కర్నూలు జిల్లా నన్నూరు సమీపంలోని నారాయణ జూనియర్ కాలేజిలో చదువుతున్న శ్రీకాంత్ అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు.
కర్నూలు జిల్లా నన్నూరు సమీపంలోని నారాయణ జూనియర్ కాలేజిలో చదువుతున్న శ్రీకాంత్ అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. శ్రీకాంత్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతడి స్వస్థలం కర్నూలు జిల్లా ఉల్లిందుకొండ.
అయితే, ఈ ఆత్మహత్య క్యాంపస్ వెలుపల జరిగిందని నారాయణ కాలేజి యాజమాన్యం చెబుతోంది. దీనిపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యాంపస్లో జరిగిన ఘటనను ఏమార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాంత్ ను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.