సాక్షి, హైదరాబాద్: ఇంగ్లండ్ కౌంటీల్లో మైనర్ లీగ్‌లు ఆడుతున్న హైదరాబాద్ క్రికెటర్ హనుమ విహారి శనివారం జరిగిన మ్యాచ్‌లో సత్తా చాటాడు. తన సహజ శైలికి విరుద్ధంగా దూకుడు ప్రదర్శించిన అతను వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ నమోదు చేశాడు.
హటన్ క్రికెట్ క్లబ్ తరఫున ఆడుతున్న విహారి, ఆర్డిలెగ్ గ్రీన్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 138 బంతుల్లో 24 ఫోర్లు, 4 సిక్స్‌లతో 200 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. విహారి జోరుతో హటన్ జట్టు 44 ఓవర్లలో 5 వికెట్లకు 316 పరుగులు చేసింది. ప్రత్యర్థిని 182 పరుగులకే ఆలౌట్ చేసి 134 పరుగుల తేడాతో విజయం సాధించింది. విహారి 2 వికెట్లు కూడా పడగొట్టాడు.
విహారి 200 నాటౌట్
Published Mon, May 19 2014 12:10 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement