Sameer Verma
-
ఐదేళ్ల తర్వాత అంతర్జాతీయ టైటిల్.. చాంపియన్ సమీర్ వర్మ
Slovenia Open- 2023: ఐదేళ్ల తర్వాత భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సమీర్ వర్మ తన కెరీర్లో మరో అంతర్జాతీయ టైటిల్‌ను సాధించాడు. స్లొవేనియా ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలో సమీర్ వర్మ విజేతగా నిలిచాడు. ఫైనల్లో సమీర్ వర్మ 21–18, 21–14తో సు లి యాంగ్ (చైనీస్ తైపీ)పై నెగ్గాడు. విజేతగా నిలిచిన సమీర్‌కు 1200 డాలర్ల (రూ. 99 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది. చివరిసారి సమీర్ వర్మ 2018లో సయ్యద్ మోదీ సూపర్–300 టోర్నీలో టైటిల్ సాధించాడు. ఇక టోర్నీలో సిక్కి రెడ్డి- రోహన్ కపూర్ జోడీ మిక్స్డ్ డబుల్స్‌లో రజతం సాధించారు. అర్జున్ ఖాతాలో మూడో ‘డ్రా’ షార్జా మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ మూడో ‘డ్రా’ నమోదు చేశాడు. షాంట్ సర్గ్‌సియాన్ (అర్మేనియా)తో సోమవారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను అర్జున్ 34 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఈ టోర్నీలో రెండు గేముల్లో గెలిచి, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిన అర్జున్ 3.5 పాయింట్లతో 18వ ర్యాంక్‌లో ఉన్నాడు. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, నిహాల్ సరీన్, ఆర్యన్ చోప్రా నాలుగు పాయింట్లతో ఉమ్మడిగా రెండో ర్యాంక్‌లో ఉన్నారు. మాజీ టాప్ ర్యాంక్ జోడీకి సాకేత్–యూకీ షాక్ పారిస్: లియోన్ –250 ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్లో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ సంచలన విజయంతో శుభారంభం చేసింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–యూకీ ద్వయం 7–6 (7/4), 3–6, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ జోడీ సెబాస్టియన్ కబాల్–రాబర్ట్ ఫరా (కొలంబియా) జోడీపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గంటా 53 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సాకేత్, యూకీ రెండు ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ ర్యాంకింగ్ ఆధారంగా వచ్చే వారం పారిస్‌లో మొదలయ్యే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ పురుషుల డబుల్స్ మెయిన్ ‘డ్రా’కు సాకేత్, యూకీ అర్హత పొందారు. -
French Open Badminton: శ్రీకాంత్ శుభారంభం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, సమీర్ వర్మ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు, ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 21–18, 21–18తో భారత్‌కే చెందిన ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ లక్ష్య సేన్‌ను ఓడించాడు. ఇతర మ్యాచ్‌ల్లో ప్రణయ్ 21–16, 16–21, 21–16తో డారెన్ లూ (మలేసియా)పై గెలుపొందగా... ప్రపంచ 31వ ర్యాంకర్ సమీర్ వర్మ 21–15, 21–23, 22–20తో ప్రపంచ ఆరో ర్యాంకర్ ఆంథోనీ జిన్‌టింగ్ (ఇండోనేసియా)ను బోల్తా కొట్టించాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో అర్జున్–ధ్రువ్ కపిల (భారత్) జోడీ 15–21, 16–21తో ఫజర్–మొహమ్మద్ రియాన్ (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
సింధు శుభారంభం
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు (భారత్) 21–12, 21–10తో నెస్లిహాన్ యిగిట్ (టర్కీ)పై అలవోకగా గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21–14, 21–11తో భారత్‌కే చెందిన సాయిప్రణీత్‌పై నెగ్గగా... సమీర్ వర్మ 21–17, 21–14తో కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్)ను ఓడించాడు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–ధ్రువ్ ద్వయం 14–21, 21–17, 21–18తో ప్రపంచ 25వ ర్యాంక్ జోడీ హూ పాంగ్ రోన్–చె యి సీ (మలేసియా)పై సంచలన విజయం సాధించింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 23–21, 21–15తో హెమింగ్ –స్టాల్‌వుడ్ (ఇంగ్లండ్)లపై, అర్జున్–ధ్రువ్ 21–19, 21–15తో బెన్ లేన్–సీన్ వెండీ (ఇంగ్లండ్)లపై నెగ్గగా... సుమీత్ రెడ్డి–మనూ అత్రి 18–21, 11–21తో గోసెఫె –నూరు జుద్దీన్ (మలేసియా) చేతిలో ఓడిపోయారు. -
బ్యాంకాక్ వెళ్లారు...తొలి రౌండ్లో ఓడేందుకు!
బ్యాంకాక్: భారత అగ్రశ్రేణి షట్లర్లు సహా అందరూ థాయ్‌లాండ్ మాస్టర్స్ టోర్నీలో నిరాశపరిచారు. ఈ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, సమీర్ వర్మ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. దీంతో టోర్నీ మెయిన్ ‘డ్రా’ మొదలైన రోజే భారత్ కథ ముగిసింది. మెరుగైన ర్యాంకింగ్ ద్వారా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగినప్పటికీ ఆ స్థాయి ఆటతీరేమీ పోటీల్లో కనబర్చలేదు. ఇలా వెళ్లారు... అలా ఓడారు... అన్నట్లు తమ మ్యాచ్‌ల్ని ముగించుకొని కోర్టుల నుంచి బయట పడ్డారు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 18వ ర్యాంకర్, ఐదో సీడ్ సైనా 13–21, 21–17, 15–21తో అన్‌సీడెడ్, ప్రపంచ 29వ ర్యాంకర్ లైన్ హోజ్మార్క్ జార్స్‌ఫెల్డ్ (డెన్మార్క్) చేతిలో తొలిసారి ఓడిపోయింది. గతంలో జార్స్‌ఫెల్డ్‌తో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన సైనా 47 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో ఒక్క రెండో గేమ్‌లో మాత్రమే చక్కగా ఆడగలిగింది. మిగతా రెండు గేముల్లో చేతులెత్తేసింది. గతవారం జరిగిన ఇండోనేసియా మాస్టర్స్ ఈవెంట్లోనూ ఆమె తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, భారత్ స్టార్ శ్రీకాంత్ 21–12, 14–21, 12–21తో షెసర్ హెరెన్ రుస్తవిటో (ఇండోనేసియా) చేతిలో పరాజయం చవిచూశాడు. తొలి రౌండ్లోనే చుక్కెదురవడం ఐదో సీడ్ తెలుగు షట్లర్‌కు వరుసగా ఇది మూడోసారి. మలేసియా, ఇండోనేసియా టోరీ్నల్లోనూ అతను మొదటి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. సమీర్ 16–21, 15–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో ని్రష్కమించాడు. ప్రణయ్ 17–21, 22–20, 19–21తో ల్యూ డారెన్ (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌కు ఒక దేశం నుంచి ఇద్దరు షట్లర్లు అర్హత పొందాలంటే ఒలింపిక్ ర్యాంకింగ్స్‌లో ఆ ఇద్దరు టాప్–16లో ఉండాలి. ప్రస్తుతం భారత్ నుంచి మహిళల సింగిల్స్‌లో సింధు... పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్ మాత్రమే ‘టోక్యో’ దారిలో ఉన్నారు. -
రెండో రౌండ్లోనే ఇంటిముఖం..
గ్వాంగ్జు(కొరియా): భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ కొరియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్-300 టోర్నమెంట్లో ఇంటిముఖం పట్టాడు. పురుషుల సింగిల్స్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో రౌండ్ పోరులో శ్రీకాంత్ 14-21, 19-21 తేడాతో కంటా సునేయామా(జపాన్)చేతిలో పరాజయం చవిచూశాడు. సునేయామాతో తొలిసారి తలపడిన శ్రీకాంత్ ఎటువంటి వరుస రెండు గేమ్‌లు సమర్పించుకుని ఓటమి పాలయ్యాడు. కేవలం 37 నిమిషాలు పాటు జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ ఎటువంటి ప్రభావం చూపలేకపోయాడు. తొలి గేమ్‌ను దారుణగా కోల్పోయిన శ్రీకాంత్.. రెండో గేమ్ చివర్లో కాస్త ప్రతిఘటించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఇండియన్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన శ్రీకాంత్.. అప్పట్నుంచీ తిరిగి గాడిలో పడటానికి ఎంత ప్రయత్నిస్తున్నా ఆశించిన ఫలితాలు మాత్రం నమోదు చేయడం లేదు. ఇక భారత షట్లర్ సమీర్ వర్మ కథ కూడా ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. దక్షిణకొరియాకు చెందిన కిమ్ డాంగన్ చేతిలో సమీర్ పరాజయం చెందాడు. డాంగన్ 21-19, 21-12 తేడాతో సమీర్‌ను బోల్తా కొట్టించాడు. -
శ్రీకాంత్ శుభారంభం
గ్వాంగ్జు (కొరియా): భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ కొరియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ శ్రీకాంత్ 21–18, 21–17తో వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)పై విజయం సాధించాడు. భారత్‌కే చెందిన ‘వర్మ బ్రదర్స్’ సమీర్, సౌరభ్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. సకాయ్ కజుమసా (జపాన్)తో జరిగిన మ్యాచ్‌లో సమీర్ వర్మ తొలి గేమ్‌లో 11–8తో ఆధిక్యంలో ఉన్న దశలో కజుమసా గాయంతో వైదొలిగాడు. జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ 21–13, 12–21, 13–21తో కిమ్ డాంగ్‌హున్ (కొరియా) చేతిలో ఓడిపోయాడు. -
శ్రీకాంత్‌కు నిరాశ
పారిస్: ఈ సీజన్లో నిరాశాజనక ప్రదర్శన కొనసాగిస్తూ... భారత అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, సమీర్ వర్మ ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోరీ్నలో తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21–15, 7–21, 14–21తో రెండో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో... కశ్యప్ 11–21, 9–21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో... సమీర్ వర్మ 84 నిమిషాల్లో 22–20, 18–21, 18–21తో నిషిమోటో (జపాన్) చేతిలో ఓడిపోయారు. సైనా శుభారంభం... మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా నెహా్వల్ 23–21, 21–17తో చెయుంగ్ ఎన్గాన్ యి (హాంకాంగ్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా 13–21, 18–21తో క్రిస్ అడ్కాక్–గాబ్రియేలా అడ్కాక్ (ఇంగ్లండ్) చేతిలో... అశ్విని పొన్నప్ప–సాత్విక్ సాయిరాజ్ 17–21, 18–21తో సియో సెయుంగ్ జే–చే యుజుంగ్ (కొరియా) చేతిలో పరాయం పాలయ్యారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 21–16, 21–14తో జెలీ మాస్–రాబిన్ తబెలింగ్ (నెదర్లాండ్స్)లపై నెగ్గగా... సుమీత్ రెడ్డి–మనూ అత్రి 19–21, 22–20, 15–21తో బెన్ లేన్–సీన్ వెండీ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశి్వని పొన్నప్ప 21–16, 13–21, 17–21తో లీ సో హీ–షిన్ సెయుంగ్ చాన్ (కొరియా) చేతిలో ఓటమి పాలయ్యారు. -
సైనాకు చుక్కెదురు
ఓదెన్స్(డెన్మార్క్): గత కొంతకాలంగా తొలి రౌండ్లోనే వెనుదిరుగుతున్న భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు మరోసారి అదే ఫలితం పునరావృతమైంది. డెన్మార్క్ ఓపెన్ సూప ర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో బుధ వారం మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సైనా 15–21, 21–23తో తక హాషి(జపాన్) చేతిలో ఓటమి చవిచూసిం ది. లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజే త, ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సైనా ఈ మ్యాచ్‌లో తన పూర్తి సామర్థ్యం మేరకు ఆడలేకపోయింది. తొలి సెట్‌ను చేజార్చు కున్నాక హోరాహోరీగా సాగిన రెండో సెట్లో సైనా పోరాడినప్పటికీ చివరికి ప్రత్యర్థి ధాటికి పరాజయం పాలైంది. కాగా, పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ 21–11, 21–11తో సునెయమ (జపాన్) ను చిత్తు చేసి ప్రిక్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. తదుపరి మ్యాచ్‌లో చెన్ లాంగ్(చైనా)తో సమీర్ తలపడతాడు. మరోవైపు మిక్స్డ్ డబుల్స్‌లో ప్రణవ్ జెర్రీ చోప్రా– సిక్కిరెడ్డి ద్వయం 21–16, 21–11తో సీడెల్–ఎఫ్లర్(జర్మనీ) జోడీపై గెలిచి తదుపరి రౌండ్‌కు చేరగా, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి–అశ్వని పొన్నప్ప ద్వయం ప్రత్యర్థి జోడీ వాంగ్–హువాంగ్(చైనా)కు వాకోవర్ ఇచ్చి పోటీ నుంచి తప్పుకొంది. -
భారత స్టార్స్‌కు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్లో ‘బై’ పొందిన భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు సమీర్ వర్మ, హెచ్ఎస్ ప్రణయ్, సాయిప్రణీత్ రెండో రౌండ్లోనే నిష్క్రమించారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ సమీర్ వర్మ 18–21, 11–21తో హియో క్వాంగ్ హీ (కొరియా) చేతిలో... రెండో సీడ్ సాయిప్రణీత్ 17–21, 23–21, 15–21తో లియోనార్డో రుంబే (ఇండోనేసియా) చేతిలో... మూడో సీడ్ ప్రణయ్ 17–21, 10–21తో జియా వె తాన్ (మలేసియా) చేతిలో ఓడిపోయారు. భారత్‌కే చెందిన పారుపల్లి కశ్యప్, సౌరభ్ వర్మ, శుభాంకర్ డే ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ కశ్యప్ 23–21, 19–21, 21–17తో క్వాలిఫయర్ కిమ్ డాంగ్‌హున్ (కొరియా)పై, శుభాంకర్ 19–21, 21–13, 21–16తో సెంగ్ జో యో (మలేసియా)పై గెలిచారు. హైదరాబాద్ ఆటగాడు, క్వాలిఫయర్ చిట్టబోయిన రాహుల్ యాదవ్ తొలి రౌండ్లో 21–16, 21–23, 15–21తో మరో క్వాలిఫయర్ బాయ్ యు పెంగ్ (చైనా) చేతిలో ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో చుక్కా సాయి ఉత్తేజిత రావు 21–14, 17–21, 21–10తో దిశా గుప్తా (అమెరికా)పై గెలుపొందగా... గుమ్మడి వృశాలి 16–21, 10–21తో ఫితాయపోర్న్ చైవన్ (థాయ్‌లాండ్) చేతిలో... కుదరవల్లి శ్రీకృష్ణప్రియ 15–21, 10–21తో కి జుయ్‌ఫె (ఫ్రాన్స్) చేతిలో పరాజయం పాలయ్యారు. -
ముగిసిన భారత్ పోరు
సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. ఇప్పటికే మిక్స్డ్ డబుల్స్, మహిళల డబుల్స్‌లో భారత జోడీలు వెనుదిరగ్గా, తాజాగా మహిళల, పురుషుల సింగిల్స్, పురుషుల డబుల్స్‌లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ సీజన్లో తొలి టైటిల్ ఖాతాలో వేసుకోవాలని బరిలోకి దిగిన పీవీ సింధుతోపాటు, సమీర్ వర్మ, సాయిప్రణీత్ సైతం ఇంటిబాట పట్టారు. గురువారం మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, వరల్డ్ నెం.5 సింధు 19–21 18–21తో 29వ ర్యాంకర్ నిచోన్ జిందాపోల్(థాయ్‌లాండ్) చేతిలో పరాజయం పాలైంది. 49 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో కీలక సమయాల్లో తడబడిన సింధు మూల్యం చెల్లించుకుంది. పురుషుల విభాగంలో వరల్డ్ నెం.12 సమీర్ 16–21, 21–7, 13–21తో వాంగ్ జు వీ(తైవాన్) చేతిలో, సాయి ప్రణీత్ 23–25, 9–21తో రెండో సీడ్ ఆంథోనీ సినిసుక గింటింగ్(ఇండోనేషియా) చేతిలో, పారుపల్లి కశ్యప్ 17–21 22–20 14–21తో చైనా దిగ్గజం లిన్ డాన్ చేతిలో పోరాడి ఓడారు. అలాగే పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ పోరాటం సైతం ముగిసింది. సాయిరాజ్– చిరాగ్ ద్వయం 19–21, 18–21తో లి జున్హుయ్– లియూ యుచెన్(చైనా) చేతిలో పోరాడి ఓడింది. ముఖాముఖి పోరులో జిందాపోల్ చేతిలో ఇది సింధుకు రెండో ఓటమి. ఇప్పటివరకూ వీరిద్దరూ ఏడు సార్లు తలపడగా ఐదింట్లో విజయం సింధూనే వరించింది. ఈ ఏడాది ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌తోపాటు మరో నాలుగు టోర్నీల్లో పాల్గొన్న సింధు ఒక్కదాంట్లోనూ కనీసం ఫైనల్‌కు కూడా చేరలేకపోయింది. స్వదేశంలో జరిగిన ఇండియా ఓపెన్‌లో మాత్రం సెమీస్‌కు చేరగలిగింది. -
సింధు శుభారంభం
సిడ్నీ: ఈ సీజన్లో తొలి టైటిల్ సాధించే దిశగా భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో వరల్డ్ నెం.5, రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సింధు 21–14,21–9తో చొయరున్నీసా (ఇండోనేషియా)పై అలవోక విజయం సాధించింది. కాగా, పురుషుల విభాగంలో సమీర్ వర్మ, సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్ సైతం రెండో రౌండ్‌కు చేరుకున్నారు. ఆరో సీడ్ సమీర్ 21–15, 16–21, 21–12తో లీ జీ జియా(మలేషియా)పై గెలిచాడు. ఫలితంగా సుదిర్మన్ కప్‌లో అతని చేతిలో ఎదురైన అనూహ్య ఓటమికి బదులు తీర్చుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో భమిడిపాటి సాయి ప్రణీత్ 21–16, 21–14తో లీ డాంగ్ కియూన్ (దక్షిణకొరియా)పై, కశ్యప్ 21–16, 21–15తో అవిహింగ్సనన్(థాయ్‌లాండ్) పై గెలిచి తదుపరి రౌండ్‌కు చేరుకోగా, హెచ్ఎస్ ప్రణయ్ 18–21, 19–21తో చైనా దిగ్గజం లిన్ డాన్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. తదుపరి రౌండ్లో జిందాపోల్(థాయ్‌లాండ్)తో సింధు, వాంగ్ జు వీ(తైవాన్)తో సమీర్, ఆంథోనీ సినిసుక గింటింగ్(ఇండోనేషియా)తో ప్రణీ త్ తలపడతారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి–చిరాగ్ షెట్టి ద్వయం 21–12, 21–16తో మనదేశానికే చెందిన మనుఅత్రి –సుమీత్ రెడ్డిజోడీని ఓడించగా, మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప– సిక్కిరెడ్డి జోడీ 14–21, 13–21 తో బేక్ హ న– కిమ్ హైరిన్(దక్షిణకొరియా)జంట చేతిలో పరాజయం పాలైంది. -
రెండో రౌండ్లో కశ్యప్
బాసెల్,(స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, శుభాంకర్ డే రెండో రౌండ్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో కశ్యప్ 21–19, 21–17తో ఫెలిక్స్ బ్యూరెస్‌డెట్ (స్వీడన్)పై, శుభాంకర్ 21–19, 21–17తో లుకాస్ క్లియర్‌బౌట్ (ఫ్రాన్స్)పై గెలిచారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో జక్కా వైష్ణవి రెడ్డి 12–21, 23–21, 17–21తో క్రిస్టిన్ కుబా (ఎస్తొనియా) చేతిలో, గుమ్మడి వృశాలి 14–21, 11–21తో మిచెల్లి లీ (కెనడా) చేతిలో ఓడిపోయారు. క్వాలిఫయర్ రియా ముఖర్జీ (భారత్) 21–23, 21–15, 21–8తో లిండా జెట్చిరి (బల్గేరియా)పై విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా ద్వయం 21–15, 21–17తో రాల్ఫీ జాన్సెన్–కిలాసు (జర్మనీ) జోడీపై నెగ్గింది. -
మురిపించే ముగింపు ఎవరిదో!
గతేడాది అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సర్క్యూట్లో అదరగొట్టిన భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు ఈ ఏడాదీ నిలకడగా రాణించింది. కానీ ఫైనల్ చేరిన ప్రతి టోర్నీలోనూ తడబడి ఒక్క టైటిల్ కూడా తన ఖాతాలో జమ చేసుకోలేకపోయింది. అయితే ఈ సీజన్‌ను టైటిల్‌తో ముగించేందుకు ఆమెకు వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నమెంట్ రూపంలో చివరి అవకాశం వచ్చింది. ఈ ఏడాది ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) టోర్నమెంట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన టాప్–8 క్రీడాకారుల మధ్య జరిగే ఈ మెగా ఈవెంట్లో సింధు ‘ఫినిషింగ్ టచ్’ ఇస్తుందో లేదో వేచి చూడాలి. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. గ్వాంగ్జౌ (చైనా): ఈ ఏడాది ఇండియా ఓపెన్, కామన్వెల్త్ గేమ్స్, థాయ్‌లాండ్ ఓపెన్, ప్రపంచ చాంపియన్‌షిప్, ఏషియన్ గేమ్స్ ఈవెంట్స్‌లో పీవీ సింధు ఫైనల్లోకి దూసుకెళ్లింది. కానీ చివరి అడ్డంకిని అధిగమించలేకపోయింది. ఈ ఐదు ఈవెంట్స్‌లో ఆమె ఐదుగురు వేర్వేరు ప్రత్యర్థుల చేతుల్లో ఓటమి చవిచూసింది. ఇప్పటి వరకు ఈ సీజన్లో సింధు 63 మ్యాచ్‌లు ఆడి 45 విజయాలు నమోదు చేసి, 18 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఏడాది పొడవునా నిలకడగా రాణించిన ఆమెకు టైటిల్ మాత్రం ఇంకా ఊరిస్తోంది. గతేడాది దుబాయ్‌లో జరిగిన సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో రన్నరప్‌గా నిలిచిన సింధు ఈసారి మాత్రం స్వర్ణంతో తిరిగి రావాలని... ఈ ఏడాది టైటిల్ లేని లోటును తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. అయితే సింధుకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. గ్రూప్ ‘ఎ’లో సింధుతోపాటు ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ), రెండో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్), 12వ ర్యాంకర్ బీవెన్ జాంగ్ (అమెరికా) ఉన్నారు. ఈ ముగ్గురూ ఈ ఏడాది సింధును ఓడించడం గమనార్హం. బుధవారం జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో అకానె యామగుచితో సింధు ఆడనుంది. ఇప్పటివరకు వీరిద్దరు 13 సార్లు ముఖాముఖిగా తలపడ్డారు. తొమ్మిది సార్లు సింధు... నాలుగుసార్లు యామగుచి గెలుపొందారు. అయితే చివరి మూడు మ్యాచ్‌ల్లో మాత్రం యామగుచినే విజయం వరించడం విశేషం. యామగుచి తర్వాత తదుపరి రెండు మ్యాచ్‌ల్లో బీవెన్ జాంగ్‌తో, తై జు యింగ్‌తో సింధు ఆడాల్సి ఉంటుంది. బీవెన్ జాంగ్‌తో ముఖాముఖి రికార్డులో సింధు 3–3తో సమంగా ఉండగా... తై జు యింగ్‌తో మాత్రం సింధు 3–10తో వెనుకంజలో ఉంది. ఈ ఏడాది తై జు యింగ్ సూపర్ ఫామ్‌లో ఉంది. ఎనిమిది టోర్నమెంట్లలో ఫైనల్ చేరిన ఆమె ఆరు టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. రెండు టోర్నీలలో రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు గ్రూప్ ‘బి’లో ఐదో ర్యాంకర్, ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్), మూడో ర్యాంకర్ చెన్ యుఫె (చైనా), ఎనిమిదో ర్యాంకర్, మాజీ విశ్వవిజేత రచనోక్ (థాయ్‌లాండ్), 16వ ర్యాంకర్ మిచెల్లి లీ (కెనడా) ఉన్నారు. గ్రూప్ లీగ్ మ్యాచ్‌లు ముగిశాక ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఎవరికెంత... 15 లక్షల డాలర్ల (రూ. 10 కోట్ల 83 లక్షలు) ప్రైజ్‌మనీతో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు లక్షా 20 వేల డాలర్ల (రూ. 86 లక్షల 70 వేలు) చొప్పున లభిస్తాయి. రన్నరప్‌గా నిలిచిన వారు 60 వేల డాలర్లు (రూ. 43 లక్షల 34 వేలు) అందుకుంటారు. సెమీఫైనల్లో ఓడిన వారికి 30 వేల డాలర్లు (రూ. 21 లక్షల 67 వేలు) లభిస్తాయి. లీగ్ దశలో గ్రూప్‌లో మూడో స్థానంలో నిలిచిన వారికి 16,500 డాలర్ల (రూ. 11 లక్షల 92 వేలు) చొప్పున... చివరి స్థానంలో నిలిచిన వారికి 9 వేల డాలర్లు (రూ. 6 లక్షల 50 వేలు) లభిస్తాయి. సమీర్ సంచలనం సృష్టించేనా... పురుషుల సింగిల్స్‌లో తొలిసారి ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి అర్హత సాధించిన సమీర్ వర్మ తన స్థాయికి తగ్గట్టు ఆడితే సెమీఫైనల్ చేరుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది సమీర్ వర్మ సయ్యద్ మోదీ ఓపెన్, హైదరాబాద్ ఓపెన్, స్విస్ ఓపెన్ టైటిల్స్ గెలిచాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల సమీర్ ఈ ఏడాది 47 మ్యాచ్‌లు ఆడాడు. 31 మ్యాచ్‌ల్లో గెలిచి, 16 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. బుధవారం జరిగే పురుషుల సింగిల్స్ గ్రూప్ ‘బి’లో ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్)తో సమీర్ వర్మ ఆడతాడు. స్విస్ ఓపెన్ టైటిల్ గెలిచే క్రమంలో క్వార్టర్ ఫైనల్లో మొమోటాపై సమీర్ వర్మ గెలుపొందడం గమనార్హం. అయితే ఈ ఏడాది మొమోటా అద్వితీయమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది అతను ఏడు టైటిల్స్ సాధించడం విశేషం. మొత్తం 77 మ్యాచ్‌ల్లో కేవలం 7 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయాడు. మొమోటా ఫామ్ చూస్తుంటే సీజన్‌ను మరో టైటిల్‌తో ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ గ్రూప్‌లో ఎవరంటే... మహిళల సింగిల్స్ గ్రూప్ ‘ఎ’: పీవీ సింధు (భారత్), తై జు యింగ్ (చైనీస్ తైపీ), అకానె యామగుచి (జపాన్), బీవెన్ జాంగ్ (అమెరికా). గ్రూప్ ‘బి’: నొజోమి ఒకుహారా (జపాన్), చెన్ యుఫె (చైనా), ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్), మిచెల్లి లీ (కెనడా). పురుషుల సింగిల్స్ గ్రూప్ ‘ఎ’: చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ), షి యుకి (చైనా), సన్ వాన్ హో (దక్షిణ కొరియా), ఆంథోని సిన్సుక్ గిన్టింగ్ (ఇండోనేసియా). గ్రూప్ ‘బి’: సమీర్ వర్మ (భారత్), కెంటో మొమోటా (జపాన్), కాంతపోన్ వాంగ్‌చరోయెన్ (థాయ్‌లాండ్), టామీ సుగియార్తో (ఇండోనేసియా). ‘ఈసారి సన్నాహానికి కావాల్సినంత సమయం లభించింది. టోర్నీలో నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాననే నమ్మకం ఉంది. బ్యాడ్మింటన్ సర్క్యూట్లో ఇది అతి పెద్ద టోర్నమెంట్.అగ్రశ్రేణి క్రీడాకారిణులు బరిలోకి దిగుతారు. కఠిన పరిస్థితులు ఎదురవనున్నా టైటిల్ సాధించాలనే కృతనిశ్చయంతో ఉన్నాను’ – పీవీ సింధు ►సీజన్ ముగింపు టోర్నీలో ఆడటం సింధుకిది వరుసగా మూడో ఏడాది. 2016లో సెమీస్‌కు చేరిన ఆమె... 2017లో రన్నరప్‌గా నిలిచింది. ►వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో భారత క్రీడాకారులు నెగ్గిన పతకాలు. 2009లో జ్వాల–దిజు ద్వయం మిక్స్డ్ డబుల్స్‌లో రజతం... 2011లో సైనా మహిళల సింగిల్స్‌లో రజతం... 2017లో సింధు రజతం సాధించారు. -
స్విస్ ఓపెన్ విజేత సమీర్ వర్మ
బాసెల్ (స్విట్జర్లాండ్): భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సమీర్ వర్మ స్విస్ ఓపెన్ టైటిల్ చేజిక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన స్విస్ ఓపెన్ సూపర్ 300 టోర్నీ ఫైనల్లో సమీర్ వర్మ 21–15, 21–13తో జాన్ జోర్గెన్సెన్ (డెన్మా ర్క్)పై గెలుపొందాడు. తద్వారా ఈ టోర్నమెంట్ టైటిల్ నెగ్గిన నాలుగో భారత ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో సైనా (2011, 2012), కిడాంబి శ్రీకాంత్ (2015), ప్రణయ్ (2016) ఈ ఘనత సాధించారు. ఈ గెలుపుతో సమీర్‌కు 11,250 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 7 లక్షల 28 వేలు)తోపాటు 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సమీర్ వర్మ సంచలనం
ప్రపంచ ఐదో ర్యాంకర్‌పై గెలుపు ∙ప్రిక్వార్టర్స్‌లో సైనా, సింధు, శ్రీకాంత్ న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత యువ ఆటగాడు సమీర్ వర్మ సంచలనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సమీర్ 21–17, 21–10తో ప్రపంచ ఐదో ర్యాంకర్, నాలుగో సీడ్ సన్ వాన్ హో (దక్షిణ కొరియా)ను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధు శుభారంభం చేశారు. తొలి రౌండ్లో సైనా 21–10, 21–17తో చియా సిన్ లీ (చైనీస్ తైపీ)పై, సింధు 21–17, 21–6తో అరుంధతి పంతవానె (భారత్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. పురుషుల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో కిడాంబి శ్రీకాంత్ 21–19, 21–16తో జావో జున్‌పెంగ్ (చైనా)పై, సాయిప్రణీత్ 16–21, 21–12, 21–19తో కెంటా నిషిమోటో (జపాన్)పై గెలుపొందగా... సౌరభ్ వర్మ 21–13, 21–16తో భారత్‌కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్‌ను ఓడించాడు. మరో మ్యాచ్‌లో అజయ్ జయరామ్ 21–23, 17–21తో విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. -
మెయిన్ ‘డ్రా’పై వర్మ బ్రదర్స్ దృష్టి
బర్మింగ్‌హామ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటేందుకు ‘వర్మ బ్రదర్స్’ సౌరభ్, సమీర్ సిద్ధమయ్యారు. నేడు జరిగే క్వాలిఫయింగ్ ఈవెంట్లో సమీర్ వర్మ, సౌరభ్ వర్మలు మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందడమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. సమీర్ వర్మ జపాన్‌కు చెందిన సకాయ్తో, ఇండోనేసియా ఆటగాడు గింటింగ్‌తో సౌరభ్ ఆడతాడు. సైనా, సింధు, శ్రీకాంత్, జయరామ్, ప్రణయ్ నేరుగా మెయిన్ ‘డ్రా’లో ఆడనున్నారు. -
కెరీర్ ఉత్తమ ర్యాంకుకు సమీర్‌వర్మ
న్యూఢిల్లీ: సమీర్ వర్మ కెరీర్ ఉత్తమ ర్యాంకు (23)ను చేరుకున్నాడు. గత ఏడాది జాతీయ ఛాంపియన్ షిప్ సాధించడంతో పాటు హాంకాంగ్ సూపర్ సిరీస్ ఫైనల్ చేరిన వర్మ గురువారం విడుదల చేసిన బీడబ్ల్యూఎఫ్ ర్యాంకుల జాబితాలో ఏకంగా 11 ర్యాంకులు మెరుగుపరచుకుని 23వ ర్యాంకులో నిలిచాడు. పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి అజయ్ జయరాం అత్యుత్తమంగా 19వ, హెచ్ఎస్ ప్రణయ్ రెండు ర్యాంకులు ఎగబాకి 21వ స్థానంలో ఉన్నారు. మహిళల విభాగంలో సింధు తన ర్యాంక్ (5)ను నిలబెట్టుకోగా, సైనా నెహ్వాల్ ఒక ర్యాంక్ కోల్పోయి పదో స్థానానికి పడిపోయింది. మిక్స్డ్ డబుల్స్‌లో ప్రణవ్ జెర్రీ చోప్రా – సిక్కి రెడ్డి జోడి 13వ స్థానంలో, పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో మను అత్రి – సుమీత్ రెడ్డి జంట 23వ స్థానాల్లో కొనసాగుతున్నారు. -
ఆఖరి పోరులో సాగని జోరు
ఫైనల్లో ఓడిన సింధు, సమీర్ వర్మ రజత పతకాలతో సరి హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ కౌలూన్: రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు వరుసగా రెండో సూపర్ సిరీస్ టైటిల్ గెలిచే అవకాశాన్ని త్రుటిలో కోల్పోరుుంది. హాంకాంగ్ ఓపెన్ టోర్నీ ఆసాంతం చక్కటి ఆటతీరు కనబర్చిన సింధు, ఫైనల్లో పరాజయం పాలైంది. మరోవైపు సంచలన ఆటతో పురుషుల విభాగంలో ఫైనల్‌కు చేరిన భారత ఆటగాడు సమీర్ వర్మ పోరాడి ఓడిపోయాడు. దాదాపు ఏకపక్షంగా సాగిన మహిళల ఫైనల్లో సింధు 15-21, 17-21 స్కోరుతో చిరకాల ప్రత్యర్థి తై జు రుుంగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడింది. పురుషుల ఫైనల్లో లాంగ్ ఆంగస్ (హాంకాంగ్) 21-14, 10-21, 21-11 తేడాతో సమీర్ వర్మపై గెలుపొందాడు. రన్నరప్‌లుగా నిలిచిన సింధు, సమీర్ వర్మలకు 15,200 డాలర్ల (రూ. 10 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీతోపాటు 7,800 ర్యాంకింగ్ పారుుంట్లు లభించారుు. రన్నరప్ సిక్కి రెడ్డి జంట మరోవైపు గ్లాస్గోలో ముగిసిన స్కాటిష్ ఓపెన్గ్రాండ్ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లోనూ భారత్‌కు నిరాశే మిగిలింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా జోడీ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంక్ ద్వయం సిక్కి-ప్రణవ్ 21-13, 18-21, 16-21తో ప్రపంచ 229వ ర్యాంక్ జోడీ గో సూన్ హువాట్-జేమీ లై షెవోన్ (మలేసియా) చేతిలో ఓడిపోరుుంది. నిర్ణాయక మూడో గేమ్‌లో సిక్కి-ప్రణవ్ 16-12తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ వరుసగా 9 పారుుంట్లు కోల్పోరుు ఓటమిని మూటగట్టుకోవడం గమనార్హం. నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా. నేను మెరుగ్గానే ఆడినా ప్రత్యర్థి నెట్ వద్ద చాలా చక్కటి ఆటతీరు కనబర్చింది. ఆమె ఎలాంటి తప్పులూ చేయలేదు. గతంలోనూ తై జుతో ఆడాను. ఆమె బలాల గురించి తెలిసే సన్నద్ధమయ్యా. అరుుతే ఆటలో ఓటమి సహజం. గత వారం చైనా ఓపెన్ గెలుపు కారణంగా నేను ఈ మ్యాచ్‌కు ముందు ఆత్మవిశ్వాసంతో ఉన్నా. ఈ రోజు ఆమెది. తిరిగి వెళ్లాక మరింతగా సాధన చేస్తా. వరుసగా రెండు టోర్నీల్లో నా ఆట సంతోషాన్ని కలిగించింది. - పీవీ సింధు -
రన్నరప్‌గానే సరిపెట్టుకున్నాడు..
-
రన్నరప్‌గానే సరిపెట్టుకున్నాడు..
కౌలూన్: తన కెరీర్లో తొలిసారి సూపర్ సిరీస్ టైటిల్ సాధించాలనుకున్న భారత బ్యాడ్మింటన్ ఆటగాడు సమీర్ వర్మకు నిరాశ ఎదురైంది. హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ తుది పోరులో సమీర్ వర్మ 14-21, 21-10, 11-21 తేడాతో ఎన్జీ కా లాంగ్(హాంకాంగ్)చేతిలో ఓటమి పాలయ్యాడు. తొలి గేమ్‌ను కోల్పోయిన సమీర్.. ఆ తరువాత రెండో గేమ్‌ను సునాయాసంగా గెలిచాడు. కాగా, నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సమీర్ మరోసారి తడబడ్డాడు. ప్రత్యర్థి లాంగ్‌కు ఎత్తులకు తలవంచిన సమీర్ ఆ గేమ్‌ను చేజార్చుకున్నాడు. మూడో గేమ్‌లో కనీసం పోరాడకుండానే సమీర్ చేతులెత్తేశాడు. దాంతో రన్నరప్‌గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంతకుముందు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో పివి సింధు ఓటమి పాలైన సంగతి తెలిసిందే. -
మన రాకెట్ ‘సూపర్’
హాంకాంగ్ ఓపెన్ ఫైనల్స్‌లో సింధు, సమీర్ వర్మ సెమీస్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ను ఓడించిన సమీర్ అలవోకగా గెలిచిన సింధు గతవారం కెరీర్లో తొలి సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గి జోరుమీదున్న పీవీ సింధు స్థారుుకి తగ్గట్టు రాణించగా... ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత యువ బ్యాడ్మింటన్ స్టార్ సమీర్ వర్మ పెను సంచలనమే సృష్టించాడు. ఫలితంగా హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో మహిళల, పురుషుల సింగిల్స్ టైటిల్స్‌పై భారత క్రీడాకారులు గురి పెట్టారు. కౌలూన్ (హాంకాంగ్): చివరి నిమిషంలో మెరుున్ ‘డ్రా’లో ఉన్న ఆటగాళ్లు వైదొలగడంతో... క్వాలిఫరుుంగ్ నుంచి నేరుగా మెరుున్ ‘డ్రా’లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్న భారత యువ ఆటగాడు సమీర్ వర్మ దీనిని సద్వినియోగం చేసుకున్నాడు. అద్వితీయ ఆటతీరుతో తన కెరీర్లో తొలిసారి ఓ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో ఫైనల్‌కు చేరుకున్నాడు. మరోవైపు పీవీ సింధు కూడా తన జోరును కొనసాగించింది. మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరింది. ఫలితంగా బ్యాడ్మింటన్ సీజన్‌లోని చివరి సూపర్ సిరీస్ టోర్నీ హాంకాంగ్ ఓపెన్‌లో మనోళ్లు ‘డబుల్ ధమాకా’కు సిద్ధమయ్యారు. జార్గెన్‌సన్‌కు షాక్: జాతీయ చాంపియన్, మధ్యప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల సమీర్ వర్మ తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని నమోదు చేశాడు. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 43వ ర్యాంకర్ సమీర్ 21-19, 24-22తో ప్రపంచ మూడో ర్యాంకర్ జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్)ను బోల్తా కొట్టించాడు. 46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సమీర్ ఆటతీరు అబ్బురపరిచింది. గతవారం చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టైటిల్ నెగ్గిన జార్గెన్‌సన్‌కు సమీర్ ఊహించని ప్రతిఘటన ఇచ్చాడు. ప్రతి అంశంలోనూ జార్గెన్సన్కంటే మెరుగ్గా రాణించిన సమీర్ తొలి గేమ్‌లో 12-7తో ఆధిక్యంలోకి వెళ్లాడు. జార్గెన్‌సన్ తేరుకున్నా కీలకదశలో సమీర్ పారుుంట్లు సాధించాడు. స్కోరు 20-19 వద్ద ఉన్నప్పుడు జార్గెన్‌సన్ కొట్టిన షాట్ అవుట్ కావడంతో సమీర్ తొలి గేమ్ వశమైంది. రెండో గేమ్ ఆరంభంలో సమీర్ 1-7, 5-11తో వెనుకబడ్డాడు. కానీ పట్టువదలకుండా పోరాడిన సమీర్ రెండుసార్లు నాలుగు పారుుంట్ల చొప్పున సాధించి కోలుకున్నాడు. ఒకదశలో 17-20తో మూడు గేమ్ పారుుంట్లు కాచుకున్న సమీర్ వరుసగా నాలుగు పారుుంట్లు గెలిచి 21-20తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత స్కోరు 22-22తో సమమైనా... సమీర్ వరుసగా రెండు పారుుంట్లు నెగ్గి సూపర్ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్ ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో సమీర్ ఆడతాడు. ముఖాముఖి రికార్డులో సమీర్ 2-0తో ఆధిక్యంలో ఉన్నాడు. ఎదురులేని సింధు: మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సింధు 21-14, 21-16తో ప్రపంచ 23వ ర్యాంకర్ రుు ఎన్గాన్ చెయుంగ్ (హాంకాంగ్)ను ఓడించింది. 46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు నిలకడగా ఆడి ఏదశలోనూ చెయుంగ్కు తేరుకునే అవకాశం ఇవ్వలేదు. తొలి గేమ్ పోటాపోటీగా సాగినా స్కోరు 16-14 వద్ద సింధు వరుసగా ఐదు పారుుంట్లు గెలిచి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో ఇద్దరి స్కోర్లు మూడుసార్లు సమమైనా కీలకదశలో సింధు విజృంభించి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ తై జు రుుంగ్ (చైనీస్ తైపీ)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 3-4తో వెనుకంజలో ఉంది. సెమీస్‌లో తై జు రుుంగ్ 21-17, 14-21, 21-16తో ప్రపంచ నంబర్‌వన్ కరోలినా మారిన్ (స్పెరుున్)ను ఓడించింది. ఫైనల్లో సిక్కి రెడ్డి జంట గ్లాస్గోలో జరుగుతున్న స్కాటిష్ ఓపెన్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా (భారత్) జంట మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో టాప్ సీడ్ సిక్కి-ప్రణవ్ ద్వయం 21-18, 23-21తో క్రిస్టియాన్సెన్ మథియాస్-సారా థిగెసెన్ (డెన్మార్క్) జోడీపై విజయం సాధించింది. ► 3 ఒకే సూపర్ సిరీస్ టోర్నీలో పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో భారత క్రీడాకారులు ఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి. 2014 చైనా ఓపెన్, 2015 ఇండియా ఓపెన్‌లో సైనా, శ్రీకాంత్ ఫైనల్‌కు చేరడంతోపాటు టైటిల్స్ సాధించారు. ► 2 ప్రకాశ్ పదుకొనె, సైనా నెహ్వాల్ తర్వాత హాంకాంగ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన భారత క్రీడాకారులుగా సమీర్, సింధు గుర్తింపు పొందారు. 1982లో ప్రకాశ్, 2010లో సైనా ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు విజేతగా కూడా నిలిచారు. -
హాంకాంగ్ ఓపెన్ ఫైనల్లో సమీర్ వర్మ
కౌలూన్: హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ పురుషుల విభాగంలో భారత ఆటగాడు సమీర్ వర్మ ఫైనల్లోకి ప్రవేశించాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో వరల్డ్ నెంబర్ 3 ఆటగాడు జొర్గెన్సెన్పై సమీర్ సంచలన విజయం నమోదు చేశాడు. ఫైనల్లో ఆంగస్ లాంగ్‌తో సమీర్ వర్మ తలపడనున్నాడు. గతవారం చైనా ప్రీమియర్ సూపర్ సిరీస్ గెలుచుకొని మంచి ఫాంలో ఉన్న జోర్గెన్సెన్పై హోరాహోరి పోరులో తొలి గేమ్‌ను 21-19 పాయింట్లతో గెలుచుకున్న సమీర్.. రెండో గేమ్‌ను 24-22 పాయింట్ల తేడాతో గెలుచుకొని వరుస సెట్లలో విజయం సాధించాడు. -
వర్మ బ్రదర్స్ అదుర్స్
సెమీస్‌లో సౌరభ్, సమీర్ సార్‌బ్రకెన్ (జర్మనీ): బిట్‌బర్గర్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సౌరభ్ వర్మ, సమీర్ వర్మ సోదరులు సెమీఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్ సౌరభ్... మూడో సీడ్, ప్రపంచ 13వ ర్యాంకర్ మార్క్ జ్వెబ్లెర్ (జర్మనీ)కు షాకిచ్చాడు. 51 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో అతను 21-15, 16-21, 21-15తో జ్వెబ్లర్ను కంగుతినిపించాడు. మరో క్వార్టర్స్‌లో 12వ సీడ్ సమీర్ 21-14, 21-16తో అర్టెమ్ పొచ్తరోవ్ (ఉక్రెరుున్)పై అలవోక విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సమీర్ 21-17, 21-17తో కీరన్ మెరిలిస్ (స్కాట్లాండ్)పై గెలుపొందగా, సౌరభ్ వర్మ 21-11, 22-20తో ఆరో సీడ్ మౌలానా ఇహ్సాన్ (ఇండోనేసియా)కు షాకిచ్చాడు. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రజక్తా సావంత్-యోగేంద్రన్ కృష్ణన్ జంట 15-21, 11-21తో నాలుగో సీడ్ కియాన్ మెంగ్ తన్- పి జింగ్ లై (మలేసియా) జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. -
డబుల్స్ ఫైనల్లో సిక్కి రెడ్డి
చండీగఢ్: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సింగిల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారులకు నిరాశ ఎదురైంది. డబుల్స్‌లో మాత్రం సిక్కి రెడ్డి మహిళల, మిక్స్డ్ విభాగాలలో ఫైనల్‌కు అర్హత సాధించింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ రుత్విక శివాని 21-10, 18-21, 18-21తో పి.సి.తులసీ (కేరళ) చేతిలో ఓడిపోగా... పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో గురుసాయిదత్ 21-15, 12-21, 14-21తో సమీర్ వర్మ (మధ్యప్రదేశ్) చేతిలో పరాజయం పాలయ్యాడు. మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె ద్వయం 21-17, 17-21, 22-20తో మేఘన-మనీషా (తెలంగాణ) జోడీపై గెలుపొందగా... మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా జంట 21-9, 21-14తో నందగోపాల్-మేఘన జోడీని ఓడించింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్ సాయిరాజ్-కృష్ణ ప్రసాద్ ద్వయం 19-21, 20-22తో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దేవాల్కర్ జంట చేతిలో ఓడిపోయింది. -
క్వార్టర్స్‌లో సింధు
ప్రణీత్, సమీర్‌కు చుక్కెదురు స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ బాసెల్: భారత బ్యాడ్మింటన్ స్టార్ షట్లర్ పి.వి.సింధు.. స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నమెంట్లో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆరోసీడ్ సింధు 21-16, 21-16తో యు పో పాయ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. 36 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో... హైదరాబాదీ స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలి గేమ్ ఆరంభంలో పాయ్ మెరుగ్గా ఆడింది. అయితే స్కోరు 7-7తో సమమైన తర్వాత సింధు ఇక వెనుదిరిగి చూడలేదు. ప్రత్యర్థికి పెద్దగా అవకాశం ఇవ్వకుండా ఒకటి, రెండు పాయింట్లతో ఆధిక్యాన్ని చూపెట్టింది. చివరకు 18-16 ఉన్న దశలో వరుసగా మూడు పాయింట్లు నెగ్గి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో ఇద్దరు క్రీడాకారిణిలు పాయింట్ల కోసం హోరాహోరీగా తలపడ్డారు. 8-7 ఆధిక్యంలో ఉన్న దశలో సింధు ఆరు పాయింట్లు నెగ్గితే.. ఆ వెంటనే యు పో ఏడు పాయింట్లు సాధించింది. స్కోరు 15-15తో సమమైన తర్వాత యు పో ఒక్క పాయింట్‌కు పరిమితంకాగా, ఆరు పాయింట్లు సాధించి గేమ్, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సాయి ప్రణీత్ 19-21, 6-21తో రెండోసీడ్ చో టియాన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో; సమీర్ వర్మ 15-21, 19-21తో తనోంగ్‌సాక్ సెన్సోమ్బున్సుక్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం చవిచూశారు.