![Srikanth And Sameer Progress In Korea Masters - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/21/sri.jpg.webp?itok=5v886lh1)
గ్వాంగ్‌జు (కొరియా): భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ కొరియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ శ్రీకాంత్ 21–18, 21–17తో వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)పై విజయం సాధించాడు. భారత్‌కే చెందిన ‘వర్మ బ్రదర్స్’ సమీర్, సౌరభ్‌లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. సకాయ్ కజుమసా (జపాన్)తో జరిగిన మ్యాచ్‌లో సమీర్ వర్మ తొలి గేమ్‌లో 11–8తో ఆధిక్యంలో ఉన్న దశలో కజుమసా గాయంతో వైదొలిగాడు. జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ 21–13, 12–21, 13–21తో కిమ్ డాంగ్‌హున్ (కొరియా) చేతిలో ఓడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment