ఇద్దరు అమ్మాయిల ప్రేమకి అడ్డు చెప్పడంతో.. | love story of two girls takes new step | Sakshi
Sakshi News home page

ఇద్దరు అమ్మాయిల ప్రేమకి అడ్డు చెప్పడంతో..

Published Thu, Jan 12 2017 6:34 PM | Last Updated on Tue, Sep 5 2017 1:06 AM

love story of two girls takes new step

కమాన్‌పూర్‌(కరీంనగర్‌): ఇద్దరు యువతులు వివాహం చేసుకునేందుకు యత్నించారు. పెద్దలు అంగీకరించకపోవటంతో చెప్పాపెట్టకుండా ఇద్దరు కలిసి వెళ్లిపోయారు. కరీంనగర్‌ జిల్లా కమాన్‌పూర్‌ మండలం జూలపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలివీ..గ్రామానికి చెందిన శిరీష, రామగిరి మండలం సెంటనరీకాలనీకి చెందిన సింధు గతకొద్ది రోజులుగా చనువుగా ఉంటున్నారు. ఇటీవల వారిద్దరూ కనిపించకుండాపోయారు.

దీనిపై రెండు కుటుంబాల వారు  కమాన్‌పూర్, రామగిరి పోలీస్‌స్టేషన్‌లో వేరువేరుగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రెండు ఠాణాల పోలీసులు విచారణ నిర్వహించగా సింధు, శీరీషలు కలిసి వెళ్లినట్లు తేలింది. రెండు నెలల క్రితం సింధు శిరీషలు వివాహం చేసుకునేందుకు హైదరాబాద్‌లోని ఓ తెలుగు టీవీ చానల్‌ కేంద్రానికి వెళ్లారు. ఆ చానల్‌ నిర్వహకులు ఇద్దరి యువవతుల కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌ చేసి, ఇంటికి పంపించారు. అయితే, ఈ నెల 5న శిరీష, సింధు ఇద్దరు కలిసి వారి ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో రెండు కుటుంబాల సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement