కెరీర్‌ ఉత్తమ ర్యాంకుకు సమీర్‌వర్మ | Sameer Verma reaches career-best World No 23rd ranking | Sakshi
Sakshi News home page

కెరీర్‌ ఉత్తమ ర్యాంకుకు సమీర్‌వర్మ

Published Fri, Feb 24 2017 12:44 AM | Last Updated on Sun, Sep 2 2018 3:19 PM

Sameer Verma reaches career-best World No 23rd ranking

న్యూఢిల్లీ: సమీర్‌ వర్మ  కెరీర్‌ ఉత్తమ ర్యాంకు (23)ను చేరుకున్నాడు. గత ఏడాది జాతీయ ఛాంపియన్ షిప్‌ సాధించడంతో పాటు హాంకాంగ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్‌ చేరిన వర్మ గురువారం విడుదల చేసిన బీడబ్ల్యూఎఫ్‌ ర్యాంకుల జాబితాలో ఏకంగా 11 ర్యాంకులు మెరుగుపరచుకుని 23వ ర్యాంకులో నిలిచాడు.

పురుషుల సింగిల్స్‌లో భారత్‌ నుంచి అజయ్‌ జయరాం అత్యుత్తమంగా 19వ, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ రెండు ర్యాంకులు ఎగబాకి 21వ స్థానంలో ఉన్నారు. మహిళల విభాగంలో సింధు తన ర్యాంక్‌ (5)ను నిలబెట్టుకోగా, సైనా నెహ్వాల్‌ ఒక ర్యాంక్‌ కోల్పోయి పదో స్థానానికి పడిపోయింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ప్రణవ్‌ జెర్రీ చోప్రా – సిక్కి రెడ్డి జోడి 13వ స్థానంలో, పురుషుల డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో మను అత్రి – సుమీత్‌ రెడ్డి జంట 23వ స్థానాల్లో కొనసాగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement