సాక్షి, హైదరాబాద్: 18 ఏళ్ల వయసులోనే ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ సంచలనం పూసర్ల వెంకట సింధుకు పురస్కారం అందుకునే అదృష్టం మాత్రం దక్కలేదు. శనివారం ముంబైలో ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) ఫైనల్ ఆడుతున్న కారణంగా సింధు...ఢిల్లీలో అర్జున ప్రదానోత్సవం కార్యక్రమానికి వెళ్లలేకపోయింది. ఆమె తరఫున తల్లిదండ్రులు రమణ, విజయలలో ఒకరు ఈ అవార్డును తీసుకోవడానికి ఆసక్తి చూపించారు.
అయితే ఇందుకు నిబంధనలు అంగీకరించవని కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. కొద్ది రోజుల అనంతరం కేంద్ర క్రీడా శాఖ మంత్రి ద్వారా గానీ, రాష్ట్ర గవర్నర్ ద్వారా గానీ అర్జున అవార్డును సింధుకు అందజేసే అవకాశం ఉంది. మరో వైపు క్రీడా శిక్షణలో అత్యుత్తమ ఫలితాలు అందిస్తున్న ‘పుల్లెల గోపీచంద్ - నిమ్మగడ్డ ఫౌండేషన్ బ్యాడ్మింటన్ అకాడమీ’కి దక్కిన ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్’ను గోపీచంద్ తల్లిదండ్రులు సుబ్బారావమ్మ, సుభాష్ చంద్ర అందుకున్నారు.
సింధుకు ఆ అదృష్టం ఎప్పుడో!
Published Sun, Sep 1 2013 1:54 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM
Advertisement