టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లి తన సూపర్‌ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. టి20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో అర్థసెంచరీతో మెరిశాడు. టి20 వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్ అంటే చాలు కోహ్లిలో ఉత్సాహం ఉరకలెత్తుతుంది. తాజాగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 40 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కోహ్లి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.
ఇక కోహ్లికి సెమీఫైనల్స్ అంటే పూనకాలే అన్నట్లుగా అతని బ్యాటింగ్ ఉంటుంది. తాజా దానితో కలిపి ఇప్పటివరకు కోహ్లి టి20 ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లో మూడు అర్థసెంచరీలు సాధించాడు. తొలిసారి 2014లో సౌతాఫ్రికాపై 72 పరుగులు నాటౌట్, 2016లో వెస్టిండీస్‌పై 89 పరుగులు నాటౌట్, తాజాగా ఇంగ్లండ్‌పై 50 పరుగులు సాధించాడు. ఇలా ఒక వరల్డ్‌కప్‌లో సెమీస్‌లో మూడు అర్థసెంచరీలు సాధించిన తొలి బ్యాటర్‌గా కోహ్లి రికార్డులకెక్కాడు. ఈ ప్రపంచకప్‌లో కోహ్లికి ఇది నాలుగో అర్థసెంచరీ కావడం విశేషం.
చదవండి: IND Vs ENG: ఏంటి రాహుల్ నీ ఆట? వెంటనే జట్టు నుంచి తీసేయండి!
Comments
Please login to add a commentAdd a comment