పారిస్: ఈ సీజన్‌లో నిరాశాజనక ప్రదర్శన కొనసాగిస్తూ... భారత అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, సమీర్ వర్మ ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోరీ్నలో తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21–15, 7–21, 14–21తో రెండో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో... కశ్యప్ 11–21, 9–21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో... సమీర్ వర్మ 84 నిమిషాల్లో 22–20, 18–21, 18–21తో నిషిమోటో (జపాన్) చేతిలో ఓడిపోయారు.
సైనా శుభారంభం...
మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సైనా నెహా్వల్ 23–21, 21–17తో చెయుంగ్ ఎన్గాన్ యి (హాంకాంగ్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా 13–21, 18–21తో క్రిస్ అడ్‌కాక్–గాబ్రియేలా అడ్‌కాక్ (ఇంగ్లండ్) చేతిలో... అశ్విని పొన్నప్ప–సాత్విక్ సాయిరాజ్ 17–21, 18–21తో సియో సెయుంగ్ జే–చే యుజుంగ్ (కొరియా) చేతిలో పరాయం పాలయ్యారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 21–16, 21–14తో జెలీ మాస్–రాబిన్ తబెలింగ్ (నెదర్లాండ్స్)లపై నెగ్గగా... సుమీత్ రెడ్డి–మనూ అత్రి 19–21, 22–20, 15–21తో బెన్ లేన్–సీన్ వెండీ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–అశి్వని పొన్నప్ప 21–16, 13–21, 17–21తో లీ సో హీ–షిన్ సెయుంగ్ చాన్ (కొరియా) చేతిలో ఓటమి పాలయ్యారు.
శ్రీకాంత్‌కు నిరాశ
Published Thu, Oct 24 2019 4:03 AM | Last Updated on Thu, Oct 24 2019 4:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment