కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించిన తెలుగుతేజాలు హైదరాబాద్ తిరిగొచ్చారు.
హైదరాబాద్: కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించిన తెలుగుతేజాలు హైదరాబాద్ తిరిగొచ్చారు. మంగళవారం సాయంత్రం బ్యాడ్మింటన్ క్రీడాకారులు పారుపల్లి కశ్యప్, పీవీ సింధు శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు.
గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో కశ్యప్ పసిడి పతకం, సింధు కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. కశ్యప్, సింధుతో పాటు గురుసాయి దత్ ఇతర క్రీడాకారులు నగరానికి వచ్చారు.