కౌలూన్: హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్‌లో గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 54 నిమిషాల్లో 21–15, 16–21, 21–16తో జిలీ డెబోరా–చెరిల్ సీనెన్ (నెదర్లాండ్స్) జంటపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ అప్రియాని రహాయు–సితీ ఫాదియా సిల్వా (ఇండోనేసియా)లతో గాయత్రి–ట్రెసా తలపడతారు. మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ నుంచి మాళవిక బన్సోద్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందగా... పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ నుంచి కిరణ్ జార్జి, రవి చివరి రౌండ్ మ్యాచ్‌ల్లో ఓడిపోయి మెయిన్ ‘డ్రా’కు చేరుకోలేకపోయారు. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో సుమీత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం మెయిన్ ‘డ్రా’కు చేరింది.
క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో సుమీత్–అశ్విని జోడీ 21–15, 21–14తో అలి్వన్ మొరాదా–అలీసా (చెక్ రిపబ్లిక్) జంటను ఓడించింది. మహిళల డబుల్స్ క్వాలిఫయింగ్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీ 21–16, 21–14తో సిక్కి రెడ్డి–ఆరతి జంటపై గెలిచి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment