
గుంటూరు, సాక్షి: అన్నమయ్య జిల్లాలో ఏన�...
దక్షిణ కొరియాలో ఘోరం జరిగింది. నిర్మ�...
కాకినాడ, సాక్షి: డిప్యూటీ సీఎం పవన్ క...
మహాబూబాబాద్, సాక్షి: కన్నతల్లే ఆ పిల�...
కరీంనగర్, సాక్షి: అధికార కాంగ్రెస్ �...
అడ్డగోలు వాదనలు చేయడంలో కొంతమంది రాజ...
అమరావతి, సాక్షి: వైఎస్సార్సీపీ ప్రత�...
ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో పార్టీ ...
అమరావతి, సాక్షి: ఏపీలో ప్రజాస్వామ్యా�...
సాక్షి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల...
న్యూయార్క్: ఇటీవలి కాలంలో బాంబు బెద�...
సాక్షి, భూపాలపల్లి: తెలంగాణలో సంచలనం�...
SLBC Tunnel Rescue Operation Updates..👉శ్రీశైలం ఎడమ గట్టు కా�...
నాగర్ కర్నూల్, సాక్షి: శ్రీశైలం ఎడమ�...
Shocking Viral Video: పెళ్లి వేడుకలో అంతా హుషారుగా...
Published Wed, Feb 2 2022 6:25 PM | Last Updated on Wed, Feb 2 2022 9:09 PM
సెమీస్‌లో ఆసీస్‌ను ఢీకొట్టనున్న యువ భారత్
అండర్-19 వరల్డ్‌కప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్లో భారత్ 96 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 290 పరుగులు చేయగా, ఆసీస్ 41. 5 ఓవర్లలో 194 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది. భారత యువ బౌలర్లలో విక్టీ ఓస్టావల్ మూడు వికెట్లతో ఆసీస్‌ను దెబ్బ తీయగా, నిషాంత్ సింధు, రవి కుమార్‌లు తలో రెండు వికెట్లతో మెరిశారు. కౌశల్ తాంబే, రఘువంశీలు చెరో వికెట్ తీశారు.
కెప్టెన్ యష్ ధుల్(110), వైస్ కెప్టెన్ షేక్ రషీద్(94)లు చెలరేగి ఆడటంతో ఆసీస్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసి ప్రత్యర్ధికి భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆఖరి ఓవర్లో దినేశ్ బనా(20), నిషాంత్ సింధు(12) ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు.
ఇన్నింగ్స్ 46వ ఓవర్లో యువ భారత్‌కు వరుస షాక్‌లు తగిలాయి. సెంచరీ తర్వాత గేర్ మార్చిన కెప్టెన్ యష్ ధుల్(110 బంతుల్లో 110; 10 ఫోర్లు) తొలుత రనౌట్ కాగా, ఆ మరుసటి బంతికే షేక్ రషీద్(108 బంతుల్లో 94; 8 ఫోర్లు, సిక్స్) క్యాచ్ ఔటయ్యాడు. సెంచరీ అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్న రషీద్.. నిరాశగా వెనుదిరిగాడు. కెప్టెన్, వైస్ కెప్టెన్లు ఇద్దరు వరుస బంతుల్లో ఔట్ కావడంతో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. 46 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 241/4గా ఉంది.
Captain's knock 🔥#INDvAUS | #U19CWC pic.twitter.com/HB2o6kbcY0
— Cricket World Cup (@cricketworldcup) February 2, 2022
యువ భారత కెప్టెన్ యష్ ధుల్ సెంచరీతో కదంతొక్కాడు. 90 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వరుస బౌండరీలు బాది సెంచరీ మార్కును చేరుకున్నాడు. కీలక మ్యాచ్‌లో ధుల్ శతక్కొట్టడంతో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతుంది. మరో ఎండ్‌లో ఉన్న షేక్ రషీద్(92) సైతం సెంచరీకి చేరువయ్యాడు. 45 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 237/2గా ఉంది.
India’s vice-captain Shaik Rasheed has brought up his half-century 👏#INDvAUS | #U19CWC pic.twitter.com/Eu3KkjQvcm
— Cricket World Cup (@cricketworldcup) February 2, 2022
యువ భారత్ వైస్ కెప్టెన్ షేక్ రషీద్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఆచితూచి ఆడుతున్న రషీద్.. 77 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో ఈ ఫీట్‌ను సాధించాడు. మరో ఎండ్‌లో ఉన్న కెప్టెన్ ధుల్(80 బంతుల్లో 69) హాఫ్ సెంచరీ తర్వాత గేర్ మార్చాడు. బౌండరీలతో విరుచుకుపడుతూ స్కోర్ బోర్డు వేగాన్ని పెంచాడు. 36 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 153/2గా ఉంది.
యువ భారత్ కెప్టెన్ యష్ ధుల్ బౌండరీ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 64 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో అతను ఈ ఫీట్‌ను సాధించాడు. ధుల్‌కు మరో ఎండ్‌లో వైస్ కెప్టెన్ షేక్ రషీద్(63 బంతుల్లో 36; 2 ఫోర్లు) సహకరిస్తున్నాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు భారీ భాగస్వామ్యం నెలకొల్పే దిశగా సాగుతున్నారు. 31 ఓవర్ల తర్వాత టీమిండయా స్కోర్ 120/2.
జాక్ నిస్బెట్ బౌలింగ్‌లో తోబియాస్ స్నెల్కు క్యాచ్ ఇచ్చి హర్నూర్ సింగ్ ఔటయ్యాడు. ఫలితంగా యువ భారత్ 37 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో షేక్ రషీద్(7), కెప్టెన్ యష్ ధుల్ ఉన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన యువ భారత్‌కు ఆదిలోని షాక్ తగిలింది. ఓపెనర్ రఘువంశీని(6) విలియమ్స్ సల్జ్మ్యాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఫలితంగా టీమిండియా 16 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో హర్నూర్ సింగ్(5), షేక్ రషీద్ ఉన్నారు. 8 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 18/1.
అండర్19 ప్రపంచకప్‌లో భాగంగా భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ జరుగుతున్న రెండో సెమీస్ పోరులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది
గత రెండు అండర్–19 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాకు షాకిచ్చిన యువ భారత్.. మరోసారి హిస్టరీని రిపీట్ చేసేందుకు ఉవ్విళ్లూరుతుంది. 2018 ఫైనల్లో పృథ్వీ షా నాయకత్వంలోని జట్టు ఆసీస్‌ను ఓడించి టైటిల్ గెలుచుకోగా... 2020 క్వార్టర్ ఫైనల్లో టీమిండియా.. యువ కంగారూ జట్టుకు షాకిచ్చింది
Comments
Please login to add a commentAdd a comment