sri chaitanya
-
‘రెడ్‌బుక్ రాజ్యాంగం విద్యార్థుల మీద కూడా చూపిస్తారా?’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో విద్య పేరుతో జరిగే దోపిడీని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర. మంత్రి నారా లోకేష్ ఏం చేస్తున్నారు?.. రెడ్ బుక్ రాజ్యాంగం విద్యార్థుల మీద కూడా చూపిస్తారా? అని ప్రశ్నించారు. అలాగే, చంద్రబాబు హయాంలో మళ్ళీ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పారు.వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో మళ్లీ ప్రైవేటు కాలేజీల వేధింపులు పెరిగాయి. శ్రీ చైతన్య, నారాయణ సంస్థలు ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్నాయి. ఫీజులు చెల్లించకపోతే బయటకు నెట్టేస్తున్నాయి. శ్రీ చైతన్య సంస్థ నిన్న ఒక విద్యార్థిని బయటకు నెట్టింది. తండ్రితో కలిసి ఆ విద్యార్థి కాలేజీ ఎదుట ధర్నా చేశాడు. విద్య పేరుతో జరిగే ఈ దోపిడీని వ్యతిరేకిస్తున్నాం. మంత్రి లోకేష్ ఏం చేస్తున్నారు?. రెడ్‌బుక్ రాజ్యాంగం విద్యార్థుల మీద కూడా చూపిస్తారా?.ఫీజుల మానిటరింగ్ కమిటీ ఏం చేస్తుందో అర్థం కావటం లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఫీజుల పేరుతో వేధింపులనేవే జరగలేదు. చంద్రబాబు హయాంలో మళ్లీ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డులో నారాయణ సంస్థ సిబ్బందిని నియమించటం సిగ్గుచేటు. ఫీజుల గురించి వేధిస్తే వైఎస్సార్సీపీ హయాంలో బ్లాక్ లిస్టులో పెట్టారు. ఇప్పుడు ఆ పని ఎందుకు చేయటం లేదు?. విద్యార్థులను మానసిక ఆందోళనకు గురి చేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలి.కార్పొరేట్ విద్యాసంస్థల్లో పిల్లలు పిట్టల్లాగా రాలిపోతున్నారు. నారాయణ, శ్రీ చైతన్య సంస్థలపై విచారణ జరపాలి. ఆ సంస్థలు పుస్తకాల ఫీజే రూ.18వేలు చొప్పున వసూలు చేస్తున్నారు. రూ.50ల ఐడీ కార్డుకు రూ.400 వసూలు చేస్తున్నారు. ఇలాంటి చర్యలను వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం సీరియస్‌గా తీసుకుంటుంది. ఈ ప్రభుత్వ చర్యలపై ఉద్యమిస్తాం. నారాయణ, శ్రీ చైతన్య సంస్థల్లోని సిబ్బందికి సరైన జీతాలు ఇవ్వటం లేదు. పని భారంతో వేధింపులకు గురి చేస్తున్నారు. విద్యార్థుల నుండి ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తూ సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వటం లేదు’ అని ఆరోపించారు. -
నీటి కుంటలో పడి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థి మృతి
సాక్షి, పల్నాడు జిల్లా: రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఓ మహిళ, శ్రీచైతన్య స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. గురజాల మండలం పులిపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో పడి ఐదవ తరగతి విద్యార్థి కుంచె సుభాష్ (11) ప్రాణాలు కోల్పోయాడు. స్కూల్ బస్సు పులిపాడు గ్రామం నుండి స్కూల్ విద్యార్థులతో దాచేపల్లికి వెళ్తుంది. ఆ సమయంలో స్కూల్ బస్ రేడియేటర్లో మంటలు చెలరేగాయి. దీంతో మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు బస్సు క్లీనర్ పప్పుల కోటేశ్వరరావు ప్రయత్నించాడు. ఇందుకోసం కుంటలో ఉన్న నీటిని తోడేందుకు ప్రయత్నించాడు. సాయం కోసం సుభాష్‌ను వెంట తీసుకెళ్లాడు. అయితే నీటి కుంటలో నుంచి నీటిని తోడేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవ శాత్తూ కాలు జారి నీటి కుంటలో జారి ఇద్దరూ పడిపోయారు. ఈ దుర్ఘటనలో బస్సు క్లీనర్ పప్పుల కోటేశ్వరరావు, ఐదవ తరగతి విద్యార్థి కుంచె సుభాష్ మృతి చెందారు.మరో దుర్ఘటనలో తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న మరో దుర్ఘటనలో బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు స్కూటీపై వెళ్తున్న మహిళను ఓ కారు ఢీకొంది. రూరల్ ఎస్ఐ ఎస్కే మూర్తి తెలిపిన వివరాల మేరకు.. నగరి మండలం మాంగాడుకు చెందిన గోవిందమ్మ(48), తన కుమారుడు భానుప్రకాష్ సమీప బంధువు కిరణ్‌తో కలిసి చంద్రగిరి మండలం పిచ్చినాయుడుపల్లిలో బంధువుల ఇంట్లో పురుడు ఫంక్షన్‌కు స్కూటర్లో వెళ్తున్నారు.పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై వకుళామాత ఆలయం సర్కిల్ వద్ద పేరూరు పంచాయతీలో నుంచి వేగంగా బైపాస్ పైకి దూసుకొచ్చిన గుర్తు తెలియని కారు గోవిందమ్మ ప్రయాణిస్తున్న స్కూటర్‌ను ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో గోవిందమ్మ స్కూటర్‌పై నుంచి కింద పడి తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది.స్కూటర్ నడుపుతున్న కిరణ్, మృతురాలి కుమారుడు భానుప్రకాష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని తిరుపతి రూరల్ ఎస్ఐ ఎస్కే మూర్తి పరిశీలించారు. కేసు నమోదు విచారిస్తున్నట్లు ఎస్ఐ మూర్తి తెలిపారు. -
శ్రీచైతన్య విద్యార్థి సాత్విక్ సూసైడ్ పై ఎంక్వెరీ కమిటీ రిపోర్టు
-
ఇంటర్ విద్యార్థి సాత్విక్ సూసైడ్ కేసులో నలుగురు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ విద్యార్థి స్వాత్విక్ సూసైడ్ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. లెక్చరర్ ఆచార్య, వార్డెన్ నరేష్ సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని రాజేంద్రనగర్ మేజిస్ట్రేట్ ముందు నార్సింగి పోలీసులు హాజరుపరిచారు కాగా, నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి సాత్విక్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.. గత మంగళవారం రాత్రి క్లాస్ రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి తరలించేలోపే సాత్విక్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు తోటి విద్యార్థులు సైతం కాలేజీ ఒత్తిడి వల్లే సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ఆరోపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా, నార్సింగి శ్రీచైతన్య కాలేజీ హాస్టల్ నుంచి సాత్విక్ సామగ్రిని తీసుకుంటున్న సమయంలో అతడి డ్రెస్‌ల మధ్య సూసైడ్ నోట్ బయటపడింది. అందులో ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, అడ్మిన్ ప్రిన్సిపాల్ ఆచార్య, శోభన్, క్యాంపస్ ఇన్చార్జి నరేశ్‌ల వేధింపులు భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సాత్విక్ పేర్కొన్నాడు. తనతోపాటు తన మిత్రులకూ వారు నరకం చూపిస్తున్నారని, వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరాడు. చదవండి: సాత్విక్ సూసైడ్ నోట్.. నివ్వెరపోయే విషయాలు ‘‘అమ్మ, నాన్న, అన్న.. ఈ పనిచేస్తున్నందుకు నన్ను క్షమించండి. మిమ్మల్ని బాధపెట్టాలని కాదు. కాలేజీలో పెట్టే మెంటల్ టార్చర్, వాళ్లు చూపే నరకాన్ని భరించలేకనే ఈ చెడ్డ పని చేస్తున్నాను. మిస్ యూ. మీ అందరినీ బాధపెడుతున్నందుకు సారీ.. నన్ను క్షమించండి, నా కోసం మీరు బాధపడితే నా ఆత్మ శాంతించదు. మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. అమ్మా, నాన్నకు నేను లేనిలోటు రాకుండా చూసుకో అన్నా..’’అని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఆ లేఖ బాగా నలిగిపోయి ఉండటం చూస్తే.. కొన్ని రోజుల కిందే రాసిపెట్టుకున్నట్టు ఉందని సాత్విక్ స్నేహితులు చెప్తున్నారు. -
జేఈఈ, నీట్ కోర్సులు: అమెజాన్‌తో చేతులు కలిపిన శ్రీ చైతన్య
న్యూఢిల్లీ: అమెజాన్ అకాడెమీ, విద్యాసంస్థల గ్రూప్ శ్రీ చైతన్య తాజాగా చేతులు కలిపాయి. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ), నేషనల్ ఎలిజిబిలిటీ–కమ్–ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) రాసేవారి కోసం పూర్తి స్థాయి సిలబస్ కోర్సులను ఆవిష్కరించనున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం అమెజాన్ అకాడెమీలో శ్రీ చైతన్య అధ్యాపకులు లైవ్ ఆన్లైన్ తరగతులు బోధిస్తారు. అమెజాన్ అకాడెమీ రూపొందించిన బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ స్థాయి దాకా కంటెం ట్ విద్యార్థులకు అందుబాటులో ఉంటుందని అమెజాన్ ఇండియా డైరెక్టర్ అమోల్ గుర్వారా, ఇన్ఫినిటీ లెర్న్ (శ్రీ చైతన్య గ్రూప్) డైరెక్టర్ సుష్మ బొప్పన తెలిపారు. చదవండి : సిద్ధాంత్‌కు సీటివ్వండి! -
చైతన్య,నారాయణ కాలేజీల్లో ఆత్మహత్యలపై హైకోర్టు సీరియస్
-
విద్యార్థి మరణానికి నిరసనగా ఆందోళన
పీఎం పాలెం/ మధురవాడ(భీమిలి): చంద్రంపాలెం పాఠశాలలో విద్యార్థుల నడుమ జరిగిన సంఘటనను అవమానంగా భావించి మనస్తాపంతో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి గురువారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహించిన బంధువులు మృతదేహంలో పాఠశాలలో ఆందోళనకు దిగారు. పీఎం పాలెం పోలీస్‌స్టేషన్ ఎస్ఐ గణేష్ తెలిపిన వివరాల ప్రకారం... మారికవలస రాజీవ్ గృహకల్ప బ్లాకు నంబరు 31లో కుటుంబంతో నివసిస్తున్న ఉప్పాడ అప్పలరాజుకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు మణిదీప్ (15) ఉన్నారు. మణిదీప్ చంద్రంపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. గురువారం తోటి విద్యార్థులు హేలనగా మాట్లాడారని సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చి... సమీపంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలం పరిశీలించి మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. మృతదేహంతో పాఠశాలలో ఆందోళన కేజీహెచ్ నుంచి మణిదీప్ మృతదేహాన్ని శుక్రవారం తీసుకొచ్చిన బంధువులు నేరుగా చంద్రంపాలెంలోని పాఠశాలలోకి ప్రవేశించి ఆందోళనకు దిగారు. పాఠశాలలో తోటి విద్యార్థి వేధించడం వల్లే మణిదీప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, పిల్లలు చనిపోయే పరిస్థితులు తలెత్తుతుంటే ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. పాఠశాలలో చదివే విద్యార్థి చనిపోతే ఉపాధ్యాయులు కనీసం చూడడానికి కూడా రాకపోవడం ఏమిటని బంధువులు మండిపడ్డారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పీఎంపాలెం ఎస్ఐ గణేష్ సిబ్బందితో సంఘటన స్థలికి ముందుగానే చేరుకొని మృతుని బంధువులకు నచ్చజెప్పడంతో శాంతించారు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలను మూసివేయాలి
కామారెడ్డి టౌన్: ఎంసెట్ పేపర్ లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న శ్రీచైత న్య, నారాయణ విద్యాసంస్థలను మూసివేయాల ని పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎన్. ఆజాద్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ వద్ద విద్యాసంస్థల దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడా రు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో శ్రీ చైతన్య డీన్ వాసుబాబు ను అరెస్ట్ చేశారని, ఇందుకు వారి విద్యాసంస్థలను తక్షణమే ప్రభుత్వం మూసివేయాలని డి మాండ్ చేశారు. ర్యాంకుల పేరుతో లక్షలాదిగా వసూలు చేసుకోవడానికి తల్లిదండ్రులను, విద్యార్థులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. విద్యార్థులపై ర్యాంకుల కోసం తీవ్రమానసిక ఒత్తిడికి గురిచేయడంతో ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా ఈ విద్యాసంస్థల్లో ఉన్నాయన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సురేష్, విఠల్, ఉపాధ్యక్షులు నిమ్మ సురేష్, నాయకులు శేఖర్, రమేశ్, ప్రకాశ్, క్రిష్ణ ఉన్నారు. -
విజయవాడలో శ్రీ చైతన్య కళాశాల నిర్వాకం
సాక్షి, విజయవాడ : గురునానక్ కాలనీలోని శ్రీ చైతన్య కాలేజ్ క్యాంపస్‌లో విద్యార్ధుల తల్లిదండ్రులు, కళాశాల సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పరీక్షలు ముగియడంతో విద్యార్థుల తల్లిదండ్రలు వారిని ఇంటికి వెళ్ళటానికి కళాశాలకు చేరుకున్నారు. అయితే ఈ సమయంలో విద్యార్థుల ఫీజులకు అదనంగా మరో పదివేలు కట్టి సామానులు తీసుకువెళ్లాలంటూ సిబ్బంది వారిని అడ్డకున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అనుకున్నదాని ప్రకారం ఫీజు అంతా కట్టిన తరువాత అదనంగా మరో పదివేలు ఎందుకు కట్టాలని కళాశాల సిబ్బందిని నిలదీశారు. అయితే యాజమాన్యం నుంచి సరైన సమాధానం లేకపోవడంతో ఆందోళన చేపట్టారు. అదనంగా ఫీజు కడితేనే విద్యార్థుల సమాన్లు, సర్టిఫికేట్లు ఇస్తామంటున్నారని తల్లి దండ్రులు ఆరోపించారు. -
‘నారాయణ-చైతన్య’ మధ్య ర్యాంకుల గొడవ
-
‘చైతన్య-నారాయణ’ మధ్య ర్యాంకుల వార్
సాక్షి, హైదరాబాద్ : ర్యాంకుల వ్యవహారంలో కార్పోరేట్ కాలేజీలు శ్రీ చైతన్య, నారాయణ యాజమాన్యాల మధ్య వార్ వేడెక్కింది. తమ ర్యాంకులను నారాయణకు వచ్చినట్టు చెప్పుకుంటున్నారని చైతన్య కాలేజీల చైర్మన్ బీవీ రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ఎంసెట్‌లో తమకు టాప్ ర్యాంకు వస్తే నారాయణకు వచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణ, శ్రీ చైతన్య కలిసి స్టార్ట్ చేసిన శార్వాణి గ్రూప్ పనిచేయడం లేదని, ప్రస్తుతం ఈ రెండు వేర్వేరని స్పష్టం చేశారు. ఇక నుంచి చైనా( చైతన్య-నారాయణ) బ్యాచ్‌లు ఉండవన్నారు. శ్రీ చైతన్య స్కూల్లో చదువుకున్న విద్యార్థులను నారాయణ.. తమ విద్యార్థులుగా చెప్పుకుంటుందని మండిపడ్డారు. జేఈఈలోని టాప్ 5 ర్యాంకులు తమ విద్యార్థులవేనని, కానీ నారాయణ ర్యాంకుల విషయంలో తప్పుడు ప్రకటనలు చేస్తోందన్నారు. అవసరమైతే దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్, జేఈఈ, ఎంసెట్ ఫలితాల్లో ఇరు కాలేజీలు ఒకే ర్యాంకులు వచ్చాయని ప్రకటనలివ్వడంపై సోషల్ మీడియాలో విమర్శలొస్తున్నాయి. -
నారాయణ,శ్రీ చైతన్యలపై హైకోర్టు సీరియస్
-
పోలీసుల అదుపులో ‘శ్రీ చైతన్య’ సిబ్బంది
-
పోలీసుల అదుపులో ‘శ్రీ చైతన్య’ సిబ్బంది
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/నెల్లూరు (టౌన్): ర్యాంకర్లను ప్రలోభపెడుతున్నారన్న వ్యవహారం కార్పొరేట్ సంస్థలైన శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల మధ్య అగ్గి రాజేసింది. విద్యార్థుల్ని కిడ్నాప్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీ చైతన్య విద్యాసంస్థల సిబ్బంది లింగాల రమేష్, ఐ.పార్థసారథిని నెల్లూరు వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివాదం మొదలైందిలా: నగరంలోని నారాయణ స్కూల్లో పదో తరగతి చదువుతున్న నెల్లూరు చాకలి వీధికి చెందిన రియాజ్ అహ్మద్, ఆరిఫా దంపతుల కుమారుడు ఎండీ ఫాజిల్‌ను తమ కళాశాలలో ఉచితంగా బోధిస్తామని చెప్పి శ్రీచైతన్య ఉద్యోగులు లింగాల రమేష్, ఐ.పార్థసారథిలు ఈ నెల 20 హైదరాబాద్ తీసుకెళ్లిన సంగతి విదితమే. అక్కడి అప్పయ్య సొసైటీలోని శ్రీ చైతన్య రెసిడెన్షియల్ క్యాంపస్‌లో ఉన్న ఫాజిల్‌ను కలిసేందుకు అతని తల్లిదండ్రులు యత్నించినా అవకాశమివ్వని నేపథ్యంలో విద్యార్థి తల్లి ఆరిఫా 25న నెల్లూరు వన్‌టౌన్‌లో స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు శుక్రవారం శ్రీచైతన్య సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు శుక్రవారం ఉదయం వన్‌టౌన్ పోలీసులు హైదరాబాద్ వెళ్లారు. శనివారం ఉదయానికి విద్యార్థి ఫాజిల్‌ను నెల్లూరు తీసుకురానున్నారు. రాజకీయ పలుకుబడితో ఇబ్బంది పెడుతున్నారు: రాజకీయ పలుకుబడితోనే మంత్రి నారాయణ తమ యాజమాన్యాన్ని ఇబ్బంది పెడుతున్నారని శ్రీ చైతన్య విద్యా సంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మా బొప్పన ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ నారాయణ విద్యాసంస్థలతో తమకు గల భాగస్వామ్యంపై పునరాలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తల్లిదండ్రుల అంగీకారం, పిల్లల ఇష్టంతోనే నారాయణ స్కూల్ నుంచి శ్రీచైతన్య స్కూల్‌కు ముగ్గురు విద్యార్థులను తీసుకెళ్లినట్లు తెలిపారు. నిందలు దారుణం: నెల్లూరులోని తమ విద్యార్థుల తల్లిదండ్రులను ప్రలోభపెట్టి హైదరాబాద్‌కు తరలించడమే కాకుండా.. శ్రీ చైతన్య విద్యాసంస్థల నిర్వాహకులు తమ సంస్థపై నిందలు వేయడం దారుణమని నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ విజయభాస్కర్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
కాసులు కొట్టే కాలేజీలు
సాక్షి, అమరావతి: నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలు నిబంధనలకు పాతరేస్తూ దశాబ్దాల తరబడి విద్యార్ధులను నిలువునా దోపిడీ చేస్తున్నాయి. ఎడ్యుకేషనల్ ట్రస్టుల మాటున ఈ కార్పొరేట్ విద్యాసంస్థలు చేస్తున్న అరాచకాలు అన్నీఇన్నీ కావు. చదువును వ్యాపార వస్తువుగా మార్చి ఒక్కో విద్యార్థి నుంచి లక్షల్లో వసూలు చేస్తూ ఏటా కోట్లాది రూపాయల టర్నోవర్‌తో విద్యా వ్యాపారాన్ని సాగిస్తున్నాయి. మరోపక్క ఎడ్యుకేషన్ ట్రస్టు మాటున సేవా కార్యక్రమమంటూ ఆదాయ పన్నుతో సహా ఇతర పన్నులు ఎగవేస్తున్నాయి. ఇదేదో బయటి నుంచి వినిపించే విమర్శలు కాదు. ఈ రెండు సంస్థల వ్యవహారాలపై విచారణ జరిపిన తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్విభాగం తేల్చిన నిజాలు. అక్రమాలకు పాల్పడుతున్న నారాయణ, శ్రీచైతన్య కాలేజీల గుర్తింపును రద్దుచేయాలని కొద్దికాలం క్రితం తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందించింది. గత ఏడాదికి సంబంధించి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని కాలేజీలను క్షుణ్నంగా తనిఖీలు చేసి ఈ నివేదిక అందించింది. ఈ రెండు సంస్థల కాలేజీలలో తనిఖీలు జరిపిన తెలంగాణ ఇంటర్ బోర్డు కూడా రీజనల్ ఇన్స్పెక్షన్ నిర్వహించి నివేదిక తయారు చేసింది. విజిలెన్స్ తనిఖీ నివేదికలోని ముఖ్యాంశాలు... అడుగడుగునా అక్రమాలే... లాభాపేక్షలేని విద్యా సంస్థలుగా రిజిస్టరైన నారాయణ, శ్రీచైతన్య యాజమాన్యాలు ట్యూషన్ ఫీజు, కోచింగ్ ఫీజు, హాస్టల్ ఫీజు... ఇలా లక్షల్లో దండుకుంటూ విద్యార్ధులను నిలువుదోపిడీ చేస్తున్నాయి. చారిటబుల్ ట్రస్టులుగా పేర్కొంటున్నా ఈ రెండు సొసైటీల్లో ప్రెసిడెంట్లు, సభ్యులంతా ఆ రెండు కుటుంబాలకు చెందిన వారే కావడం గమనార్హం. సొసైటీ బైలాల్లో పేద విద్యార్ధులకు ఫ్రీ కోచింగ్ తరగతులు, కమ్యూనిటీ డెవలప్మెంటు ప్రాజెక్టులు, గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం, పేదలను ఆదుకొనేందుకు చేతి వృత్తుల కేంద్రాలు, బాల్వాడీ కేంద్రాలు, వయోజన విద్యాకేంద్రాల ఏర్పాటు అంటూ వల్లెవేసిన సంస్థలు ఇందులో ఏ ఒక్కటీ ఆచరించకపోగా విద్యను డబ్బులమయం చేశాయి. ⇒ ఈ రెండు సంస్థలు ఏటా ఫీజులు, ఇతరాల పేరిట రూ.వందల కోట్ల మేర వసూలు చేస్తున్నా ఇన్‌కమ్‌టాక్స్ రిటర్నులలో మాత్రం ఎలాంటి ఆదాయమూ లేనట్లుగా చూపుతున్నాయి. ఎడ్యుకేషనల్ సొసైటీ, కమిటీల పేరిట పన్నులు ఎగవేస్తున్నాయి. ⇒ శ్రీచైతన్య విద్యాసంస్థ 2010–11, 2011–12కు సంబంధించిన ఐటీ రిటర్నులు, ఆడిట్ రిపోర్టు కాపీలను విజిలెన్సుకు అందించింది. వాటిని పరిశీలించిన విజిలెన్సు అధికారులు నివ్వెరపోయారు. ఆడిట్ రిపోర్టులో 2010–11లో రూ.200 కోట్ల మేర టర్నోవర్ ఉన్నట్లు చూపి ఆదాయపు పన్ను రిటర్నులలో మాత్రం ఎలాంటి ఆదాయమూ లేదని చెబుతూ పన్నులను చెల్లించలేదు. పన్నుల ఎగవేత వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతోంది. ⇒ విద్యా వ్యాపారంలో లాభాలకోసం కాలేజీలకు శాశ్వత అఫ్లియేషన్ కాకుండా తాత్కాలిక అఫ్లియేషన్లు తీసుకుంటున్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులపై ఇంటర్ బోర్డు స్పష్టమైన నిబంధనలు విధించినా ఈ కాలేజీలు ఇష్టానుసారం వసూలు చేస్తున్నాయి. ఒక్కో కాలేజీలో ఒక్కో రకమైన ఫీజులుంటున్నాయి. లైబ్రరీ, లాబొరేటరీ లాంటి ఏర్పాట్లు మచ్చుకైనా లేకుండా ఇరుకైన గదుల్లో ప్రధాన రహదారుల పక్కన అపార్టుమెంట్లలో ఈ కాలేజీలను నెలకొల్పారు. ⇒ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేట్ అన్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో ట్యూషన్ ఫీజుల కింద పెంచిన ప్రకారం చూసినా రూ.3 వేల లోపే తీసుకోవాలి. కానీ ఈ కాలేజీలు రూ. 25 వేల నుంచి రూ. లక్ష వరకు పిండుతున్నాయి. హాస్టల్, ఇతర కోచింగ్‌లంటూ అదనంగా మరో 2 లక్షలకు పైగా దండుకొంటున్నాయి. ⇒ ఇంటర్ ప్రవేశాలకు సంబంధించి ఈ రెండు కాలేజీలు విక్రయించిన దరఖాస్తుల సమాచారం, అడ్మిషన్లు పొందిన విద్యార్ధుల వివరాల రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదు. అడ్మిషన్లు పూర్తయ్యాక కంప్యూటర్ ద్వారా తీసిన కాపీలపై ఆర్ఐఓలతో సంతకాలు చేయించుకుంటున్నాయి. ⇒ ప్రైవేట్ కాలేజీల్లో కూడా అడ్మిషన్లను రిజర్వేషన్ల ప్రకారం చేపట్టాలి. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 29 శాతం, వికలాంగులకు 5 శాతం, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 3 శాతం ఇవ్వాల్సి ఉన్నా ఈ సంస్థలు దీన్ని పాటించడం లేదు. ⇒ లాభదాయకంగా ఉండే ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాయి. కొన్ని చోట్ల ఇంటర్ బోర్డు అనుమతులు లేకుండానే తప్పుడు కోడ్ నెంబర్లతో కాలేజీలు నిర్వహిస్తున్నాయి. ⇒ ఒక భవనంలో కాలేజీకి అనుమతి పొంది వేరే చోటుకు మార్చేస్తున్నారు. కొన్ని కాలేజీలను తనిఖీ చేయగా అక్కడ రిజిస్టర్లో పేర్లున్న విద్యార్ధుల్లో కొందరు వేరేచోట చదువుతున్నట్లు గుర్తించారు. ⇒ ఎంపీసీ, బైపీసీ తరగతులు తప్పించి ఆర్ట్స్ తరగతులను ఈ కాలేజీలు నిర్వహించడం లేదు. అవి అంత లాభదాయకం కాకపోవటమే కారణం. కొన్ని చోట్ల ఆర్ట్స్ తరగతులకు అనుమతులు తీసుకొని వాటిని ఎంపీసీ, బైపీసీ సెక్షన్లుగా మార్పు చేస్తున్నాయి. ⇒ విద్యార్ధులకు ఎలాంటి వ్యాయామ విద్యను బోధించడం లేదు. అందుకు సంబంధించిన సిబ్బందిని కూడా నియమించడం లేదు. ఇది బోర్డు నిబంధనలకు విరుద్ధం. ⇒ అద్దె భవనాల్లో కాలేజీలను ఏర్పాటు చేస్తూ తాత్కాలిక అనుమతులు పొందుతున్నాయి. ఇది కేవలం అయిదేళ్ల వరకు మాత్రమే వర్తిస్తుంది. ఆలోపు అవి సొంత భవనాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నా అద్దె భవనాల్లోనే దశాబ్దాల తరబడి కొనసాగుతున్నాయి. ఫీజులపై కమిటీ వేయాలి... కార్పొరేట్ కాలేజీలు ఫీజులు అడ్డగోలుగా వసూలు చేయకుండా నియంత్రించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ మండల, పట్టణ, తదితరాల వారీగా అధ్యయనం చేసి ఫీజులను నిర్ణయించాలి. ఆయా సంస్థలకు వస్తున్న ఆదాయం, జీతాల చెల్లింపు, ఖర్చులను బేరీజు వేసి ఫీజులను నిర్ణయించాలి. విద్యాశాఖలో వియ్యంకుల వారి సంస్థ మాటే వేదవాక్కు నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థల మూలాలు ఏపీలోనే ఉన్నాయి. ఈ రెండు సంస్థలు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో పలు బ్రాంచీలు నెలకొల్పి ఫీజుల పేరిట రెట్టింపు డబ్బులు వసూలు చేస్తూ విద్యార్ధులను పీల్చిపిప్పిచేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. విద్యార్ధుల తల్లిదండ్రుల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నా ప్రభుత్వం కళ్లప్పగించి చూస్తోంది. నారాయణ విద్యాసంస్థల అధిపతి పి.నారాయణకు సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఏకంగా తన కేబినెట్ సహచరుడిగా చేసుకోవడంతో నారాయణ విద్యాసంస్థ ఆగడాలపై అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇక విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, నారాయణ స్వయానా వియ్యంకులు కూడా కావడంతో విద్యాశాఖలో నారాయణ సంస్థలు చెప్పిందే వేదంగా మారిపోయింది. -
నిబంధనలు పాటించకపోతే ఏ కాలేజీనీ వదలం: గంటా
-
ఆ కాలేజీల హాస్టళ్లకు అనుమతుల్లేవ్
సాక్షి, అమరావతి: నారాయణ, శ్రీ చైతన్య కాలేజీలు ఎలాంటి అనుమతుల్లేకుండా అధిక సంఖ్యలో హాస్టళ్లు నడుపుతున్నాయని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఈ విధంగా అనుమతుల్లేకుండా నిర్వహిస్తున్న 158 హాస్టళ్లకు నోటీసులు జారీ చేసి.. మూడు నెలల గడువిచ్చినట్లు తెలిపారు. శుక్రవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంత్రి గంటా మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కుటుంబ సమస్యలు, ఒత్తిడి, ప్రేమ వైఫల్యాలే కారణమని చెప్పారు. ఇందులో ఇంటర్ బోర్డు వైఫల్యం కూడా ఉందన్నారు. కాలేజీలను మూసివేయడం, యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెట్టడం వంటివి సమస్యకు పరిష్కారం కాదన్నారు. ఈ నెల 16న రాష్ట్రంలోని అన్ని కాలేజీల యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణ కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలను ఈ సందర్భంగా స్పష్టం చేస్తామన్నారు. అన్ని కాలేజీల యాజమాన్యాలు.. చక్రపాణి కమిటీ సూచనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కాగా, పదో తరగతి మాదిరిగానే ఇంటర్లో కూడా గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టే యోచన చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 20 తర్వాత ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లతో కలసి జిల్లాల వారీగా పర్యటిస్తానని ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో తెలుగును తప్పనిసరి చేస్తూ త్వరలో జీవో జారీ చేస్తామన్నారు. 6,500 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని ఈ నెల 15న 6,500 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు మంత్రి గంటా తెలిపారు. ఈ కార్యక్రమం విజయవాడలో జరుగుతుందని చెప్పారు. -
‘నారాయణ, చైతన్యల’పై చర్యలు తీసుకోవాలి
నెల్లూరు: ఫిజిక్స్ పేపరు లీకు చేసిన నారాయణ, చైతన్య స్కూల్స్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్ధి సంఘాల నాయుకులు డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏడీ విజయను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా విద్యార్థి సంఘల నాయకులు మాట్లాడుతూ ధనలక్ష్మీపురంలో ఈనెల 24న నారాయణ, శ్రీచైతన్య యాజమాన్యాలు జిల్లా విద్యాశాఖాధికారులు కుమ్మక్కై పేపరు లీక్ చేశారని ఆరోపించారు. ఈ విషయంపై కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు. పేపరు లీకేజిపై ఉన్నతాధికారులను తప్పుదొవ పట్టిస్తున్నారని చెప్పారు. పేపరు లీకుపై వెంటనే విచారణ జరిపి పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని లేకుంటే డీఈఓ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఏపి ప్రత్యేక విద్యార్ధి జేఏసి రాష్ట్ర కన్వీనర్ అంజయ్య, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సురేష్మాదిగ, పీడీఎస్‌యూ జిల్లా «అధ్యక్షులు సునీల్‌మాదిగ, అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు అర్జున్, బాలకృష్ణలు పాల్గొన్నారు. -
