
బాసెల్,(స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, శుభాంకర్ డే రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో కశ్యప్ 21–19, 21–17తో ఫెలిక్స్ బ్యూరెస్‌డెట్ (స్వీడన్)పై, శుభాంకర్ 21–19, 21–17తో లుకాస్ క్లియర్‌బౌట్ (ఫ్రాన్స్)పై గెలిచారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో జక్కా వైష్ణవి రెడ్డి 12–21, 23–21, 17–21తో క్రిస్టిన్ కుబా (ఎస్తొనియా) చేతిలో, గుమ్మడి వృశాలి 14–21, 11–21తో మిచెల్లి లీ (కెనడా) చేతిలో ఓడిపోయారు.
క్వాలిఫయర్ రియా ముఖర్జీ (భారత్) 21–23, 21–15, 21–8తో లిండా జెట్‌చిరి (బల్గేరియా)పై విజయం సాధించింది. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా ద్వయం 21–15, 21–17తో రాల్ఫీ జాన్సెన్–కిలాసు (జర్మనీ) జోడీపై నెగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment