![Sikki Reddy Sumeet Reddy Jodi is off to a good start](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/09/12/sumith%20reddy.jpg.webp?itok=6xFxc24w)
హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జోడీ శుభారంభం చేసింది. హాంకాంగ్‌లోని కౌలూన్ పట్టణంలో జరుగుతున్న ఈ టోరీ్నలో బుధవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో తెలంగాణకు చెందిన సిక్కి–సుమీత్ ద్వయం 21–9, 21–10తో భారత్ తరఫున బరిలోకి దిగిన తెలంగాణ జోడీ కోనా తరుణ్–శ్రీకృష్ణప్రియపై గెలిచింది.
నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో గో సూన్ హువాట్–లాయ్ షెవోన్ జేమీ (మలేసియా)లతో సిక్కి–సుమీత్ తలపడతారు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో అశిత్ సూర్య–అమృత (భారత్) జంట 16–21, 20–22తో మింగ్ చె లు–హుంగ్ ఎన్ జు (చైనీస్ తైపీ) ద్వయం చేతిలో ఓడిపోయింది.
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రియాన్షు రజావత్ (భారత్) 9–21, 21–16, 9–21తో టకుమా ఉబయాషి (జపాన్) చేతిలో... కిరణ్ జార్జి (భారత్) 16–21, 16–21తో సులి యాంగ్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో తాన్యా హేమంత్ (భారత్) 16–21, 21–23తో కొమాంగ్ అయు కాయదేవి (ఇండోనేసియా) చేతిలో... ఆకర్షి కశ్యప్ (భారత్) 15–21, 9–21తో అయా ఒహోరి (జపాన్) చేతిలో ఓటమి చవిచూశారు.
Comments
Please login to add a commentAdd a comment