
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీఏ రెండు రోజుల లీగ్‌లో సత్తా చాటిన డానియల్ క్రికెట్ అకాడమీ ఆటగాళ్లు ప్రత్యేక శిక్షణ కోసం ఇంగ్లండ్ వెళ్లనున్నారు. లీసెస్టర్‌షైర్‌లో నిర్వహించనున్న అంతర్జాతీయ రెసిడెన్షియల్ క్యాంప్ కోసం అకాడమీకి చెందిన ఆరుగురు క్రీడాకారులు పి. గోవింద్ కౌస్తమ్ రావు, డి. శ్రీ చరణ్ వర్మ, సి. అభిషేక్, వి. శశి శేఖర్ నాయుడు, కె. శ్రీవెన్ సచిత్, టీఎన్‌ఆర్ మోహిత్ ఇంగ్లండ్ బయలుదేరనున్నారు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ద్వారా నియమితులైన శిక్షకుల పర్యవేక్షణలో వీరికి ఆధునిక పద్ధతుల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment