
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, సమీర్ వర్మ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు, ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 21–18, 21–18తో భారత్‌కే చెందిన ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ లక్ష్య సేన్‌ను ఓడించాడు.
ఇతర మ్యాచ్‌ల్లో ప్రణయ్ 21–16, 16–21, 21–16తో డారెన్ లూ (మలేసియా)పై గెలుపొందగా... ప్రపంచ 31వ ర్యాంకర్ సమీర్ వర్మ 21–15, 21–23, 22–20తో ప్రపంచ ఆరో ర్యాంకర్ ఆంథోనీ జిన్‌టింగ్ (ఇండోనేసియా)ను బోల్తా కొట్టించాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో అర్జున్–ధ్రువ్ కపిల (భారత్) జోడీ 15–21, 16–21తో ఫజర్–మొహమ్మద్ రియాన్ (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment