
ఓడెన్స్: ఈ ఏడాది లోటుగా ఉన్న అంతర్జాతీయ టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పీవీ సింధు మరో టోర్నీకి సిద్ధమయ్యారు. మంగళవారం మొదలయ్యే డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సైనా, సింధులతోపాటు పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్, సాయిప్రణీత్, సమీర్ వర్మ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తొలి రౌండ్‌లో బీవెన్ జాంగ్ (అమెరికా)తో సింధు; యి ఎన్గాన్ చెయుంగ్ (హాంకాంగ్)తో సైనా తలపడతారు.
భారత స్టార్స్ ఇద్దరికీ కఠినమైన ‘డ్రా’ పడింది. తొలి రౌండ్ అడ్డంకిని అధిగమిస్తే ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్ అకానె యామగుచి (జపాన్)తో సైనా; అయా ఒహోరి (జపాన్)తో సింధు ఆడే అవకాశముంది. ఈ రౌండ్‌ను దాటితే క్వార్టర్స్‌లో ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సింధు; మాజీ ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో సైనా తలపడే చాన్స్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment