
క్వార్టర్స్‌లో సింధు, ప్రణీత్
ప్రణయ్ కూడా...
మకావు ఓపెన్ బ్యాడ్మింటన్
మకావు: డిఫెండింగ్ చాంపియన్ పి.వి.సింధు మకావు ఓపెన్ బ్యాడ్మింటన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఈ టోర్నీలో ఐదో సీడ్‌గా బరిలోకి దిగిన భారత స్టార్ ప్రి క్వార్టర్ ఫైనల్లో 21-17, 21-18తో లిండావెని ఫనేత్రి (ఇండోనేసియా)పై గెలిచింది. మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సింధు 46 నిమిషాల్లో ప్రత్యర్థిని చిత్తు చేసింది. క్వార్టర్స్‌లో సింధు చైనాకు చెందిన చెన్ యుఫీతో తలపడుతుంది. ఇక పురుషుల విభాగంలో 15వ సీడ్ సాయి ప్రణీత్, ఏడో సీడ్ ప్రణయ్ కూడా క్వార్టర్స్‌కు చేరారు. ప్రి క్వార్టర్స్‌లో ప్రణయ్ 12-21, 21-11, 21-19తో కియావో బిన్ (చైనా)పై నెగ్గాడు. గంటా ఐదు నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను కోల్పోయినా ప్రణయ్ చివరి రెండు గేమ్‌ల్లో బాగా ఆడాడు. సాయి ప్రణీత్ 21-15, 21-6తో గోహ్‌సూన్ (మలేసియా)పై అలవోకగా గెలిచాడు.