ చెందలేదు. కిషన్ ప్రసాద్ (1864 జనవరి 1-1940 మే 13) మరికొంతకాలం జీవించి ఉంటే ఉపఖండం చరిత్ర మరోలా ఉండేది! కిషన్ ప్రసాద్ బహదూర్ పూర్వీకులు అక్బర్ చక్రవర్తికి ఆర్థిక మంత్రిగా పనిచేసిన తోడర్ మల్ వారసులు! కిషన్ ప్రసాద్ హైద్రాబాద్ స్టేట్‌లోనే జన్మించారు. ఆయన తాతగారు చందూలాల్ హైదరాబాద్ స్టేట్ ప్రధానమంత్రిగా పనిచేశారు. మొదటి సాలార్జంగ్తో, ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్‌తో కిషన్ కలసి మెలసి పెరిగాడు. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ నూనూగు మీసాల వయసులోనే రసికుడు! విచ్చలవిడి స్త్రీ సాంగత్యం మంచిది కాదని బ్రిటిష్ రెసిడెంట్ ఒత్తిడి చేయడంతో మహబూబ్ అలీ ఖాన్‌ను పురానీ హవేలీకి మార్చారు. వారానికి ఒక పర్యాయం మాత్రమే యువతులను కలిసే షరతుతో! క్రమం తప్పని నెలసరి.. కిషన్ ప్రసాద్ స్వయంగా కవి. షాద్ (సంతుష్టుడు) అనే కలం పేరుతో కవితలు రాశారు. సంస్కృతం, పర్షియన్,అరబిక్,ఉర్దూ, గురుముఖి, ఇంగ్లిష్ భాషలలో పండితుడు. ప్రథమ భారత స్వాతంత్య్రోద్యమం (సిపాయిల తిరుగుబాటు) నేపథ్యంలో ఉత్తరాది అల్లకల్లోలం అయ్యింది. ప్రఖ్యాత ఉర్దూ కవి ఫానీ బదయూని ఇబ్బందుల్లో ఉన్నాడని తెలుసుకుని అవధ్ ప్రాంతం నుంచి ‘షాద్’ పిలిపించారు. ఇక్కడ అధ్యాపకునిగా ఉద్యోగం ఇప్పించారు. కిషన్ ప్రసాద్ నివాసం నిత్యం ముషాయిరాల (కవితా గోష్టుల)తో కళకళలాడేది. నిజాంలు తాము రాసిన కవితలను కిషన్ ప్రసాద్ ముషాయిరాల్లో మాత్రమే చదివేందుకు పంపేవారు. అలా వచ్చిన కవితలను సగౌరవంగా నుదుటికి తాకించుకుని కవితాహరులతో చదివించేవారు. అబిద్ అలీ అనే కవి ‘బేగమ్’ అనే కలం పేరుతో గజల్స్ రాసేవాడు. స్త్రీ వేషధారణతో వచ్చి చదివేవాడు. ముషాయిరాల్లో హాస్యం ఉండొద్దా? అతడికి అఫ్కోర్స్ బేగమ్‌కు కిషన్ ప్రసాద్ నెలసరి ప్రోత్సాహకాన్ని మంజూరు చేశారు. ఆ నేపథ్యంలో ‘మహారాజా ధన్యవాదాలు! నాకు ‘నెలసరి’ క్రమం తప్పకుండా వస్తోంది’ అని బేగమ్ చమత్కరించాడు! రెండోసారి.. ఆరో నిజాం హయాంలో ప్రధానమంత్రి పదవిని చేపట్టిన కిషన్ ప్రసాద్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్చే ఉద్వాసనకు గురైనారు. తన నియామకానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వైస్రాయ్కి ఫిర్యాదు చేసిన వారిలో కిషన్ ప్రసాద్ ఒకరనే అపోహతో! అలా తనకు లభించిన విరామంతో కిషన్ ప్రసాద్ దేశాటన చేశారు. పెయింటింగ్ నేర్చుకున్నారు. పియానో నేర్చుకున్నారు. వంటలు కూడా. లాహోర్ పర్యటనలో ప్రముఖ కవి ఇక్బాల్‌తో స్నేహం చేశారు. కిషన్ ప్రసాద్ విధేయతను శంకించడం తప్పని ఆయన సంతకాన్ని ఇతరులు ఫోర్జరీ చేశారని నిజాం నవాబుకు తర్వాత తెలిసింది. 1927లో రెండోసారి ప్రధానమంత్రిగా ఆహ్వానించారు. 9 ఏళ్లు ఆ బాధ్యతలు నిర్వర్తించాడు. యమీన్-ఉల్- సుల్తానత్ (ప్రభువు కుడి భుజం) అనే బిరుదును సార్థకం చేసుకున్నాడు. ‘అద్వితీయ’ వారసత్వం! కిషన్ ప్రసాద్ ఏడుగురిని వివాహమాడాడు. ముగ్గురు హిందూ భార్యలు. నలుగురు ముస్లిం భార్యలు. 30 మంది సంతానం. తల్లుల మతానికి చెందిన పేర్లు పిల్లలకు పెట్టారు. వారి వారి మతరీతులతో పద్ధతులతో పెంచారు. ఆయా మతాల వారికే ఇచ్చి వివాహం చేశారు. తన విల్లులో తన వారసులు ఏక పత్నీ-పతీ వ్రతం పాటించాల్సిందిగా సూచించారు. ఇతరుల మతాన్ని కించపరచిన ఎవరూ సుఖంగా జీవించలేరని స్పష్టం చేశారు! కిషన్ ప్రసాద్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ఆరాధకుడు. శ్రీకృష్ణ భక్తుడు. అన్ని కులాల, మతాల అభిమానాన్ని పొందిన కిషన్ ప్రసాద్‌ను హిందువుగా, ముస్లింగా భావించేవారు. ఇంతకీ మహారాజా సర్ కిషన్ ప్రసాద్ బహదూర్ హిందువా? ముస్లిమా? వచ్చేవారం.. ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి -
హెచ్‌సీఏ నాకౌట్ టోర్నీ ఫైనల్లో బాయ్స్టౌన్
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీఏ కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ టోర్నమెంట్లో బాయ్స్టౌన్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో అజ్మత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బాయ్స్టౌన్ 22 పరుగుల తేడాతో క్లాసిక్ జట్టుపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బాయ్స్టౌన్ 158 పరుగులు చేసి ఆలౌటైంది. అజ్మత్ ఖాన్ (40) ఫర్వాలేదనిపించగా... వేణు యాదవ్ 30, సైఫ్ ఉల్ హసన్ 32 పరుగులు చేశారు. క్లాసిక్ బౌలర్ మహ్మద్ నదీమ్ 6 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన క్లాసిక్ 136 పరుగులకే ఆలౌటైంది. రషీద్ అహ్మద్ (34) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. బౌలింగ్‌లోనూ రాణించిన అజ్మత్ ఖాన్ 5 వికెట్లు పడగొట్టాడు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పోస్టల్ జట్టు 7 వికెట్ల తేడాతో ఇన్కమ్ ట్యాక్స్ జట్టుపై గెలుపొందింది. మొదట ఇన్కమ్ ట్యాక్స్ 172 పరుగుల వద్ద ఆలౌటైంది. తర్వాత పోస్టల్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసి నెగ్గింది. -
బెంబేలెత్తించిన నాగరాజు
సాక్షి, హైదరాబాద్: కిషన్ ప్రసాద్ హెచ్‌సీఏ వన్డే నాకౌట్ టోర్నమెంట్లో ఇన్‌కమ్‌ట్యాక్స్ జట్టు 3 వికెట్ల తేడాతో కల్నల్ అక్రిలిక్ జట్టుపై గెలిచింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అక్రిలిక్ జట్టును ఇన్‌కమ్‌ట్యాక్స్ బౌలర్ నాగరాజు (5/29) బెంబేలెత్తించాడు. దీంతో అక్రిలిక్ జట్టు 132 పరుగులకే ఆలౌటైంది. అల్తాఫ్ (62) అర్ధసెంచరీ చేశాడు. తర్వాత ఇన్‌కమ్‌ట్యాక్స్ ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. హిమాన్షు జోష్ 40 పరుగులు చేశాడు. హెచ్ఏఎల్తో జరిగిన ‘ఎ’ ఇన్స్టిట్యూషన్ వన్డే లీగ్ మ్యాచ్‌లో జగన్నాథ్ (6/29) హడలెత్తించడంతో విద్యుత్‌సౌధ 17 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. ఎ-ఇన్స్టిట్యూషన్ వన్డే లీగ్ స్కోర్లు కెనరా బ్యాంక్: 99 (వికాస్ 40; కలిరాజ్ 4/23, ఎన్వీఎన్ రాజు 3/13, చలపతి 