సీనియర్ల బాటలోనే జూనియర్లు.. వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఆసీస్‌ చేతిలో భారత్‌ ఓటమి | U19 World Cup 2024 Final: Australia Beat India By 79 Runs, Clinch The Trophy For Fourth Time - Sakshi
Sakshi News home page

U19 WC 2024 Final Highlights: సీనియర్ల బాటలోనే జూనియర్లు.. వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఆసీస్‌ చేతిలో భారత్‌ ఓటమి

Published Sun, Feb 11 2024 9:08 PM | Last Updated on Mon, Feb 12 2024 10:07 AM

Under 19 World Cup 2024 Final: Australia Beat India By 79 Runs, Clinch The Trophy For Fourth Time - Sakshi

అండర్‌ 19 వరల్డ్‌కప్‌ 2024 ఫైనల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. యంగ్‌ ఇండియాతో ఇవాళ (ఫిబ్రవరి 11) జరిగిన ఫైనల్లో యువ ఆసీస్‌ జట్టు 79 పరుగుల తేడాతో విజయం సాధించి, నాలుగో సారి జగజ్జేతగా నిలిచింది. 

ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. భారత సంతతికి చెందిన హర్జస్‌ సింగ్‌ (55) అర్దసెంచరీతో రాణించగా.. హ్యారీ​ డిక్సన్‌ (42), హగ్‌ వెబ్జెన్‌ (48), ఒలివర్‌ పీక్‌ (46 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో రాజ్‌ లింబాని 3, నమన్‌ తివారి 2, సౌమీ పాండే, ముషీర్‌ ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన యువ భారత్‌.. 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలి వంద కోట్లకు పైగా ఉన్న భారతీయులకు నిరాశ కలిగించింది. భారత ఇన్నింగ్స్‌లో ఆదర్శ్‌ సింగ్‌ (47), తెలుగు ఆటగాడు మురుగన్‌ అభిషేక్‌ (42), ముషీర్‌ ఖాన్‌ (22), నమన్‌ తివారి (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్‌ బౌలర్లు బియర్డ్‌మ్యాన్‌ (3/15), రాఫ్‌ మెక్‌మిలన్‌ (3/43), కల్లమ్‌ విడ్లర్‌ (2/35), ఆండర్సన్‌ (1/42) టీమిండియా పతనాన్ని శాశించారు. 

సీనియర్ల బాటలోనే జూనియర్లు.. 
భారత క్రికెట్‌ జట్టును వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ఫోబియా వదలట్లేదు. గతేడాది చివర్లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో భారత సీనియర్లు ఇదే ఆసీస్‌ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొనగా.. తాజాగా జూనియర్లు సీనియర్ల బాటలోనే నడుస్తూ అండర్‌ 19 వరల్డ్‌కప్‌ ఫైనల్లో కుర్ర ఆసీస్‌ జట్టు చేతిలో ఓటమిపాలయ్యారు. ప్రస్తుత ఎడిషన్‌లో ఫైనల్‌ వరకు అజేయ జట్టుగా నిలిచిన భారత్‌ రోహిత్‌ సేనలాగే తుది సమరంలో బొక్కబోర్లా పడి భారత క్రికెట్‌ అభిమానులకు గుండెకోత మిగిల్చింది. 

చదవండి: World Cup Final: తెలుగులో మాట్లాడుకున్న క్రికెటర్లు.. వైరల్‌ వీడియో
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement