అండర్-19 ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కెప్టెన్ యశ్ ధుల్ సూపర్ సెంచరీకి(110 పరుగులు) తోడు షేక్ రషీద్(94) రాణించడంతో యువ భారత్.. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను 96 పరుగులతో మట్టికరిపించింది. శనివారం జరగనున్న ఫైనల్లో ఇంగ్లండ్‌తో అమితుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే అండర్-19 ప్రపంచకప్‌లో నాలుగుసార్లు విజేతగా నిలిచిన టీమిండియా ఐదోసారి టైటిల్‌పై కన్నేసింది.
చదవండి: U19 World Cup Semi Final: ఆసీస్‌పై సెంచరీతో విరాట్ కోహ్లీ సరసన చేరిన యశ్ ధుల్
ఇదిలాఉంటే.. సూపర్ సెంచరీతో మెరిసిన యశ్ ధుల్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. అతను కొట్టిన ఒకే ఒక్క సిక్స్ ఇప్పుడు క్లాసిక్‌గా మిగిలిపోనుందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఆసీసీ బౌలర్ టామ్ విట్నీ వేసిన ఇన్నింగ్స్ 45వ ఓవర్ ఐదో బంతిని యష్ ధుల్ లాంగాన్ మీదుగా భారీ సిక్స్ కొట్టాడు. బంతి షార్ట్‌పిచ్ అవగా.. ఫ్రంట్‌ఫుట్‌కు వచ్చిన యష్.. డ్యాన్స్ మూమెంట్ ఇస్తూ బ్యాట్ ఎడ్జ్‌ను తగిలించాడు. అంతే.. బంతి లాంగాన్ మీదుగా వెళ్లి స్టాండ్స్ టాప్‌లో పడింది. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ''ఒక్క క్లాసిక్ సిక్స్‌తో ఐసీసీ ప్లే ఆఫ్ ది డే అవార్డు కొల్లగొట్టాడు.. ఇంతకీ యష్ ధుల్ కొట్టిన సిక్స్‌కు క్రికెట్ పుస్తకాల్లో ఏ పేరుందో కాస్త చెప్పండి'' అంటూ పేర్కొంది.
చదవండి: హార్దిక్ పాండ్యాపై నిప్పులు చెరిగిన కోహ్లి చిన్ననాటి కోచ్
WHAT A HIT 🔥
— ICC (@ICC) February 3, 2022
Yash Dhull's stunning six dancing down the track is the @Nissan #POTD winner from the #U19CWC Super League semi-final clash between India and Australia 👏 pic.twitter.com/rFiEAsv2G4
Comments
Please login to add a commentAdd a comment