
అమ్మా.. నేను సింధుతో ఫొటో దిగాను!
'అమ్మా.. నేను సింధుతో ఫొటో దిగాను. గర్వంగా ఉంది'.. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన తల్లికి చెప్పిన మాటలివి. ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన సింధును బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసల్లో ముంచెత్తారు.
సల్మాన్ ఖాన్ సింధుతో దిగిన ఫొటోను ట్విట్టర్ లో పెట్టి.. 'మా అమ్మతో కలిసి ఫైనల్ మ్యాచ్ ను టీవీలో చూశాను. సింధుతో నేను ఫొటో దిగిన విషయాన్ని అమ్మకు చెప్పాను. గర్వంగా ఉంది' అని పేర్కొన్నారు.
అమితాబ్ స్పందిస్తూ.. 'సింధు.. నువ్వు మనస్ఫూర్తిగా శ్రద్ధను పెట్టి ఫైనల్ ఆడావు. నిన్ను చూసి యావత్ దేశం గర్విస్తోంది. గర్వకారణమైన ఈ సందర్భాన్ని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. 120 కోట్లమంది నీకు మద్దతుగా ఉన్నారు. ఇంతకన్నా గొప్ప విజయం ఏముంటుంది' అని ట్వీట్ చేశారు. సింధు విజయం భవిష్యత్తులో ఒలింపిక్స్ లో భారత అవకాశాలనే కాదు.. మహిళా సాధికారితకు దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీపికా పదుకొనే కూడా సింధును ప్రశంసల్లో ముంచెత్తింది.
Saw d finals on tv with my mom and told her I hv a picture with Sindhu . Proud . pic.twitter.com/Ka9JHvnsjT
— Salman Khan (@BeingSalmanKhan) 19 August 2016