పారిస్: 13 సార్లు చాంపియన్ ఒకవైపు... తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్ చేరిన యువ ఆటగాడు మరోవైపు... క్లే కోర్టు అడ్డా ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. నేడు జరిగే పురుషుల సింగిల్స్ తుది పోరులో ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడైన రాఫెల్ నాదల్, 23 ఏళ్ల నార్వే ఆటగాడు కాస్పర్ రూడ్‌తో తలపడతాడు.
తన 21 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ రికార్డులో 13 ఇదే కోర్టులో నెగ్గిన నాదల్ స్థాయి ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తొలి ప్రయత్నంలోనే కొండను ఢీకొట్టబోతున్న రూడ్ ఏమాత్రం పోటీనిస్తాడనేది చూడాలి. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో సెమీఫైనల్లో కాస్పర్ రూడ్ 3–6, 6–4, 6–2, 6–2తో సిలిచ్ (క్రొయేషియా)ను ఓడించాడు. ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్లోకి అడుగు పెట్టిన తొలి నార్వే ప్లేయర్‌గా రూడ్ ఘనత సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment