సాక్షి, విజయవాడ : గురునానక్ కాలనీలోని శ్రీ చైతన్య కాలేజ్ క్యాంపస్‌లో విద్యార్ధుల తల్లిదండ్రులు, కళాశాల సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పరీక్షలు ముగియడంతో విద్యార్థుల తల్లిదండ్రలు వారిని ఇంటికి వెళ్ళటానికి కళాశాలకు చేరుకున్నారు. అయితే ఈ సమయంలో విద్యార్థుల ఫీజులకు అదనంగా మరో పదివేలు కట్టి సామానులు తీసుకువెళ్లాలంటూ సిబ్బంది వారిని అడ్డకున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అనుకున్నదాని ప్రకారం ఫీజు అంతా కట్టిన తరువాత అదనంగా మరో పదివేలు ఎందుకు కట్టాలని కళాశాల సిబ్బందిని నిలదీశారు. అయితే యాజమాన్యం నుంచి సరైన సమాధానం లేకపోవడంతో ఆందోళన చేపట్టారు. అదనంగా ఫీజు కడితేనే విద్యార్థుల సమాన్లు, సర్టిఫికేట్లు ఇస్తామంటున్నారని తల్లి దండ్రులు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment