నెల్లూరు: ఫిజిక్స్ పేపరు లీకు చేసిన నారాయణ, చైతన్య స్కూల్స్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్ధి సంఘాల నాయుకులు డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏడీ విజయను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా విద్యార్థి సంఘల నాయకులు మాట్లాడుతూ ధనలక్ష్మీపురంలో ఈనెల 24న నారాయణ, శ్రీచైతన్య యాజమాన్యాలు జిల్లా విద్యాశాఖాధికారులు కుమ్మక్కై పేపరు లీక్ చేశారని ఆరోపించారు. ఈ విషయంపై కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు.
పేపరు లీకేజిపై ఉన్నతాధికారులను తప్పుదొవ పట్టిస్తున్నారని చెప్పారు. పేపరు లీకుపై వెంటనే విచారణ జరిపి పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని లేకుంటే డీఈఓ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఏపి ప్రత్యేక విద్యార్ధి జేఏసి రాష్ట్ర కన్వీనర్ అంజయ్య, ఎంఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు సురేష్‌మాదిగ, పీడీఎస్‌యూ జిల్లా «అధ్యక్షులు సునీల్‌మాదిగ, అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు అర్జున్, బాలకృష్ణలు పాల్గొన్నారు.
‘నారాయణ, చైతన్యల’పై చర్యలు తీసుకోవాలి
Published Tue, Mar 28 2017 5:07 PM | Last Updated on Fri, Nov 9 2018 4:32 PM
Advertisement
Advertisement