నారాయణ, శ్రీచైతన్య కాలేజీలకు జరిమానా
సమాచార హక్కు కమిషనర్ ఉత్తర్వులు శ్రీకాకుళం న్యూకాలనీ: సమాచార హక్కు(స.హ) చట్టం కింద అడిగిన పలు విషయాలకు నిర్దేశిత గడువులోగా స్పందించని కారణంగా శ్రీకాకుళంలోని శ్రీచైతన్య, నారాయణ జూనియర్ కళాశాలలకు స.హ రాష్ట్ర కమిషనర్ తాంతియా కుమారి జరిమానా విధించారు. ఆయా కళాశాలల్లోని పలు అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఓ అర్జీదారుడు కోరారు. నిర్దేశిత గడువులోగా సమాచారాన్ని అందజేయకపోవడంతో ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో స.హ కమిషనర్ స్పందించారు. శ్రీచైతన్య జూనియర్ కళాశాలకు రూ. 25వేలు, నారాయణ కళాశాలకు రూ.10 వేల జరిమానాతో పాటు మరో రూ.2వేల నష్టపరిహారాన్ని కూడా అందజేయాలని ఆదేశించారు. ఈ విషయమై జిల్లా ఇంటర్ బోర్డు పరిపాలనాధికారి సుధాకర్, పర్యవేక్షణాధికారి గోపాలరావులను ‘సాక్షి’ వివరణ కోరగా ఉత్తర్వులు చేరలేదని పేర్కొన్నారు. -
ఐఐటీలో శ్రీచైతన్య-నారాయణ విద్యార్థుల ప్రభంజనం
-
శ్రీచైతన్య నారాయణ అద్భుత విజయాలు
ఎంసెట్ ఫలితాల్లో కనీవినీ ఎరుగుని అద్భుత విజయాలు శ్రీచైతన్య నారాయణ విద్యాసంస్థలు సాధించాయని సంస్థల అధినేతలు బి.ఎస్.రావు, సింధు నారాయణ తెలిపారు. మెడికల్ స్టేట్ ఫస్ట్ ర్యాంకుతో పాటు తొలి 10ర్యాంకుల్లో 10, 25 ర్యాంకుల్లో 23 తమ విద్యార్థులు కైవసం చేసుకున్నారని చెప్పారు. ఫస్ట్ ర్యాంక్ గుర్రం సాయి శ్రీనివాస్, రెండో ర్యాంక్ బి.దివ్య, మూడో ర్యాంక్ కె. పృథ్వీరాజ్, 4వ ర్యాంక్ డి.హరిత, 5వ ర్యాంక్ మనోగ్నిత రెడ్డి, 6వ ర్యాంక్ భరత్‌కుమార్, 7వ ర్యాంక్ పి.శ్రీవిద్య, 8వ ర్యాంక్ సాత్విక్‌రెడ్డి, 9వ ర్యాంక్ ఆర్.సాయి హర్ష తేజ, 10 ర్యాంక్ గంటా సాయి నిఖిల సాధించారని పేర్కొన్నారు. 50లోపు 45 ర్యాంక్‌లు, 100లోపు 93 ర్యాంక్‌లు కైవసం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా ఇంజనీరింగ్ స్టేట్ ఫస్ట్ ర్యాంకుతో పాటు మొదటి 10 ర్యాంకుల్లో 10, 25 ర్యాంకుల్లో 24 నారాయణ శ్రీచైతన్య విద్యార్థులు సాధించారని చెప్పారు. ఫస్ట్ ర్యాంక్ ఎన్.పవన్‌కుమార్, రెండో ర్యాంక్ చాణుక్య వర్ధన్‌రెడ్డి, మూడో ర్యాంక్ నిఖిల్‌కుమార్, 4వ ర్యాంక్ నారు దివాకర్‌రెడ్డి, 5వ ర్యాంకు వి.ఆదిత్యవర్ధన్, 6వ ర్యాంక్ ప్రేమ్ అభినవ్, 7వ ర్యాంక్ అక్షయ్కుమార్రెడ్డి, 8వర్యాంక్ సాయి కాశ్యప్, 9వ ర్యాంకు పి.ఎస్.సూర్యప్రహర్ష, 10వ ర్యాంక్ సాయి చేతన్ కైవసం చేసుకున్నారని పేర్కొన్నారు. 50లోపు 47 ర్యాంక్‌లు, 100లోపు 92 ర్యాంక్‌లు సాధించారని వెల్లడించారు. -
నాసా-స్పేస్ కాంటెస్ట్‌లో ప్రపంచ నం.1గా శ్రీచైతన్య
హైదరాబాద్: అమెరికా, నాసా (నేషనల్ స్పేస్ సొసైటీ)లు సంయుక్తంగా చేపట్టిన ప్రపంచ స్థాయి నాసా-స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ చరిత్రలో ఒకే సంవత్సరంలో అత్యధిక ప్రాజెక్టుల(13) విజేతగా శ్రీచైతన్య రికార్డు సృష్టించినట్టు శ్రీచైతన్య స్కూల్ డెరైక్టర్లు సీమ, సుష్మలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచంలోనే మొదటి స్థానంలో-2, రెండో స్థానంలో-5, మూడో స్థానంలో-3, ఇతర స్థానాల్లో-3 ప్రాజెక్టులు తమ విద్యార్థులు కైవసం చేసుకున్నట్టు తెలిపారు. అదేవిధంగా ప్రపంచంలో ఒకే విద్యాసంస్థ నుంచి అత్యధికంగా ఎంపికైన విద్యార్థుల సంఖ్య(55)లో గానీ, అత్యధిక విన్నింగ్ ప్రాజెక్టుల(13-62 శాతం) సంఖ్యలో గానీ తమ సంస్థ నంబర్-1గా నిలిచిందన్నారు.