సాక్షి, కర్నూలు జిల్లా: చదువుకోవాలని ఆశ ఉన్నా.. అందుకు కుటుంబ పరిస్థితులు సహకరించడం లేదు. దీంతో ఆ బాలిక వారంలో నాలుగు రోజులు పనికి వెళ్తోంది. మూడు రోజులు బడికి వెళ్తూ శ్రద్ధగా చదువుకుంటోంది. గోనెగండ్ల మండలం చిన్నమరివీడు గ్రామానికి చెందిన బోయ సింధు.. గ్రామంలోని ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు బోయ పార్వతి, బోయ గోవిందులకు ఇల్లు తప్ప ఏమీ లేదు.
వీరు రోజూ కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. ఇల్లు గడవడం కష్టంగా ఉండటంతో వీరికి తోడుగా సింధు పొలం పనులకు వెళ్తోంది. తాము చాలా పేదరికంలో ఉన్నామని, బతుకు దెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినప్పుడు బిడ్డపై బెంగగా ఉంటుందని బోయ పార్వతి, గోవిందు తెలిపారు. బిడ్డ చదువుకు ఇబ్బంది లేకుండా అధికారులు కేజీబీవీలో సీటు ఇప్పించాలని వీరు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment