కౌలూన్: హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ పురుషుల విభాగంలో భారత ఆటగాడు సమీర్ వర్మ ఫైనల్లోకి ప్రవేశించాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో వరల్డ్ నెంబర్ 3 ఆటగాడు జొర్గెన్‌సెన్‌పై సమీర్ సంచలన విజయం నమోదు చేశాడు. ఫైనల్లో ఆంగస్ లాంగ్‌తో సమీర్ వర్మ తలపడనున్నాడు.
గతవారం చైనా ప్రీమియర్ సూపర్ సిరీస్ గెలుచుకొని మంచి ఫాంలో ఉన్న జోర్గెన్‌సెన్‌పై హోరాహోరి పోరులో తొలి గేమ్‌ను 21-19 పాయింట్లతో గెలుచుకున్న సమీర్.. రెండో గేమ్ను 24-22 పాయింట్ల తేడాతో గెలుచుకొని వరుస సెట్లలో విజయం సాధించాడు.
హాంకాంగ్ ఓపెన్ ఫైనల్లో సమీర్ వర్మ
Published Sat, Nov 26 2016 6:29 PM | Last Updated on Sun, Sep 2 2018 3:19 PM
Advertisement
Advertisement