ఎంసెట్ ఫలితాల్లో కనీవినీ ఎరుగుని అద్భుత విజయాలు శ్రీచైతన్య నారాయణ విద్యాసంస్థలు సాధించాయని సంస్థల అధినేతలు బి.ఎస్.రావు, సింధు నారాయణ తెలిపారు. మెడికల్ స్టేట్ ఫస్ట్ ర్యాంకుతో పాటు తొలి 10ర్యాంకుల్లో 10, 25 ర్యాంకుల్లో 23 తమ విద్యార్థులు కైవసం చేసుకున్నారని చెప్పారు. ఫస్ట్ ర్యాంక్ గుర్రం సాయి శ్రీనివాస్, రెండో ర్యాంక్ బి.దివ్య, మూడో ర్యాంక్ కె. పృథ్వీరాజ్, 4వ ర్యాంక్ డి.హరిత, 5వ ర్యాంక్ మనోగ్నిత రెడ్డి, 6వ ర్యాంక్ భరత్‌కుమార్, 7వ ర్యాంక్ పి.శ్రీవిద్య, 8వ ర్యాంక్ సాత్విక్‌రెడ్డి, 9వ ర్యాంక్ ఆర్.సాయి హర్ష తేజ, 10 ర్యాంక్ గంటా సాయి నిఖిల సాధించారని పేర్కొన్నారు. 50లోపు 45 ర్యాంక్‌లు, 100లోపు 93 ర్యాంక్‌లు కైవసం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా ఇంజనీరింగ్ స్టేట్ ఫస్ట్ ర్యాంకుతో పాటు మొదటి 10 ర్యాంకుల్లో 10, 25 ర్యాంకుల్లో 24 నారాయణ శ్రీచైతన్య విద్యార్థులు సాధించారని చెప్పారు.
ఫస్ట్ ర్యాంక్ ఎన్.పవన్‌కుమార్, రెండో ర్యాంక్ చాణుక్య వర్ధన్‌రెడ్డి, మూడో ర్యాంక్ నిఖిల్‌కుమార్, 4వ ర్యాంక్ నారు దివాకర్‌రెడ్డి, 5వ ర్యాంకు వి.ఆదిత్యవర్ధన్, 6వ ర్యాంక్ ప్రేమ్ అభినవ్, 7వ ర్యాంక్ అక్షయ్‌కుమార్‌రెడ్డి, 8వర్యాంక్ సాయి కాశ్యప్, 9వ ర్యాంకు పి.ఎస్.సూర్యప్రహర్ష, 10వ ర్యాంక్ సాయి చేతన్ కైవసం చేసుకున్నారని పేర్కొన్నారు. 50లోపు 47 ర్యాంక్‌లు, 100లోపు 92 ర్యాంక్‌లు సాధించారని వెల్లడించారు.
శ్రీచైతన్య నారాయణ అద్భుత విజయాలు
Published Tue, Jun 10 2014 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 8:33 AM
Advertisement
Advertisement