మన రాకెట్ ‘సూపర్’ | sindhu finals of the Hong Kong Open, Sameer Verma | Sakshi
Sakshi News home page

మన రాకెట్ ‘సూపర్’

Published Sat, Nov 26 2016 11:45 PM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM

మన రాకెట్ ‘సూపర్’

మన రాకెట్ ‘సూపర్’

హాంకాంగ్ ఓపెన్ ఫైనల్స్‌లో సింధు, సమీర్ వర్మ
సెమీస్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ను ఓడించిన సమీర్

అలవోకగా గెలిచిన సింధు 

గతవారం కెరీర్‌లో తొలి సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గి జోరుమీదున్న పీవీ సింధు స్థారుుకి తగ్గట్టు రాణించగా... ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత యువ బ్యాడ్మింటన్ స్టార్ సమీర్ వర్మ పెను సంచలనమే సృష్టించాడు. ఫలితంగా హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో మహిళల, పురుషుల సింగిల్స్ టైటిల్స్‌పై భారత క్రీడాకారులు గురి పెట్టారు.  

కౌలూన్ (హాంకాంగ్): చివరి నిమిషంలో మెరుున్ ‘డ్రా’లో ఉన్న ఆటగాళ్లు వైదొలగడంతో... క్వాలిఫరుుంగ్ నుంచి నేరుగా మెరుున్ ‘డ్రా’లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్న భారత యువ ఆటగాడు సమీర్ వర్మ దీనిని సద్వినియోగం చేసుకున్నాడు. అద్వితీయ ఆటతీరుతో తన కెరీర్‌లో తొలిసారి ఓ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకున్నాడు. మరోవైపు పీవీ సింధు కూడా తన జోరును కొనసాగించింది. మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరింది. ఫలితంగా బ్యాడ్మింటన్ సీజన్‌లోని చివరి సూపర్ సిరీస్ టోర్నీ హాంకాంగ్ ఓపెన్‌లో మనోళ్లు ‘డబుల్ ధమాకా’కు సిద్ధమయ్యారు.

జార్గెన్‌సన్‌కు షాక్: జాతీయ చాంపియన్, మధ్యప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల సమీర్ వర్మ తన కెరీర్‌లోనే గొప్ప విజయాన్ని నమోదు చేశాడు. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 43వ ర్యాంకర్ సమీర్ 21-19, 24-22తో ప్రపంచ మూడో ర్యాంకర్ జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్)ను బోల్తా కొట్టించాడు. 46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సమీర్ ఆటతీరు అబ్బురపరిచింది. గతవారం చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టైటిల్ నెగ్గిన జార్గెన్‌సన్‌కు సమీర్ ఊహించని ప్రతిఘటన ఇచ్చాడు. ప్రతి అంశంలోనూ జార్గెన్‌సన్‌కంటే మెరుగ్గా రాణించిన సమీర్ తొలి గేమ్‌లో 12-7తో ఆధిక్యంలోకి వెళ్లాడు. జార్గెన్‌సన్ తేరుకున్నా కీలకదశలో సమీర్ పారుుంట్లు సాధించాడు. స్కోరు 20-19 వద్ద ఉన్నప్పుడు జార్గెన్‌సన్ కొట్టిన షాట్ అవుట్ కావడంతో సమీర్ తొలి గేమ్ వశమైంది. రెండో గేమ్ ఆరంభంలో సమీర్ 1-7, 5-11తో వెనుకబడ్డాడు. కానీ పట్టువదలకుండా పోరాడిన సమీర్ రెండుసార్లు నాలుగు పారుుంట్ల చొప్పున సాధించి కోలుకున్నాడు. ఒకదశలో 17-20తో మూడు గేమ్ పారుుంట్లు కాచుకున్న సమీర్ వరుసగా నాలుగు పారుుంట్లు గెలిచి 21-20తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత స్కోరు 22-22తో సమమైనా... సమీర్ వరుసగా రెండు పారుుంట్లు నెగ్గి సూపర్ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్ ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో సమీర్ ఆడతాడు. ముఖాముఖి రికార్డులో సమీర్ 2-0తో ఆధిక్యంలో ఉన్నాడు.

ఎదురులేని సింధు: మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సింధు 21-14, 21-16తో ప్రపంచ 23వ ర్యాంకర్ రుు ఎన్గాన్ చెయుంగ్ (హాంకాంగ్)ను ఓడించింది. 46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు నిలకడగా ఆడి ఏదశలోనూ చెయుంగ్‌కు తేరుకునే అవకాశం ఇవ్వలేదు. తొలి గేమ్ పోటాపోటీగా సాగినా స్కోరు 16-14 వద్ద సింధు వరుసగా ఐదు పారుుంట్లు గెలిచి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో ఇద్దరి స్కోర్లు మూడుసార్లు సమమైనా కీలకదశలో సింధు విజృంభించి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ తై జు రుుంగ్ (చైనీస్ తైపీ)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 3-4తో వెనుకంజలో ఉంది. సెమీస్‌లో తై జు రుుంగ్ 21-17, 14-21, 21-16తో ప్రపంచ నంబర్‌వన్ కరోలినా మారిన్ (స్పెరుున్)ను ఓడించింది.

ఫైనల్లో సిక్కి రెడ్డి జంట గ్లాస్గోలో జరుగుతున్న స్కాటిష్
ఓపెన్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా (భారత్) జంట మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో టాప్ సీడ్ సిక్కి-ప్రణవ్ ద్వయం 21-18, 23-21తో క్రిస్టియాన్‌సెన్ మథియాస్-సారా థిగెసెన్ (డెన్మార్క్) జోడీపై విజయం సాధించింది. 

3   ఒకే సూపర్ సిరీస్  టోర్నీలో పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో భారత క్రీడాకారులు ఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి. 2014 చైనా ఓపెన్, 2015 ఇండియా ఓపెన్‌లో సైనా, శ్రీకాంత్ ఫైనల్‌కు చేరడంతోపాటు టైటిల్స్ సాధించారు.

2   ప్రకాశ్ పదుకొనె, సైనా నెహ్వాల్ తర్వాత హాంకాంగ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన భారత క్రీడాకారులుగా సమీర్, సింధు గుర్తింపు పొందారు. 1982లో ప్రకాశ్, 2010లో సైనా ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు విజేతగా కూడా నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement