![Mumbai Enters Final 47th-Time Beat Uttar Pradesh Ranji Trophy 2022 - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/19/mumba.jpg.webp?itok=nzUJ-AEp)
దేశవాళీ దిగ్గజ టీమ్ ముంబై ఐదేళ్ల తర్వాత ఫైనల్ బెర్త్‌ను సాధించింది. ఉత్తరప్రదేశ్‌తో ముగిసిన రెండో సెమీస్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా ముంబై 47వ సారి ఫైనల్లోకి ప్రవేశించింది. ఓవర్‌నైట్ స్కోరు 449/4తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ముంబై మరో 16 ఓవర్లలో 84 పరుగులు జోడించి 533/4 వద్ద డిక్లేర్ చేసింది. సర్ఫరాజ్ ఖాన్ (59 నాటౌట్), షమ్స్ ములాని (51 నాటౌట్) అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. తొలి ఇన్నింగ్స్ 213 పరుగుల ఆధిక్యం కలిపి ముంబై మొత్తం స్కోరు 746కు చేరింది. ముంబై ముందంజ వేయడం ఖాయం కావడంతో యూపీ రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగలేదు. గతంలో 46 సార్లు రంజీ ఫైనల్ చేరిన ముంబై 41 సార్లు టైటిల్ గెలుచుకొని ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment