సమాచార హక్కు కమిషనర్ ఉత్తర్వులు
శ్రీకాకుళం న్యూకాలనీ: సమాచార హక్కు(స.హ) చట్టం కింద అడిగిన పలు విషయాలకు నిర్దేశిత గడువులోగా స్పందించని కారణంగా శ్రీకాకుళంలోని శ్రీచైతన్య, నారాయణ జూనియర్ కళాశాలలకు స.హ రాష్ట్ర కమిషనర్ తాంతియా కుమారి జరిమానా విధించారు. ఆయా కళాశాలల్లోని పలు అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఓ అర్జీదారుడు కోరారు. నిర్దేశిత గడువులోగా సమాచారాన్ని అందజేయకపోవడంతో ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో స.హ కమిషనర్ స్పందించారు.
శ్రీచైతన్య జూనియర్ కళాశాలకు రూ. 25వేలు, నారాయణ కళాశాలకు రూ.10 వేల జరిమానాతో పాటు మరో రూ.2వేల నష్టపరిహారాన్ని కూడా అందజేయాలని ఆదేశించారు. ఈ విషయమై జిల్లా ఇంటర్ బోర్డు పరిపాలనాధికారి సుధాకర్, పర్యవేక్షణాధికారి గోపాలరావులను ‘సాక్షి’ వివరణ కోరగా ఉత్తర్వులు చేరలేదని పేర్కొన్నారు.
నారాయణ, శ్రీచైతన్య కాలేజీలకు జరిమానా
Published Fri, Oct 30 2015 2:10 AM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM
Advertisement
Advertisement