3/30) ఎన్ఎఫ్సీ: 100/1 (నాయుడు 35 నాటౌట్, సాండీ 39 నాటౌట్). విద్యుత్‌సౌధ: 131, హెచ్ఏఎల్: 114 (జగన్నాథ్ 6/29, శ్రీనివాస్ 3/15). హెచ్‌సీఏ సంతాపం ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం (ఏపీఓఏ) మాజీ కార్యదర్శి ఎల్. వెంకట్రామ్ రెడ్డి మృతి పట్ల హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) సంతాపం తెలిపింది. గతంలో హెచ్‌సీఏ కార్యవర్గసభ్యుడిగా పనిచేసిన ఆయన మృతి క్రీడారంగానికి తీరని లోటు అని హెచ్‌సీఏ అధ్యక్షుడు జి.వినోద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు హెచ్‌సీఏ తరఫున ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. హెచ్‌సీఏ కార్యవర్గం ఆయన సేవలను కొనియాడింది. -
మెరిసిన సంతోష్
జింఖానా, న్యూస్‌లైన్: ఎలెవన్ మాస్టర్ జట్టు బ్యాట్స్‌మన్ సంతోష్ (121) సెంచరీతో చెలరేగడంతో ఆ జట్టు 82 పరుగుల తేడాతో మాంచెస్టర్ జట్టుపై విజయం సాధించింది. హెచ్‌సీఏ కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఎలెవన్ మాస్టర్ 3 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. హరీష్ (72 నాటౌట్) అర్ధ సెంచరీతో అజేయంగా నిలవగా... నరేష్ 37 పరుగులు చేశాడు. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన మాంచెస్టర్ 4 వికెట్ల నష్టానికి 183 పరుగులు మాత్రమే చేయగలిగింది. చరణ్ (66) అర్ధ సెంచరీతో రాణించగా... నదీమ్ 31 పరుగులు చేశాడు. మరో మ్యాచ్‌లో విజయ్ భరత్ జట్టు బౌలర్ నరసింహ (5/35) ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. దీంతో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో ఫ్యూచర్ స్టార్ జట్టుపై గెలుపొందింది. తొలుత బరిలోకి దిగిన ఫ్యూచర్ స్టార్ 132 పరుగులకే కుప్పకూలింది. కృష్ణ (37) మినహా మిగిలిన వారు రాణించలేకపోయారు. తర్వాత బ్యాటింగ్ చేసిన విజయ్ భారత్ 6 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసి నెగ్గింది. రాజ్ (37) ఫర్వాలేదనిపించాడు. ఫ్యూచ ర్ స్టార్ బౌలర్ కృష్ణ 3 వికెట్లు తీసుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు డెక్కన్ కోల్ట్స్: 158 ( ప్రతీక్ 108 ); ఎస్ఎన్ గ్రూప్: 102 ( సంతోష్ 3/12, కిషన్ 3/24). సఫిల్‌గూడ: 161 ( నిరూప్ 4/20); గ్రీన్ టర్ఫ్: 164/7 (ఉదయ్ కిరణ్ రెడ్డి 64, చార్లెస్ 4/40). ఐఐసీటీ: 132 (శ్రీనివాస్ 33; రామకృష్ణ 4/28, సోహన్ 3/12); కన్సల్ట్: 137/2 (వికాస్ రావు 70). హైదరాబాద్ పేట్రియాట్స్: 224 (మోసిన్ 45, అకీల్ అహ్మద్ 56, ఇమ్రోజ్ 39); ఓఎంసీ: 171 (శ్రీకాంత్ 31, హేమంత్ 31, వంశీ 42; అక్షయ్ 4/17, షాదాబ్ 4/8). ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్ కొసరాజు: 137 (రిత్విక్ 54; ఫాహీమ్ 3/18); ఎస్ఏ అంబర్పేట్: 141/4 (రాకేష్ 58; అజయ్ పట్వారి 3/68). ఎ-ఇన్స్టిట్యూషన్ వన్డే లీగ్ ఐఏఎఫ్: 214 (శంకరీయ 110); ఎంసీహెచ్: 135 (అజీమ్ 50, జితేందర్ 30; దీపక్ 5/21).