ఓదెన్స్(డెన్మార్క్): గత కొంతకాలంగా తొలి రౌండ్‌లోనే వెనుదిరుగుతున్న భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు మరోసారి అదే ఫలితం పునరావృతమైంది. డెన్మార్క్ ఓపెన్ సూప ర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో బుధ వారం మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సైనా 15–21, 21–23తో తక హాషి(జపాన్) చేతిలో ఓటమి చవిచూసిం ది. లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజే త, ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సైనా ఈ మ్యాచ్‌లో తన పూర్తి సామర్థ్యం మేరకు ఆడలేకపోయింది.
తొలి సెట్‌ను చేజార్చు కున్నాక హోరాహోరీగా సాగిన రెండో సెట్లో సైనా పోరాడినప్పటికీ చివరికి ప్రత్యర్థి ధాటికి పరాజయం పాలైంది. కాగా, పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ 21–11, 21–11తో సునెయమ (జపాన్) ను చిత్తు చేసి ప్రిక్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. తదుపరి మ్యాచ్‌లో చెన్ లాంగ్(చైనా)తో సమీర్ తలపడతాడు. మరోవైపు మిక్స్‌డ్ డబుల్స్‌లో ప్రణవ్ జెర్రీ చోప్రా– సిక్కిరెడ్డి ద్వయం 21–16, 21–11తో సీడెల్–ఎఫ్లర్(జర్మనీ) జోడీపై గెలిచి తదుపరి రౌండ్‌కు చేరగా, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి–అశ్వని పొన్నప్ప ద్వయం ప్రత్యర్థి జోడీ వాంగ్–హువాంగ్(చైనా)కు వాకోవర్ ఇచ్చి పోటీ నుంచి తప్పుకొంది.
Comments
Please login to add a commentAdd a comment