Sumeet Reddy
-
ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి జోడీ
హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జోడీ శుభారంభం చేసింది. హాంకాంగ్‌లోని కౌలూన్ పట్టణంలో జరుగుతున్న ఈ టోరీ్నలో బుధవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో తెలంగాణకు చెందిన సిక్కి–సుమీత్ ద్వయం 21–9, 21–10తో భారత్ తరఫున బరిలోకి దిగిన తెలంగాణ జోడీ కోనా తరుణ్–శ్రీకృష్ణప్రియపై గెలిచింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో గో సూన్ హువాట్–లాయ్ షెవోన్ జేమీ (మలేసియా)లతో సిక్కి–సుమీత్ తలపడతారు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో అశిత్ సూర్య–అమృత (భారత్) జంట 16–21, 20–22తో మింగ్ చె లు–హుంగ్ ఎన్ జు (చైనీస్ తైపీ) ద్వయం చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రియాన్షు రజావత్ (భారత్) 9–21, 21–16, 9–21తో టకుమా ఉబయాషి (జపాన్) చేతిలో... కిరణ్ జార్జి (భారత్) 16–21, 16–21తో సులి యాంగ్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో తాన్యా హేమంత్ (భారత్) 16–21, 21–23తో కొమాంగ్ అయు కాయదేవి (ఇండోనేసియా) చేతిలో... ఆకర్షి కశ్యప్ (భారత్) 15–21, 9–21తో అయా ఒహోరి (జపాన్) చేతిలో ఓటమి చవిచూశారు. -
డబుల్స్ సెమీస్‌లో సుమీత్ రెడ్డి జంట ఓటమి
ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్ విభాగంలో బరిలో ఉన్న తెలంగాణ క్రీడాకారుడు సుమీత్ రెడ్డి తన భాగస్వామి మను అత్రితో కలిసి సెమీస్‌లో ఓడిపోయాడు. శనివారం సిడ్నీలో జరిగిన సెమీఫైనల్లో సుమీత్–మను ద్వయం 17–21, 15–21తో బెర్రీ అంగ్రియవాన్–హర్దియాంతో (ఇండోనేసియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. సెమీస్‌లో ఓడిన సుమీత్ జంటకు 2,100 డాలర్ల (రూ. లక్షా 41 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో సుమీత్–అశ్విని జంట
సింగపూర్ సిటీ: సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సుమీత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప ద్వయం శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్–అశ్విని జంట 21–13, 21–14తో జూహీ దేవాంగన్–వెంకట్ గౌరవ్ ప్రసాద్ (భారత్) జోడీపై విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్‌లోనే హైదరాబాద్‌కు చెందిన రంకీరెడ్డి సాత్విక్ సాయిరాజ్–మనీషా జంట మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందింది. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో సాత్విక్–మనీషా జోడీ 21–9, 21–12తో ఆండ్రూ యునాంతో–సుప్రియాది పుత్రి (ఇండోనేసియా) ద్వయంపై నెగ్గగా... రెండో రౌండ్లో 21–18, 14–21, 21–11తో నందగోపాల్–మహిమా (భారత్) జంటను ఓడించింది. మెయిన్ ‘డ్రా’కు సౌరభ్ వర్మ మరోవైపు జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో సౌరభ్ వర్మ 21–13, 23–21తో మిషా జిల్బెర్మన్ (ఇజ్రాయెల్)పై, రెండో రౌండ్లో 27–29, 21–18, 21–18తో పనావిత్ తోంగ్‌నువామ్ (థాయ్‌లాండ్)పై గెలిచాడు. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఒకుహారా (జపాన్)తో పీవీ సింధు; సు యా చింగ్ (చైనీస్ తైపీ)తో రితూపర్ణ దాస్... పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఎమిల్ (డెన్మార్క్)తో సాయిప్రణీత్; హు యున్ (హాంకాంగ్)తో సమీర్; జిన్‌టింగ్ (ఇండోనేసియా)తో సౌరభ్; షి యుచి (చైనా)తో జయరామ్; నిషిమోటో (జపాన్)తో శ్రీకాంత్ ఆడతారు. -
సుమీత్ జంట సంచలనం
ప్రపంచ ఏడో ర్యాంక్ జోడీపై గెలుపు తొలి రౌండ్లోనే కశ్యప్ ఓటమి ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ బర్మింగ్హమ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్‌కు చెందిన సుమీత్ రెడ్డి తన భాగస్వామి మనూ అత్రితో కలిసి కెరీర్లోనే గొప్ప విజయాన్ని సాధించాడు. తొలి రౌండ్లో సుమీత్-మనూ అత్రి ద్వయం 9-21, 21-17, 21-17తో ప్రపంచ 7వ ర్యాంక్ జంట చాయ్ బియావో-మా జిన్ (చైనా) ను బోల్తా కొట్టించింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) జోడీ 21-12, 20-22, 21-14తో అమిలియా-ఫీ చో సూంగ్ (మలేసియా) ద్వయంపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్ తొలి రౌండ్లో 13-21, 12-21తో చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మూడో సీడ్ సైనా నెహ్వాల్ 21-8, 21-12తో బెలాట్రిక్స్ మనుపుట్టి (ఇండోనేసియా)పై గెలిచింది. -
ప్రతీక్, సమిత్ మెరుపు శతకాలు
జింఖానా, న్యూస్‌లైన్: శ్రీచైతన్య టెక్నో స్కూల్ బ్యాట్స్‌మన్ సమిత్ రెడ్డి (94 బంతుల్లో 168), ప్రతీక్ రెడ్డి (80 బంతుల్లో 106) మెరుపు సెంచరీలతో చెలరేగారు. దీంతో హెచ్‌సీఏ బ్రదర్ జాన్ ఆఫ్ గాడ్ అండర్-14 నాకౌట్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీచైతన్య జట్టు 311 పరుగుల భారీ తేడాతో సెయింట్ జోసెఫ్ గ్రామర్ హైస్కూల్‌పై ఘన విజయం సాధించింది. మొదట బరిలోకి దిగిన శ్రీచైతన్య 5 వికెట్లు కోల్పోయి 453 పరుగుల భారీ స్కోరు చేసింది. సాయి ప్రజ్ఙయ్ రెడ్డి (50) అర్ధ సెంచరీతో రాణించగా, ఆశిష్ (36), సిద్ధార్థ్ (33 నాటౌట్) మెరుగ్గా ఆడారు. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యఛేదనకు దిగిన సెయింట్ జోసెఫ్ జట్టు 142 పరుగులకే కుప్పకూలింది. సాయి రాజ్ (41) మినహా తక్కిన వారు రాణించలేకపోయారు. శ్రీచైతన్య బౌలర్లు కార్తీక్ రెడ్డి, సమిత్ రెడ్డి చెరో రెండు వికెట్లు చేజిక్కించుకున్నారు. మరో మ్యాచ్‌లో సెయింట్ ఫ్రాన్సిస్ కాన్వెంట్ హైస్కూల్ 8 వికెట్ల తేడాతో సమరిటన్స్ హైస్కూల్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సమరిటన్స్ 187 పరుగులు చేసింది. దీపాంకర్ (57) అర్ధ సెంచరీ చేశాడు. సెయింట్ ఫ్రాన్సిస్ బౌలర్ ప్రీతమ్ రాజ్ 4 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత బరిలోకి దిగిన సెయింట్ ఫ్రాన్సిస్ రెండే వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. హర్షవర్ధన్ (95 నాటౌట్), జార్జ్ (56 నాటౌట్) అర్ధ సెంచరీలతో అజేయంగా నిలిచారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఠ సెయింట్ మార్క్స్ ప్రోగ్రెసివ్ హైస్కూల్: 228 (సాయి చరణ్ 60, మానస్ 69; తిలక్ 3/36); క్రిసెంట్ మోడల్ ఇంగ్లీష్ స్కూల్: 158 (తిలక్ 53, రాఖ 31) ఠ నిజామాబాద్ డిస్ట్రిక్ట్: 239/5 (సిద్ధు 43, అనికేత్ 47, శ్రవణ్ 48); జూబ్లీహిల్స్ హైస్కూల్: 69 (శ్రవణ్ 5/9) ఠ జాన్సన్ గ్రామర్ హైస్కూల్: 133 (రిత్విక్ కుమార్ 3/22, మహ్మద్ షోయబ్ 3/22); డాన్ బాస్కో హైస్కూల్: 134/9 (లలిత్ ఆదిత్య 3/35) ఠ చిరెక్ పబ్లిక్ స్కూల్: 189 (వంశీ 72, అభిషేక్ ఆశిష్ 58 నాటౌట్; రాకేష్ కుమార్ 5/44); కేంద్రీయ విద్యాలయ: 190/4 (ప్రీతమ్ 67, అనుజ్ 39) ఠ ఢిల్లీ పబ్లిక్ స్కూల్: 180 (మనో సాత్విక్ 47); న్యూ రాయల్ హైస్కూల్: 184/5 (లియాఖత్ 31, రిత్విక్ 30).