సుమీత్ జంట సంచలనం | sumeet reddy team Whopper | Sakshi
Sakshi News home page

సుమీత్ జంట సంచలనం

Published Thu, Mar 5 2015 12:50 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

సుమీత్ జంట సంచలనం - Sakshi

సుమీత్ జంట సంచలనం

ప్రపంచ ఏడో ర్యాంక్ జోడీపై గెలుపు
 తొలి రౌండ్‌లోనే కశ్యప్ ఓటమి
 ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ

 
 బర్మింగ్‌హమ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్‌కు చెందిన సుమీత్ రెడ్డి తన భాగస్వామి మనూ అత్రితో కలిసి కెరీర్‌లోనే గొప్ప విజయాన్ని సాధించాడు. తొలి రౌండ్‌లో సుమీత్-మనూ అత్రి ద్వయం 9-21, 21-17, 21-17తో ప్రపంచ 7వ ర్యాంక్ జంట చాయ్ బియావో-మా జిన్ (చైనా) ను బోల్తా కొట్టించింది.
 
  మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) జోడీ 21-12, 20-22, 21-14తో అమిలియా-ఫీ చో సూంగ్ (మలేసియా) ద్వయంపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్  తొలి రౌండ్‌లో 13-21, 12-21తో చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో మూడో సీడ్ సైనా నెహ్వాల్ 21-8, 21-12తో బెలాట్రిక్స్ మనుపుట్టి (ఇండోనేసియా)పై గెలిచింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement