అండర్ 19 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో ఆస్ట్రేలియా 254 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ముందుంచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో హర్జస్ సింగ్ (55) అర్దసెంచరీతో రాణించగా.. హ్యారీ డిక్సన్ (42), హగ్ వెబ్జెన్ (48), ఒలివర్ పీక్ (46 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
సామ్ కాంస్టాస్ 0, ర్యాన్ హిక్స్ 20, రాఫ్ మెక్‌మిలన్ 2, చార్లీ ఆండర్సన్ 13 పరగులు చేశారు. భారత బౌలర్లలో రాజ్ లింబాని 3 వికెట్లతో చెలరేగగా.. నమన్ తివారి 2, సౌమీ పాండే, ముషీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్ కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో భారత బ్యాటింగ్ త్రయం ఉదయ్ సహారన్, ముషీర్ ఖాన్, సచిన్ దాస్ భీకర ఫామ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఈ ముగ్గురు రాణిస్తే టీమిండియా గెలుపు నల్లేరుపైనడక అవుతుంది.
ఈ టోర్నీ ప్రస్తుత ఎడిషన్‌లో భారత్ అజేయ జట్టుగా ఉంది. ఈసారి యువ భారత్ టైటిల్‌ను గెలిస్తే ఆరో సారి జగజ్జేతగా అవతరిస్తుంది. ఆస్ట్రేలియా సైతం మూడుసార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. టీమిండియా ఈసారి కూడా టైటిల్ గెలవాలని ఆశిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment