డబుల్స్ ఫైనల్లో సిక్కి రెడ్డి | Badminton Championship:- doubles final sikki Reddy | Sakshi
Sakshi News home page

డబుల్స్ ఫైనల్లో సిక్కి రెడ్డి

Published Sun, Apr 10 2016 12:44 AM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM

డబుల్స్ ఫైనల్లో సిక్కి రెడ్డి

డబుల్స్ ఫైనల్లో సిక్కి రెడ్డి

చండీగఢ్:  జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సింగిల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారులకు నిరాశ ఎదురైంది. డబుల్స్‌లో మాత్రం సిక్కి రెడ్డి మహిళల, మిక్స్‌డ్ విభాగాలలో ఫైనల్‌కు అర్హత సాధించింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ రుత్విక శివాని 21-10, 18-21, 18-21తో పి.సి.తులసీ (కేరళ) చేతిలో ఓడిపోగా... పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో గురుసాయిదత్ 21-15, 12-21, 14-21తో సమీర్ వర్మ (మధ్యప్రదేశ్) చేతిలో పరాజయం పాలయ్యాడు.

మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె ద్వయం 21-17, 17-21, 22-20తో మేఘన-మనీషా (తెలంగాణ) జోడీపై గెలుపొందగా... మిక్స్‌డ్ డబుల్స్ సెమీఫైనల్లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా జంట 21-9, 21-14తో నందగోపాల్-మేఘన జోడీని ఓడించింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్ సాయిరాజ్-కృష్ణ ప్రసాద్ ద్వయం 19-21, 20-22తో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దేవాల్కర్ జంట చేతిలో ఓడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement