
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత ఆశల పల్లకిని మోస్తున్న ఏకైక జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇంటా బయటా విశేషంగా రాణిస్తోన్న భారత పురుషుల డబుల్స్ జోడీ శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్, వరల్డ్ నంబర్‌వన్ టకురొ హొకి–యుగొ కొబయషి (జపాన్) జంటను కంగు తినిపించింది.
49 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం వరుస గేముల్లో 21–12, 21–16 టాప్‌సీడ్ జంటకు ఇంటిదారి చూపింది. హొకి–యుగొతో తలపడిన నాలుగు మ్యాచ్‌లలో వీరికి ఇది మూడో విజయం కాగా... వీరిద్దరు ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్ చేరడం ఇది మూడో సారి. శనివారం జరిగే సెమీఫైనల్లో భారత జోడీ కొరియాకు చెందిన చొయ్ సొల్ గ్యు–కిమ్ వోన్ హో జంటను ఎదుర్కొంటుంది.
Comments
Please login to add a commentAdd a comment