ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ అదరగొట్టింది. మొరాకోతో జరిగిన కీలక మ్యాచ్‌లో 2-0 గోల్స్ తేడాతో ఫ్రాన్స్ విజయాన్ని అందుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ అందుకు తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తూ ఫైనల్‌కు చేరింది.
ఇక, డిసెంబర్ 18న అర్జెంటీనాతో జరిగే ఫైనల్లో ఫ్రాన్స్ అమితుమీ తేల్చుకోనుంది. మరోవైపు.. గత ఏడు ఎడిషన్లలో ఫ్రాన్స్ జట్టు నాల్గొవ సారి ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. ఈ విజయంతో 2002లో బ్రెజిల్ తర్వాత వరుసగా ఫైనల్స్‌కు చేరిన తొలి డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఫ్రాన్స్ నిలిచింది. ఇదిలా ఉండగా.. రష్యాలో జరిగిన 2018 ప్రపంచ కప్‌లో ఫ్రాన్స్ 4-2తో క్రొయేషియాను ఓడించి విన్నర్‌గా నిలిచింది.
🔝 performance 💥@AntoGriezmann covered every blade of grass to ensure @FrenchTeam would reach back-to-back #FIFAWorldCup Finals 🔥
— JioCinema (@JioCinema) December 14, 2022
Enjoy his Hero of the Day display, presented by @Mahindra_Auto#FRAMAR #Qatar2022 #WorldsGreatestShow #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/G7UOQ42HCa
Comments
Please login to add a commentAdd a comment